Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Tdp Leaders In Trouble Alleged Deal With Ysrcp Ex Mla Sparks Political Controversy

Off The Record: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి సాయం చేయబోయి.. ఆ ముగ్గురు టీడీపీ సీనియర్స్‌ అడ్డంగా బుక్కయ్యారా?

Published Date :April 9, 2026 , 9:58 pm
By Sampath Kumar
  • రైస్‌ మిల్లర్ల సంఘంలో పొలిటికల్‌ ప్రకంపనలు
  • ముగ్గురు టీడీపీ సీనియర్స్‌ వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి సాయం చేయబోయారా?
  • ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి ఇందులో ఉన్నారా?
  • రైస్‌ మిల్లర్ల సంఘంలో పట్టు తగ్గకుండా మాజీ ఎమ్మెల్యే ప్రయత్నాలు రాష్ట్ర అధ్యక్షుడిగా తన డమ్మీని పెట్టుకునేందుకు వైసీపీ నేత ప్లాన్‌
  • టీడీపీ నేతలు ముగ్గురికీ బంపరాఫర్‌ ఇచ్చారా?
Off The Record: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి సాయం చేయబోయి.. ఆ ముగ్గురు టీడీపీ సీనియర్స్‌ అడ్డంగా బుక్కయ్యారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాష్ట్ర రాజకీయాల్లో బాగా పాపులర్‌ అయిన ఆ ముగ్గురు టీడీపీ ముఖ్యులు ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి సాయం చేయబోయి అడ్డంగా బుక్‌ అయ్యారా? కేవలం కాసు కక్కుర్తితోనే వాళ్ళు ఆ పని చేయబోయారా? కథ క్లైమాక్స్‌లో టీడీపీ అధిష్టానానికి తెలిసి తలంటేసిందా? ముగ్గురి పరిస్థితి ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా మారిపోయిందా? ఎవరా ముగ్గురు? ఈ కథలో రాయలసీమకు చెందిన ఓ మంత్రి వియ్యంకుడి పాత్ర ఏంటి?

కాకినాడ జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాష్…. స్టేట్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ… అది నచ్చని వైసీపీ నాయకుడు ఒకరు చెక్‌ పెట్టేందుకు సిద్ధమవుతూ…. అందుకు ముగ్గురు తెలుగుదేశం సీనియర్‌ నాయకుల సాయం తీసుకున్నారని, వాళ్ళు కూడా సై అన్నారన్న ప్రచారం పొలిటికల్‌ ప్రకంపనలు రేపుతోంది. ఆ ముగ్గురిలో ఇద్దరు… గత టీడీపీ ప్రభుత్వాల్లో మంత్రి పదవులు వెలగబెట్టి ఉండటం ఇంకా సంచలనమైంది. ఇది తెలిసిన ఉమ్మడి తూర్పు గోదావరి తమ్ముళ్లు కొందరైతే…. ఎంత డబ్బు కక్కుర్తి ఉంటే మాత్రం ఏంటీ… చిల్లర రాజకీయం అంటూ సదరు సీనియర్స్‌ని కామెంట్‌ చేస్తున్నట్టు సమాచారం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు మొదటి నుంచి రైస్ మిల్లర్ల అసోసియేషన్‌లో పెత్తనం చెలాస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా తన పట్టు తగ్గకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఆ క్రమంలోనే… టీడీపీకి చెందిన ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రిని సంప్రదించగా… సై… మేం సపోర్ట్‌ చేస్తామని అన్నారట.

అనుకున్నదే తడవుగా నియోజకవర్గాల వారీగా రైస్ మిల్లర్లతో సమావేశాలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. సరిగ్గా… అక్కడే మేటర్‌ టీడీపీ అధిష్టానానికి చేరి చెక్‌ పడిందట. వాళ్ళ మిలాఖత్‌ ప్రకారం ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సూర్యప్రకాష్‌ని అవిశ్వాసంతో దించేయాలన్నది ప్లాన్‌. రైస్‌ మిల్లర్ల సంఘం నిబంధనల ప్రకారం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అవిశ్వాసంతో పదవి నుంచి దిగిపోతే ఇక రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ చేయడానికి అర్హత ఉండదు. దానికి అనుగుణంగానే వైసీపీ మాజీ ఎమ్మెల్యే గట్టి ప్రయత్నాలు చేశారట. తన వర్గానికి చెందిన వ్యక్తినే రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు చేసే పనిలో భాగంగా అధికార పార్టీ నేతలకు మంచి ఆఫర్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. వాళ్లు కూడా కన్విన్స్ అయిపోయి…. వచ్చిన అవకాశాన్ని తమకు కలిసి వచ్చేలా ప్లాన్ చేశారట. తమ నియోజకవర్గాల్లోని రైస్ మిల్లర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రస్తుత అధ్యక్షుడిని దింపడానికి అట్నుంచి నరుక్కుని వచ్చారట. వ్యవహారం అంతా కొలిక్కి వస్తున్న టైంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఆ కథ మళ్ళీ మొదటికి వచ్చిందంటున్నారు. సదరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీ మొదటి నుంచి రైస్ బిజినెస్‌లో ఆరితేరింది. ఆయనైతే… ప్రస్తుత ప్రభుత్వ పెద్దల మీద గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు పరిధి దాటి మాట్లాడారన్న విమర్శలున్నాయి. అలాంటి వ్యక్తితో సొంత పార్టీకి చెందిన కీలక నేతలు కలిసి పోవడాన్ని టీడీపీ ముఖ్యులు సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును మర్చిపోయారా? ఆయన వాడిన పదజాలాన్ని మర్చిపోయారా? మీ వ్యక్తిగత వ్యవహారాల కోసం అంతా పక్కన పెట్టేస్తారా అంటూ అమరావతి నుంచి ఘాటుగా ప్రశ్నించినట్టు తెలిసింది. అదే ఊపులో… ఇక ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దని క్లారిటీగా చెప్పేసి పక్క జిల్లాకు చెందిన ఇద్దరు కూటమి ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. అప్పటికీ తగ్గని ఆ ఆ ముగ్గురు టీడీపీ కీలక నేతలు మనం స్థానికంగా మిల్లర్ల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి కదా అంటూ సర్ది చెప్పబోయారట.

