పీతల సుజాత.. కొత్తపల్లి జవహర్. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఈ ఇద్దరు టీడీపీ నేతలు గతంలో మంత్రులుగా పనిచేశారు. 2014లో చింతలపూడి నుంచి సుజాత, కొవ్వూరు నుంచి జవహర్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇద్దరూ స్థానికేతరులైనప్పటికీ.. అక్కడ టీడీపీకి బలం ఉండటంతో అసెంబ్లీలో ఆనాడు ఈజీగానే అడుగు పెట్టేశారు. గత ప్రభుత్వంలో ముందుగా సుజాత.. తర్వాత జవహర్ కేబినెట్ మంత్రులయ్యారు. గెలిచిన కొత్తలో బాగానే ఉన్నా.. మంత్రులయ్యాక నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు పెరిగిపోయాయి.…