Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Microsoft Buyout Plan: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంపై భారీగా పెట్టుబడులు పెంచేందుకు సిద్ధమైన సంస్థ.. భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లోని ఉద్యోగుల కోసం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వాలంటరీ బైఅవుట్) పథకాన్ని ప్రకటించింది. రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. గ్లోబల్ ఉద్యోగుల్లో దాదాపు నాలుగో వంతు మంది అంటే సుమారు 60 వేల మంది ఈ పథక పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఖర్చులను కంట్రోల్ చేస్తూ, మారుతున్న వ్యాపార అవసరాలకు తగినట్లుగా ఉద్యోగుల సంఖ్యను సరిదిద్దేందుకే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిమిత కాలపు పథకం ఏఐ ఎక్స్పీరియన్స్, కోపైలట్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఎక్స్‌బాక్స్, విండోస్ అండ్ డివైసెస్ వంటి పలు విభాగాల్లోని లెవెల్ 70, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న అర్హులైన ఉద్యోగులకు వర్తిస్తుంది. అయితే మార్కెటింగ్, కమర్షియల్ బిజినెస్, సెక్యూరిటీ టీమ్‌లను మాత్రం ఈ నిర్ణయం నుంచి మినహాయించారు. కంపెనీ వెలుపల సొంత భవిష్యత్ వెతుక్కోవాలనుకునే ఉద్యోగులకు ఈ ప్యాకేజీ అండగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఎమీ కోల్మాన్ ఉద్యోగులకు పంపిన మెమోలో పేర్కొన్నారు.
Also Read
- Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
- Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
- Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
- Arnab Cyclone Alert: 'అర్నబ్' తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!
మరోవైపు ఏఐ మౌలిక వసతుల కల్పనపై టెక్ కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే డేటా సెంటర్లు, అత్యాధునిక చిప్స్ కోసం కేలండర్ ఇయర్ 2026 నాటికి ఏకంగా 175 బిలియన్ డాలర్ల మూలధన ఖర్చును మైక్రోసాఫ్ట్ అంచనా వేసింది. అయితే ఈ భారీ పెట్టుబడుల వల్ల భవిష్యత్తులో ఎంత లాభం వస్తుందనే దానిపై ఇన్వెస్టర్లలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ తన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది. ఈ ఫలితాల ద్వారా ఏఐ పెట్టుబడులు వ్యాపార వృద్ధికి ఎంతవరకు దోహదపడుతున్నాయనేది స్పష్టమవనుంది.
ఇక, మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల కోత విధించడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో సుమారు 9,000 మందికి వర్తించేలా మరొక బైఅవుట్ కార్యక్రమాన్ని ప్రకటించింది. అలాగే జూలై నెలలో ఎక్స్‌బాక్స్ గేమింగ్ బిజినెస్ పునరుద్ధరణలో భాగంగా 4,800 ఉద్యోగాలను తొలగించింది. వార్షిక నివేదిక ప్రకారం జూన్ 30, 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌లో 2,23,000 మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులు ఉన్నారు. కాగా, ఈ తాజా స్వచ్ఛంద బైఅవుట్ ప్రకటన వెలువడిన తర్వాత సోమవారం మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు ఒక శాతం లాభపడ్డాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కంపెనీ షేర్లు సుమారు 10 శాతం వరకు వృద్ధిని నమోదు చేశాయి.
తాజావార్తలు
-
Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
-
Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!