Jubilee Hills Byelection: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియలో చివరి రోజున భారీ హడావుడి నెలకొంది. నామినేషన్ల దాఖలుకు ఇవాళే చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా పోటీకి రంగంలోకి దిగుతున్నారు. ఓవైపు నిరుద్యోగులు తమ సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడానికి నామినేషన్లు వేస్తుండగా, మరోవైపు ఫార్మాసిటీ, RRR ప్రాజెక్టుల బాధితులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.…
Off The Record: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు…షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది చివరిలో జరగాల్సి ఉంది. అందుకనుగుణంగా….పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తోంది BRS. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. మే నెలాఖరు వరకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఆత్మీయ సమ్మేళనాలు అందరినీ కలుపుకొని నిర్వహించాలని…BRS పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఆత్మీయ సమ్మేళనాల సమన్వయం కోసం జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించింది హైకమాండ్. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఒకప్పుడు పీజేఆర్ బలమైన నాయకుడు. ఆయనకంటూ సొంత ఇమేజ్ ఉండేది. పార్టీలో హైదరాబాద్ ప్రస్తావన వస్తే.. పీజేఆర్ పేరు చర్చకు వచ్చేది. పీజేఆర్ మరణం తర్వాత ఆ ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చారు ఆయన తనయుడు విష్ణువర్దన్‌రెడ్డి. ఎమ్మెల్యేగానూ చేశారు. గత రెండు ఎన్నికల్లో నెగ్గుకు రాలేక ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి వైసీపీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీఆర్ఎస్‌లో చేరి…
కాంగ్రెస్‌లో పి. జనార్దన్‌రెడ్డి వారసుడిగా విష్ణువర్దన్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. పీజేఆర్ మరణంతో జరిగిన ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు విష్ణు. తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి మరోసారి అసెంబ్లీకిలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికలు విష్ణుకు కలిసిరాలేదనే చెప్పాలి. 2014 మూడోస్థానంలో నిలిచిన ఈ యువనేత.. 2018లో మళ్లీ పుంజుకున్నా.. రెండోస్థానానికే పరిమితం అయ్యారు. రెండు వరస ఓటములు కుంగదీశాయో ఏమో.. తర్వాత…