పెద్దపల్లి నియోజకవర్గంలో తారాస్థాయికి చేరుకున్న టీఆర్ఎస్ వర్గ పోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్ వివాదం టీఆర్ఎస్లో అగ్గి రాజేస్తోంది. అధికారులు చేస్తున్నారో లేక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెరవెనక చక్రం తిప్పుతున్నారో అర్థం కావడం లేదన్నది కేడర్ చెప్పేమాట. ఇటీవల మంత్రి హరీష్‌రావు పర్యటనలో జరిగిన నాటకీయ పరిణామాలు ప్రస్తుతం చర్చగా మారాయి. ప్రొటోకాల్ రగడ వర్గపోరు తీవ్రతను బయటపెట్టింది.
మంత్రి హరీష్‌రావు ప్రారంభించిన మాతాశిశు కేంద్రం శిలాఫలకంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు కన్నా పైన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేరు చెక్కించారు. దీనిపై కొప్పుల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అధికారుల వైఖరిపై అనుమానం వ్యక్తం చేస్తూ జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కొన్ని సందర్భాలలో ఎమ్మెల్యే చెప్పినట్టే అధికారులు చేస్తున్నారని.. అలా జరగకుండా చూడాలని కోరారట.
Also Read
గతంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్ ఫొటో పెట్టలేదని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ వర్గీయులు. తాజా గొడవ మరో లెవల్‌కు చేరుకుందని చర్చ జరుగుతోంది. అధికారులపై చర్యలు తీసుకోవాలని కొప్పుల అనుచరులతోపాటు జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. దాంతో రాత్రికి రాత్రి శిలాఫలకాన్ని అధికారులు తొలగించేశారు. ఈ అంశంలో మొదలైన రచ్చ.. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది.
ప్రొటోకాల్ అంశాలపై పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్లో జరుగుతున్న వరుస ఘటనలపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయిందట. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తీరుపై పార్టీలో కొందరు అసహనం వ్యక్తం చేయడం.. పోలీసులతో కేసులు పెట్టించడం మీద ఫిర్యాదులు అందాయట. ఉద్దేశపూర్వకంగానే కొందరు పార్టీ నేతలను అవమానిస్తున్నారని.. ఎమ్మెల్యే చెప్పకుండా అధికారులు ప్రొటోకాల్ వివాదంలో ఎందుకు ఇరుక్కుంటారని ఎదురుదాడి చేస్తున్నారట. మొత్తానికి విభేదాలు పార్టీలోని కిందిస్థాయి సిబ్బందిని.. అధికారులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సుప్రీమ్‌గా ఉండాలని చూస్తారు. ప్రారంభోత్సవాల్లో మరొకరి పెత్తనాన్ని సహించలేరు. అది సొంత జిల్లాకు చెందిన మంత్రులైనా గ్యాప్ మెయింటైన్ చేస్తుంటారు. పెద్దపల్లి రగడ కూడా ఆ కోవలోనే చూడాలని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి.. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పార్టీ పెద్దలు చొరవ తీసుకుంటారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Viral: లైకుల కోసం యూట్యూబ్‌లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
-
CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
-
NBK 111: ఆ సినిమా టీజర్ మామూలుగా లేదు.. బాలయ్యను వేరే లెవల్లో చూస్తారు: తమన్
-
Chairman’s Desk : కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా గేమ్ ఛేంజరా?
-
NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!