Konaseema: తుఫాన్ విధ్వంసం.. కరెంట్ లేక అంధకారంలో 200 గ్రామాలు.. ప్రజల కష్టాలు వర్ణనాతీతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arnab Cyclone: అర్నాబ్ తుఫాన్ కోనసీమపై తీవ్ర ప్రభావం చూపించింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి జిల్లా వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. తుఫాన్ తీరం దాటి రోజులు గడుస్తున్నా.. చాలా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. ముఖ్యంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రెండు వందలకు పైగా గ్రామాల్లో ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఐదు రోజులుగా అంధకారంలోనే కాలం వెళ్లదీస్తున్నారు. కరెంటు లేకపోవడంతో కనీస అవసరాల కోసం కూడా ఇబ్బందులు పడుతున్నారు. సెల్ఫోన్లలో ఛార్జింగ్ అయిపోవడంతో అత్యవసర సమాచారాన్ని చేరవేయడం కూడా కష్టంగా మారింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో జనరేటర్లే దిక్కవుతున్నాయి. ఇన్వర్టర్ను ఒక్కసారి ఛార్జింగ్ చేసుకోవాలంటే రూ.500 చెల్లించాల్సి వస్తోంది. సెల్‌ఫోన్ ఛార్జింగ్‌కు రూ.20 వసూలు చేస్తున్నారు. రోజువారీ అవసరాల కోసం కూడా డబ్బులు ఖర్చు చేయాల్సి రావడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విద్యుత్ సరఫరా ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని పరిస్థితిలో ప్రజలు ఎదురుచూస్తున్నారు. మరోవైపు తుఫాన్ విధ్వంసం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది.. జిల్లాలోని 19 మండలాల పరిధిలో సుమారు లక్షా 20 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది.. ఈదురుగాలుల ధాటికి అరటి తోటలు నేలమట్టమయ్యాయి.. దాదాపు 20 వేల ఎకరాల్లో అరటి పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు.. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకు పంట చేతికందే సమయంలో తీరని నష్టం ఎదురైంది.. కొబ్బరి రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారింది.. తుఫాన్ బీభత్సానికి సుమారు 73 వేల 500 కొబ్బరి చెట్లు నేలకొరిగాయి.. ఏళ్ల తరబడి పెంచుకున్న చెట్లు కూలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పంట నష్టంతో పాటు చెట్లను తొలగించడం, తిరిగి కొత్త తోటలు పెంచడం కూడా రైతులకు అదనపు భారంగా మారనుంది.
Also Read
- Arnab Cyclone: ఏపీకి కేంద్ర బృందాలు.. అర్నబ్ తుఫాన్ నష్టాలు, ఖరీఫ్ కరువుపై క్షేత్రస్థాయి పరిశీలన
- Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
- Anantapur: రాప్తాడులో పాశవిక ఘటన.. తరగతి గదిలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి..
- Hyderabad: భారీ సైబర్ ట్రేడింగ్ మోసం.. రూ.24.76 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు.. 3 చోట్ల ఈడీ మెరుపు దాడులు!
తుఫాన్ దెబ్బకు మత్స్యకారుల జీవనాధారం కూడా దెబ్బతింది. సముద్రంలో వేటకు వెళ్లేందుకు ఉపయోగించే సుమారు 450 బోట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బోట్లు, వేట పరికరాలు దెబ్బతినడంతో మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకారులకు ఈ నష్టం మరింత భారంగా మారింది. ఇక తుఫాన్ ప్రభావానికి జిల్లాలో సుమారు 3,500 ఇళ్లు దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇళ్లకు నష్టం వాటిల్లడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడం, పంటలు దెబ్బతినడం, ఇళ్లకు నష్టం వాటిల్లడంతో ప్రజలు ఇప్పటికీ తుఫాన్ ప్రభావం నుంచి బయటపడ లేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు నలుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనుంది. జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి, పంట నష్టాలు, ఇళ్లకు జరిగిన నష్టం, ఇతర ఆస్తుల నష్టాన్ని అంచనా వేయనుంది. కేంద్ర బృందం పర్యటనతోనైనా తమ కష్టాలు అధికారుల దృష్టికి వెళ్లి.. నష్టానికి తగిన పరిహారం అందుతుందని బాధితులు ఆశిస్తున్నారు.. మరోవైపు విద్యుత్ సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి, సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Konaseema: తుఫాన్ విధ్వంసం.. కరెంట్ లేక అంధకారంలో 200 గ్రామాలు.. ప్రజల కష్టాలు వర్ణనాతీతం
-
CM Vijay: తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. సీఎం విజయ్ సంచలన చర్య, అధికారులపై వేటు!
-
Arnab Cyclone: ఏపీకి కేంద్ర బృందాలు.. అర్నబ్ తుఫాన్ నష్టాలు, ఖరీఫ్ కరువుపై క్షేత్రస్థాయి పరిశీలన
-
Meerpet : సీజ్ చేసిన ఫోన్, బంగారాన్ని కాజేసిన కానిస్టేబుల్ అరెస్ట్!
-
Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!