Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Madugula Tdp

మాడుగులపై మాజీ మంత్రి కుమారుడు కన్ను..?

Published Date :December 17, 2021 , 4:01 pm
By Lakshmi Narayana
మాడుగులపై మాజీ మంత్రి కుమారుడు కన్ను..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

అధికారం కోల్పోయిన రెండున్నరేళ్ల తర్వాత ఆ నియోజకవర్గంలో ఓ ప్రయోగం చేసింది టీడీపీ. మాజీ ఎమ్మెల్యేను తప్పించి నియోజకవర్గ బాధ్యతలను మరోనేత చేతుల్లో పెట్టింది. గ్రౌండ్‌లో మాత్రం సీన్‌ మరోలా ఉందట. ఓ మాజీ మంత్రి కుమారుడు అక్కడ కన్నేయడంతో రాజకీయం రసకందాయంలో పడిందట.

టీడీపీ అంతర్గత రాజకీయాలు గవిరెడ్డిని ఓడించాయా?

విశాఖజిల్లా మాడుగుల. ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం తర్వాత ఆరుసార్లు ఇక్కడ పసుపు జెండానే ఎగిరింది. 2009లో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినప్పటికీ ఇక్కడ టీడీపీ గెల్చింది. ఆ ఎన్నికల్లో గెలుపొందిన గవిరెడ్డి రామానాయుడు.. మాడుగులలో పార్టీకి నాయకత్వం వహిస్తూ వస్తున్నారు. 2014, 2019ల్లో టిక్కెట్ దక్కినా.. అంతర్గత రాజకీయాలు గవిరెడ్డిని ఓడించాయి. వైసీపీ బలం పుంజుకోవడంతో టీడీపీ లీడర్లు.. కేడర్‌ ఫ్యాన్‌ గూటికి చేరిపోయారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రభుత్వ విప్‌గా ఉన్న బూడి ముత్యాల నాయుడిదే మాడుగులలో హవా.

గవిరెడ్డిని తప్పించి పీవీజీ కుమార్‌ను ఇంఛార్జ్‌ను చేసిన టీడీపీ..!

టీడీపీలో జోష్‌ తగ్గడంతో.. రెండున్నరేళ్ల తర్వాత పార్టీ పుంజుకుంటుందనే అంచనాలు మొదలయ్యాయి. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ వద్దని అధిష్ఠానం సూచించినా కొన్నిచోట్ల టీడీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల నాటికి పూర్వవైభవం ఖాయమని కేడర్‌ అనుకుంటున్న తరుణంలో టీడీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. గ్రూప్ తగాదాలతో మూడు ముక్కలాట నడుస్తుండగా కొత్త పంచాయితీకి తెరలేచింది. మాడుగుల సీటు కోసం మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, పీవీజీకుమార్, పైలా ప్రసాద్ పోటీపడ్డారు. ముగ్గురు మూడు గ్రూపులుగా విడిపోయి ఎవరి రాజకీయం వారిదే అన్నట్టు వ్యవహరించారు. ఈ వైఖరి పార్టీకి నష్టమని భావించిన హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే రామానాయుడిని ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ స్ధానంలో పీవీజీ కుమార్‌ను నియమించింది.

మాడుగులలో విందు రాజకీయాల జోరు..!

నాయకత్వం మార్పునకు ఐవీఆర్ఎస్ సర్వే రిపోర్టే ఆధారమని టీడీపీ హైకమాండ్ చెబుతోందట. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు రాజకీయానికి తెరలేచింది. గవిరెడ్డిని తప్పించడం వెనక పార్టీలో బలమైన నేతలు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే వర్గం అనుమానం. ఈ అంశంలో తాడోపేడో తేల్చుకోవాలని భావించి.. కొత్త ఇంఛార్జ్‌ తమకొద్దని చెబుతున్నారు తమ్ముళ్లు. మండలాల వారీగా శిబిరాలు పెట్టుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారట. దీంతో మాడుగులలో విందు రాజకీయాలపై చర్చ జరుగుతోంది.

మాడుగులపై ఓ మాజీ మంత్రి కుమారుడి కన్ను..!

మాడుగులలో కొత్త వ్యక్తిని టీడీపీ ఇంఛార్జ్‌గా చేయడం వెనక ఒక మాజీ మంత్రి కుమారుడి హస్తం ఉందట. వచ్చే ఎన్నికల వరకు తన మనిషైన వ్యక్తిని ఇంఛార్జ్‌గా పెట్టి.. అక్కడ బలం పెంచుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఆ యువనేత వ్యూహంగా తెలుస్తోంది. గవిరెడ్డి వర్గం కూడా ఇది పసిగట్టిందట. ఆ యువనేత ప్రయత్నాలను అడ్డుకునేందుకు అచ్చెన్నాయుడు, చినరాజప్ప తదితరుల దగ్గరకు అనుచరులతో వెళ్లి గోడు వెళ్లబోసుకుంటున్నారట గవిరెడ్డి. ఈ పంచాయితీ లోకేష్‌ దగ్గరకు చేరినట్టు సమాచారం.

మాడుగుల టీడీపీలో రగడ నివురు గప్పిన నిప్పేనా..?

ప్రస్తుతం మాడుగుల టీడీపీలో ఈ రగడ నివురు గప్పిన నిప్పులా ఉంది. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో తన పట్టు సడలకుండా పని చేసుకుంటూ పోతున్నారు. పార్టీ శ్రేణులు కూడా చెరో శిబిరంలో చేరినట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొటోంది. ఇలాంటి సమయంలో మాడుగుల టీడీపీలో ఎత్తులు.. జిత్తులను చూసి కేడర్‌ కలవర పడుతుందట. మరి.. ఆధిపత్యపోరులో మాజీ మంత్రి కుమారుడు పైచెయ్యి సాధిస్తారో.. మాజీ ఎమ్మెల్యే పట్టు నిరూపించుకుంటారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Madugula
  • off the record
  • tdp

తాజావార్తలు

  • Nizamabad : భర్త అసహజ శృంగారం కోరికలు..పెళ్లయిన నెల రోజులకే నవ వధువు మృ*తి

  • Fire Break: గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం..

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Crop Loan: మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. రూ.2 లక్షల లోపు పంట రుణమాఫీ.. 25 లక్షల మంది రైతులకు లబ్ది..

  • Garlic Peeling Tips: వెల్లుల్లి తొక్క/పొట్టు తీయడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నారా..? సింపుల్ ట్రిక్స్ తో ఇట్టే తీసేయండి..!

ట్రెండింగ్‌

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions