Off The Record: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పిఠాపురంలో ఆసక్తికర రాజకీయాలు..
- స్థానిక సంస్థల ఎన్నికల వేళ పిఠాపురంలో ఆసక్తికర రాజకీయాలు..
- ఎన్నికలను పర్యవేక్షించే వార్ రూమ్ మెంబర్‌గా వర్మకు అవకాశం..
- స్థానిక ఎన్నికల సందర్భంగా పార్టీకి సపోర్టింగ్ టీంగా వార్ రూం బాధ్యతలు..
- పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య ఇంకా సమసిపోని విభేదాలు..
- పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీకి ఎన్నికలు ..
- జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల హడావుడి..
- 36 వార్డులు ఉంటే టీడీపీకి 9చోట్ల పోటీ చేసే అవకాశం..
- పనిలేని చోట పెత్తనం ఇచ్చి వర్మను పక్కకు తప్పించేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: పిఠాపురం టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మకు స్థానిక సంస్థల ఎన్నికలను పర్యవేక్షించే వార్ రూమ్‌లో మెంబర్‌గా అవకాశం ఇచ్చింది పార్టీ హైకమాండ్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీకి సపోర్టింగ్ టీంగా ఈ వార్ రూం పనిచేస్తుంది. పిఠాపురంలో టిడిపి-జనసేనకు మధ్య వచ్చిన విభేదాలతో అక్కడ పార్టీ కోఆర్డినేటర్‌గా ఆయనను పక్కకు తప్పించింది సైకిల్ పార్టీ. అప్పటి నుంచి పెద్దగా పని లేకుండా పోయింది. వర్మ ఫీల్ అవుతారనో ఏమోగాని ప్రస్తుతానికి ఆ విధంగా అకామిడేట్ చేశారు. అయినప్పటికీ వర్మ మాత్రం కుదురుగా ఉండలేకపోతున్నారట. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఆదేశాలు మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయానికి ఎంతో చేశానని…బాగానే కృతజ్ఞత చూపిస్తున్నారని అంటున్నారట వర్మ. ప్రస్తుతానికి నియోజకవర్గంలో పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల హడావుడి కూడా కొనసాగుతోంది. మున్సిపాలిటీకి సంబంధించి 36 వార్డులు ఉంటే టీడీపీకి 9 చోట్ల పోటీ చేసే అవకాశం దక్కింది.
మరోవైపు…గొల్లప్రోలులో 23 వార్డులు ఉంటే ఆరుగురు మాత్రమే టిడిపి అభ్యర్థులు ఉన్నారు. పార్టీలు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ తెలుగు తమ్ముళ్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. తమకు అవకాశం రాకపోయినా పార్టీ ఛాన్స్ ఇవ్వకపోయినా రెబల్స్‌గా నామినేషన్లు వేసేసారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి ఏకంగా తమకు పార్టీతో పనిలేదని ప్రకటించేశారనే ప్రచారం జరుగుతోంది. ఇంత రచ్చ జరుగుతున్న కనీసం వర్మ మాట్లాడడం లేదు ఏంటని అంటున్నారట కార్యకర్తలు. గత ఎన్నికలకు వైసీపీలో కీలకంగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కండువా మార్చుకుని ఎన్నికల్లో బరిలో ఉంటే తాము చేతకాని వాళ్ళలా చూస్తూ ఉండాలా?అని ప్రశ్నిస్తున్నారట కేడర్.
Also Read
పిఠాపురం నియోజకవర్గంలో టిడిపి-జనసేన మధ్య సమన్వయం కొరవడిందనే చర్చ జోరుగా సాగుతోంది. అసలు వ్యక్తి వర్మకే అవకాశం లేదు. ఇక మనం ఎంత అనే వాళ్ళు ఉన్నారనే టాక్ నడుస్తోంది. వార్ పేరు చెప్పి ఆయన నోరు నొక్కేశారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారట. ప్రస్తుతం జరుగుతున్న తంతు చూస్తూ ఉండటం తప్ప చేసేదేమీ లేదని అనే వాళ్ళు కూడా ఉన్నారని సమాచారం. వర్మ ఉండి ఉంటే కనీసం ఫైట్ చేసి ఉండేవారని గుర్తు చేసుకుంటున్నారు కేడర్. ఆయనకు పనిలేని పెత్తనం ఇచ్చి పక్కకు తప్పించేశారు కదా అని మాటలు వినిపిస్తున్నాయి. అసలు ఎన్నికలు జరిగే సమయంలో ఆయన లోకల్‌గా ఉంటే కొత్త వివాదాలు వస్తాయని పార్టీ తెలివిగా ఆ పని చేసిందనే చర్చా నడుస్తోంది. కనీసం వెళ్లి అక్కడ అలా..ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పుకోవడానికి లేకుండా బ్లాక్ చేసేసారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. వర్మ పేరుకి అమరావతిలో ఉన్నా నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా జరుగుతున్న పరిణామాలతో ఇలా చేయడం కరెక్ట్ కాదని అనుచరుల దగ్గర ప్రస్తావిస్తున్నారట. పార్టీని నమ్ముకున్నా కానీ వాళ్లు మనల్ని నమ్మడం లేదు అని కేడర్‌తో చెప్తున్నారని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున కీలకంగా ఉన్న వర్మ ఫొటో కూడా కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు జనసేన మాత్రం అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అని గుర్తు చేస్తోంది. అంతా పర్ఫెక్ట్గా ఉండాలంటే కొంత శాక్రిఫైజ్ తప్పదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. దాంతో తెలుగు తమ్ముళ్లకు ఎక్కడో కాలుతుందని సమాచారం. వర్మను పార్టీ అలా లాక్ చేసి ఉండకూడదని కామ్ గా చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది.
మొత్తానికి వర్మకు వార్ రూమ్‌లో వార్ చేసే అవకాశం ఇచ్చినప్పటికీ అక్కడ పెద్దగా పని లేకుండా పోయింది. సొంత నియోజకవర్గానికి వెళ్లి తన అనుచరులకు ప్రాధాన్యత ఇప్పించుకునే పరిస్థితి లేదని తెగ ఫీల్ అయిపోతున్నారనే టాక్ నడుస్తోంది. ఆయనకే దిక్కులేదు మనం ఎంత అని లైట్ తీసుకుంటున్నారట ఫాలోవర్స్. పార్టీ గేమ్ మామూలుగా ఆడటం లేదు కదా అని సెటైర్లు వేస్తున్నారట తెలుగు తమ్ముళ్లు.
తాజావార్తలు
-
OTR: డిండి నీటి కేటాయింపులతో రాజకీయ వేడి.. నల్లగొండ నేతల మౌనమేంటి?
-
Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..
-
Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
-
BJP vs Congress: మోదీ ఎక్కడికీ వెళ్లరు’.. విపక్షాల మెగా ర్యాలీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
-
Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..