ఆ సమయంలో బాబు వెంట నడిచిన ఏకైక నాయకుడికి ఏమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రిగా.. ఎంపీగా చేసిన ఆయన సడెన్‌గా పొలిటికల్ తెర నుంచి కనుమరుగయ్యారు. పార్టీ కార్యక్రమాల్లోనూ నల్లపూసై చర్చగా మారారు. ఆయనది మౌనమా? వ్యూహాత్మకంగా దూరం పాటిస్తున్నారా? ఎవరా నాయకుడు? ఏమా కథ?
టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా?
Also Read
నిమ్మల కిష్టప్ప. అనంతపురం జిల్లాలో సీనియర్ టీడీపీ నాయకుడు. సుదీర్ఘకాలం మంత్రిగా.. ఎంపీగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. 2019లో హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఓడిన తర్వాత రెండున్నరేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అసలు ఆయన ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో కూడా కేడర్‌కు తెలియని పరిస్థితి. టీడీపీకి దూరంగా ఉండటంతో కొన్ని రోజులుగా కిష్టప్పపై చర్చ జరుగుతోంది.
2019 ఎన్నికల్లో ఓటమి కుంగదీసిందా?
తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్నారు కిష్టప్ప. ఎన్టీఆర్‌తో చంద్రబాబు విభేదించిన సమయంలో అనంతపురం జిల్లా నుంచి బాబు వెంట నడిచిన ఏకైక నాయకుడిగా ముద్ర ఉంది. అందుకే చంద్రబాబు ఆయనకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారని అనుకునేవారు. జిల్లాలోని గోరంట్ల మండలం పెరుమాళ్లపల్లికి చెందిన కిష్టప్ప.. బలమైన ఓటు బ్యాంక్ ఉన్న బీసీ నేత. ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మంత్రిగా.. ఎంపీగా ఎదిగారు. హిందూపురం లోక్‌సభను అడ్డగా మార్చుకున్నారు. కానీ.. 2019 ఓటమి ఆయన్ని కుంగదీసిందని సమాచారం.
మాజీ ఎమ్మెల్యే పార్థసారధితో విభేదాలు?
కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తి?
హిందూపురంలో ఓడినప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలకు కూడా కిష్టప్ప దూరంగా ఉంటున్నారు. సైలెంట్ అయ్యారు. కొన్ని రోజులుగా టీడీపీలో ఆయనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని తెలుస్తోంది. పెనుకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పార్థసారధితో తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నాయి. కిష్టప్ప ఎంపీగా ఉన్న సమయంలో ప్రొటోకాల్ ఇవ్వకుండా దూరం పెట్టారట పార్థసారధి. పైగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కుమారుడికి పెనుకొండ, పుట్టపర్తిల నుంచి టికెట్ ఆశించినట్టు సమాచారం. ఆ విన్నపానికి చంద్రబాబు నో చెప్పారట. అప్పటి నుంచి కిష్టప్ప అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
రాయలసీమ టీడీపీ నేతల సదస్సుకు రాలేదు!
2019లో ఓటమి తర్వాత హిందూపురం లోక్‌సభ పరిధిలోని టీడీపీ నేతలంతా కిష్టప్పను ఏ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదట. అలా వచ్చిన గ్యాప్.. ఇప్పుడు ఇంకా పెరిగిందని సమాచారం. నిమ్మల సొంత మండలం గోరంట్లలో టీడీపీ చేపట్టిన నిరసనలకు దూరంగా ఉంటూ వచ్చారు మాజీ ఎంపీ. ఇటీవల జరిగిన రాయలసీమ నేతల సదస్సుకు కూడా హాజరు కాలేదు.
పైగా హిందూపురం పార్లమెంట్ టీడీపీ బాధ్యతలను పార్థసారథికి అప్పగించడంతో మరింత అసంతృప్తికి కారణమైందట. ఇలా చాలా కారణాలు కిష్టప్ప మౌనానికి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటానికి కారణాలుగా చెబుతున్నారు. మాజీ ఎంపీ అసంతృప్తిని టీడీపీ గుర్తించిందో లేదో.. కిష్టప్ప చుట్టూ చర్చ మాత్రం ఆగడం లేదు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!