Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Kovur Tdp Politics

తారాస్థాయికి కొవ్వూరు టీడీపీ కుమ్ములాటలు…!

Published Date :August 17, 2021 , 9:52 pm
By Manohar
తారాస్థాయికి కొవ్వూరు టీడీపీ కుమ్ములాటలు…!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో ఇప్పుడు తమ్ముళ్ల కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయా? పార్టీ అధికారంలో లేకపోయినా వెనక్కి తగ్గడం లేదా? ఇప్పట్లో ఆ తగువులు కొలిక్కి వస్తాయో లేదో కూడా తెలియదా? పార్టీ పెద్దలు కూడా తలపట్టుకుంటున్నారా? ఇంతకీ ఆ నియోజకవర్గమేంటీ? తమ్ముళ్లు ఎందుకు కీచులాడుకుంటున్నారో ఈ స్టోరీలో చూద్దాం.

కొవ్వూరు టీడీపీలో కుమ్ములాటలు!

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు. టీడీపీకి బలమైన కేడర్‌ ఉన్నా.. ఎవరి గ్రూప్‌ వాళ్లదే. పార్టీ వేదికలపైనే కాదు.. సోషల్‌ మీడియాలోనూ నువ్వెంత అంటే నువ్వెంత అని విమర్శలు చేసుకుంటున్నారు తమ్ముళ్లు. దాదాపు మూడేళ్లగా ఇదే తంతు. ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పడుతుందో తెలియడం లేదట పార్టీ నేతలకు.

మాజీ మంత్రి జవహర్‌ నేతృత్వంపై టీడీపీలోని ఓ వర్గం గుర్రు!

2014లో కొవ్వూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన జవహర్‌.. ఆ సమయంలో ఒక్కటిగా ఉన్న పార్టీ కేడర్‌ను వర్గాలుగా విభజించారని పార్టీ శ్రేణులు ఆరోపిస్తుంటాయి. ఆ సమయంలో పార్టీ వారికి చెందిన మద్యం షాపులను కూడా ముడుపుల కోసం వదల్లేదని టీడీపీలోని ఓ వర్గం ఆరోపణ. కారణాలేవైనా.. 2019లో జవహర్‌కు కొవ్వూరు టికెట్‌ ఇవ్వలేదు టీడీపీ. ఆయన్ని కృష్ణాజిల్లా తిరువూరు పంపించారు. నాడు కొవ్వూరులో వంగలపూడి అనిత పోటీ చేసినా.. ఓటమి తప్పలేదు. ఆ ఎన్నికల తర్వాత జవహర్‌ తిరిగి కొవ్వూరు వచ్చేశారు. పార్టీ కార్యక్రమాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే జవహర్‌ వ్యతిరేకవర్గానికి ఇది రుచించడం లేదట.

ఫలించని గద్దె సయోధ్య యత్నాలు!

విషయం గమనించిన రాజమండ్రి పార్లమెంట్ టీడీపీ ఇంచార్జ్‌ గద్దె రామ్మోహన్‌.. కొవ్వూరు తెలుగు తమ్ముళ్లతో పలుమార్లు భేటీ అయ్యారు. రెండువర్గాలతో మాట్లాడి సయోధ్యకు యత్నించారు గద్దె. కానీ.. ఎవరూ వెనక్కి తగ్గేందుకు అంగీకరించలేదు. ఇక లాభం లేదని అనుకున్న ఆయన.. తన అభిప్రాయాన్ని చంద్రబాబుకు నివేదిస్తానని.. ఆయనే నిర్ణయం తీసుకుంటారని చెప్పేశారట.

ఇంఛార్జ్‌ పదవి కోసం ముగ్గురు నాయకులు లాబీయింగ్‌!

చంద్రబాబు నిర్ణయం తీసుకునే ముందు కామ్‌గా ఉంటే లాభం లేదని అనుకున్నారో ఏమో.. జవహర్‌ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లు.. ఇంచార్జ్‌ను మార్చాలని కొత్త పేర్లు చర్చకు పెట్టారట. కొత్తవారికి అవకాశం ఇస్తేనే టీడీపీ బతికి బట్ట కడుతుందని స్పష్టం చేస్తున్నారట. ఇదే టైమ్ అనుకున్నారో ఏమో.. నియోజకవర్గంలో కాస్తో కూస్తో పట్టు ఉన్న ముగ్గురు నాయకులు ఇంఛార్జ్‌ పదవికోసం తమకున్న పరిచయాల ద్వారా లాబీయింగ్‌ చేస్తున్నారట.

జవహర్‌కు మద్దతుగా యనమల?

జవహర్‌నే ఇంచార్జ్‌గా కొనసాగించాలని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు పట్టుబడుతున్నారని ప్రచారం జరుగుతుండటంతో పార్టీలోని ఓవర్గం మండిపడుతోందట. కొవ్వూరుపై యనమలకేం పని అని ఫైర్‌ అవుతున్నారట తమ్ముళ్లు. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ముగ్గురిలో ఒకరిని ఎంచుకుంటారో లేక జవహర్‌నే కొనసాగిస్తారో తెలియదు. పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు కేడర్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • kovur
  • kovur tdp politics
  • tdp
  • tdp politics

తాజావార్తలు

  • Botsa Satyanarayana Emotional: ఆ మహానేతను తలుచుకొని కంటతడి పెట్టిన బొత్స..!

  • Prabhsimran Singh: బ్యాటింగ్‌లో ఎవరినీ కాపీ కొట్టను.. కీపింగ్‌లో మాత్రం ఆ దిగ్గజంలా ఉండేందుకు ప్రయత్నిస్తా!

  • Bhatti Vikramarka :జూన్ 2 నుంచి విద్యార్థులకు అల్పాహార పథకం

  • AP Cabinet: 31 ప్రాజెక్టులు.. రూ.39,436 కోట్లు.. ఏపీ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు..!

  • Raaka: బన్నీ ‘రాకా’ పెద్ద స్కెచ్చే.. కానీ ‘శక్తి’ పోట్లు?

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions