ఆ ఇద్దరికి మొదటి నుంచి పడదు. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో ఇద్దరూ ఒకే గూటికి చేరుకున్నారు కూడా. ఆ సమయంలో ఒక ఒప్పందం జరిగిందట. ఇప్పుడా అగ్రిమెంట్ రుచించలేదో ఏమో.. ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇంతకీ ఎవరా నేతలు..? ఏంటా ఒప్పందం..? రచ్చబండతో రచ్చ రచ్చ పీసీసీ మాజీ చీఫ్.. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా…