Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Bandi Sanjay Praja Sangram Padayatra

బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభపై బీజేపీలో చర్చ..!

Published Date :September 30, 2021 , 5:25 pm
By Manohar
బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభపై బీజేపీలో చర్చ..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రను హజురాబాద్‌లో ఘనంగా ముగించాలన్నది బీజేపీ ఆలోచన. వారికి ఎన్నికల కోడ్‌ బ్రేక్‌ వేసింది. ఇప్పుడేం చేస్తారు? కమలనాథుల ప్లానింగ్‌ ఏంటి?

ఎన్నికల కోడ్‌తో సంజయ్‌ యాత్ర ముగింపుపై బీజేపీలో చర్చ..!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగస్టు 28న ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెట్టారు. ఉపఎన్నిక జరగుతున్న హుజురాబాద్‌లో అక్టోబర్‌ రెండున భారీ రోడ్‌ షోతో మొదటి విడత యాత్రను ముగించాలని అప్పట్లో అనుకున్నారు. నిన్న మొన్నటి వరకు ఆ సన్నాహాల్లోనే ఉన్నారు పార్టీ నాయకులు. ఇంతలో హజురాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. కోడ్‌ అమలులోకి రావడం ఒకటైతే.. కోవిడ్‌ ఆంక్షలను ఈసీ కఠినంగా అమలు చేస్తుండటం బీజేపీ నేతలకు మరో సమస్యగా మారింది.

యాత్ర మొదలైనప్పటి నుంచి ఎన్నికల షెడ్యూల్‌పై చర్చే..!

వాస్తవానికి సంజయ్‌ పాదయాత్ర మొదలైనప్పుడే హుజురాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ వస్తే ఎలా అనే చర్చ ప్రారంభమైంది. యాత్ర మొదలైన మూడో రోజే పశ్చిమ బెంగాల్‌లో ఉపఎన్నికలకు షెడ్యూల్‌ వచ్చింది. ఆ జాబితాలో హుజురాబాద్‌ ఉంటుందని అనుకున్నారు. కానీ లేదు. ఒకవేళ షెడ్యూల్‌లో హుజురాబాద్‌ ఉండి ఉంటే.. పాదయాత్రను అక్కడికి షిఫ్ట్‌ చేయాలని లెక్కలేసుకున్నారు. అప్పటి నుంచి హజురాబాద్‌ షెడ్యూల్‌పై ఇదిగో అదిగో అని ప్రచారం జరిగింది తప్ప కొలిక్కి వచ్చింది లేదు.

మొదటి విడత పాదయాత్ర ముగింపు ఎలా?

జోగిపేటలో జరిగిన బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో షెడ్యూల్‌ వస్తే పాదయాత్రకు బ్రేక్‌ వేయాలని .. యాత్రలోని టీమ్‌ అంతా హుజురాబాద్‌కు షిఫ్ట్‌ కావాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో షెడ్యూల్‌ వచ్చేస్తుందని అనుకున్నారు. కానీ ఈసీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో.. యాత్ర ముందుకు సాగింది. మరో నాలుగు రోజుల్లో మొదటి విడత యాత్ర ముగుస్తుంది అని అనుకున్న తరుణంలో హుజురాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ వచ్చింది. అంతే పాదయాత్రను ముగించాలా లేదా అనేదానిపై బీజేపీ నేతల్లో తర్జన భర్జన మొదలైంది.

కోడ్‌ వల్ల కరీంనగర్‌లోకి కూడా ఎంటర్‌ కాలేని పరిస్థితి..!

మొదటి విడత యాత్ర ముగింపునకు అక్టోబర్‌ 2గా నిర్ణయించడం.. ఆ తేదీ కూడా దగ్గర పడటంతో అప్పటి వరకు కొనసాగించి.. హుజురాబాద్‌లో గ్రాండ్‌గా సభ నిర్వహించాలని ప్లాన్‌ వేసుకున్నారు. కానీ.. ఎన్నికల సంఘం పెట్టిన ఆంక్షలు బీజేపీ నేతలకు షాక్‌ ఇచ్చాయి. భారీ సమావేశాలు, సభలు, ర్యాలీలు, రోడ్‌ షోలు నిర్వహించకూడదని ఈసీ స్పష్టం చేసింది. పైగా జిల్లా మొత్తం కోడ్‌ అమలులోకి వచ్చింది. ఇప్పుడు కరీంనగర్‌లోకి కూడా ఎంటర్‌ కాలేని పరిస్థితి.

హుస్నాబాద్‌లో అక్టోబర్‌ 2న భారీ సభ?

ఇక లాభం లేదని అనుకున్న కమలనాథులు.. ఏదో విధంగా ప్రజా సంగ్రామ యాత్ర తొలివిడత కార్యక్రమానికి గ్రాండ్‌ ముగింపు ఇవ్వాలని అనుకుంటున్నారట. కరీంనగర్‌లోకి ప్రవేశించకుండానే.. హుస్నాబాద్‌లో అక్టోబర్‌ 2న భారీ సభ పెట్టాలని నిర్ణయించారట. హుస్నాబాద్‌ ప్రాంతం ఎన్నికల కోడ్‌ పరిధిలోకి రాదు. పైగా హుజురాబాద్‌కు చేరవలోనే ఉంటుంది. భారీగా సభ పెడితే ఆ ప్రభావం తప్పకుండా హుజురాబాద్‌పై ఉంటుందని లెక్కలేస్తున్నారట. మరి.. వారి ప్లాన్ ఎంత వరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp
  • huzurabad
  • praja sangram padayatra
  • Telangana BJP

తాజావార్తలు

  • DC vs GT: నేడు ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్.. రెడీ అవుతోన్న వరుణుడు.. ఢిల్లీలో వాతావరణం ఎలా ఉండబోతోంది?

  • Jailer2 : ఒకే ఫ్రేమ్‌లో నలుగురు సూపర్ స్టార్స్..

  • Ranjan : కోర్ట్ తమిళ రీమేక్.. వెండితెర ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు

  • Hormuz Strait: చమురు కష్టాలకు బ్రేక్.. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!

  • The Paradise : నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ పోస్ట్ పోన్?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions