మంత్రిగా.. ఎంపీగా చేసిన ఆయన సడెన్‌గా పొలిటికల్ తెర నుంచి కనుమరుగయ్యారు. పార్టీ కార్యక్రమాల్లోనూ నల్లపూసై చర్చగా మారారు. ఆయనది మౌనమా? వ్యూహాత్మకంగా దూరం పాటిస్తున్నారా? ఎవరా నాయకుడు? ఏమా కథ? టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా? నిమ్మల కిష్టప్ప. అనంతపురం జిల్లాలో సీనియర్ టీడీపీ నాయకుడు. సుదీర్ఘకాలం మంత్రిగా.. ఎంపీగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. 2019లో హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఓడిన తర్వాత రెండున్నరేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అసలు ఆయన ఎక్కడున్నారో..…