AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Elections 2026 Case: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ కేసును భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధర్మాసనం విచారించనుంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు సంబంధించిన అంశాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల అమలుపై ఈ విచారణలో చర్చ జరిగే అవకాశం ఉంది.
గత విచారణ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ), డీజీపీకి సూచించింది. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు పటిష్టమైన భద్రత కల్పించాలని స్పష్టం చేసింది. వివిధ కారణాలతో నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అభ్యర్థులు జిల్లా కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
Also Read
- Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
- Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
- Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
- Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
గత విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం రీ నోటిఫికేషన్ జారీ చేసింది. కోర్టు సూచనల మేరకు తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను సమర్పించాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే విచారణలో ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు, ఆదేశాల అమలు వివరాలు కీలకంగా మారనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే పలు కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు.. నేటి విచారణలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా నామినేషన్ల దాఖలు, అభ్యర్థుల భద్రత, ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛాయుతంగా సాగేందుకు తీసుకున్న చర్యలపై కోర్టు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
-
Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
-
Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
ట్రెండింగ్
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!