కానీ… అలాంటి అభిప్రాయాలతో పనిలేదని, ప్రభుత్వ పాలసీ, పెద్దల నిర్ణయాల ప్రకారం పని చేయాలని తేల్చేసినట్టు సమాచారం. మరోవైపు రాయలసీమకు చెందిన ప్రస్తుత మంత్రి వియ్యంకుడు కూడా రైస్‌ మిల్లర్స్‌ సంఘంలో కీ లీడర్‌గా ఉన్నారు. దాంతో… ఈ ఎపిసోడ్‌లో ఆయన జోక్యం చేసుకుని సర్దిచెప్పబోగా….మంత్రి నో అన్నట్టు తెలిసింది. పరిధి దాటి ప్రవర్తిస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయని సున్నితంగానే వార్నింగ్‌ ఇచ్చారట ఆయన. అదలా ఉంటే…. సదరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే టిడిపికి చెందిన ఇద్దరు శాసనసభ్యులు, మాజీ మంత్రికి మరో ఆఫర్ కూడా ఇచ్చారట.. రైస్ మిల్లులు ప్రభుత్వానికి సన్న బియ్యం సరఫరా చేయాలి. దాని బదులు ముతక బియ్యం వచ్చేలా తాను ఒప్పందం చేస్తానని, అది కూడా కొంత కలిసి వస్తుందని చెప్పారట. ఇదేదో బాగుందని అంతా టెప్ట్‌ అయిపోయి కథ క్లైమాక్స్‌కు వచ్చిన టైంలో… మేటర్‌ లీకై ప్రభుత్వ పెద్దల వార్నింగ్‌తో అంతా వెనక్కి తగ్గారట. ఈ విషయంలో ఇక నో మోర్ ఆర్గ్యుమెంట్స్… ప్రస్తుతం రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్న సూర్య ప్రకాష్ అదే పదవిలో కొనసాగుతారని ప్రభుత్వ పెద్దల వైపు నుంచి క్లారిటీ ఇవ్వడంతో ఇక ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌ అన్నట్టుగా మారిపోయిందట వ్యవహారం. మొత్తానికి కాసుల కక్కుర్తితో ఏదో… చేద్దామనుకున్న టీడీపీ ముఖ్యులు ముగ్గురికీ…. పదవులు అనుభవించి ,హోదాలు పొంది చివరికి చేసే చిల్లర రాజకీయాలు ఇవేనా అంటూ అక్షింతలు పడ్డాయట.. స్టేట్‌ పాలిటిక్స్‌లో బాగా పేరున్న ఆ ముగ్గురు మేటర్‌ బెడిసి కొట్టేసరికి తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ అయ్యారని తూర్పు గోదావరి తమ్ముళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • Kakinada
  • tdp
  • TDP Leaders
  • TDP leaders controversy

తాజావార్తలు

  • Off The Record: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి సాయం చేయబోయి.. ఆ ముగ్గురు టీడీపీ సీనియర్స్‌ అడ్డంగా బుక్కయ్యారా?

  • Harish Rao : కమీషన్ల కక్కుర్తి కోసమే అనవసరపు రిజర్వాయర్లు.. రేవంత్‌రెడ్డికి హరీష్‌ రావు సవాల్..!

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘సూపర్ స్టార్’ అవుతాడు.. దక్షిణాఫ్రికా దిగ్గజం జోస్యం!

  • Actor Rajasekhar: నటుడు ఎప్పుడూ నటుడే.. సెకండ్ ఇన్నింగ్స్‌పై రాజశేఖర్ క్లారిటీ!

  • Nara Lokesh: చిన్నారుల కోసం కఠిన నిబంధనలు.. సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు.!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions