Site icon NTV Telugu

Off The Record: తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల పొలిటికల్ హాట్‌

Tg

Tg

Off The Record: తమ్ముడు.. తమ్ముడే.. పేకాట పేకాటే.. అన్న సామెతను తెలంగాణ సీఎం గుర్తు చేస్తున్నారా? వ్యక్తులతో తనకు సాన్నిహిత్యం ఉన్నంత మాత్రాన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ.. ఊరుకునే ప్రసక్తే లేదని సూటిగా, సుత్తి లేకుండా చెప్పేశారా? ఏపీ సీఎంతో లింక్‌పెట్టి ఇరకాటంలోకి నెట్టాలనుకునే వాళ్ళకు ఫుల్‌ పిక్చర్‌ ఇచ్చేశారా? ఇంతకీ ఏమన్నారు తెలంగాణ సీఎం? లెట్స్‌ వాచ్‌.

Read Also: Off The Record: కాంగ్రెస్ లో పదవులు రాక ఫ్రస్ట్రేషన్ లో మాజీ ఎమ్మెల్సీలు

తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు బనకచర్ల పొలిటికల్ హాట్‌ టాపిక్‌. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఒకే తాను ముక్కలుగా అభివర్ణిస్తూ.. ఇద్దర్నీ ఏక కాలంలో టార్గెట్‌ చేస్తోంది తెలంగాణ ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌. చంద్రబాబుకి మేలు చేసేందుకే.. రేవంత్ రెడ్డి బనకచర్లను పట్టించుకోవడం లేదని, ఆయన తన గురువు కోసం.. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. అయితే.. అదే సమయంలో బనకచర్ల ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా.. టీజీ సర్కార్‌, సీఎం రేవంత్ కేంద్రం దగ్గర చేసిన ప్రయత్నాలతో తాత్కాలిక ఉపశమనం దక్కింది. అంతర్‌ రాష్ట్ర జల వివాదాలున్నాయంటూ ఆ ప్రాజెక్ట్‌కు ఎర్ర జెండా చూపింది కేంద్ర సర్కార్‌. అయినా సరే… బీఆర్‌ఎస్‌ మాత్రం తగ్గడం లేదు. చంద్రబాబు.. రేవంత్ మైత్రికి లింక్‌ పెడుతూ.. విమర్శల జోరు కొనసాగిస్తూనే ఉంది. గతాన్ని గుర్తు చేస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రుల సంబంధాలపై గతంలో కూడా రకరకాల చర్చలు జరిగాయి.

Read Also: Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవితో బుల్లి రాజు అదరగొట్టాడు !

అయితే, ఎవరికి తోచిన విశ్లేషణలు వాళ్ళు చేసేశారు. ఈ క్రమంలోనే.. గురు శిష్యులు అనే మాటకు.. అప్పుడే క్లారిటీ ఇచ్చేశారు రేవంత్ రెడ్డి. మేం ఇద్దరం ఒకప్పుడు సహచరులమే గానీ.. గురు శిష్యులం కాదని చెప్పే ప్రయత్నం చేశారాయన. అయినా సరే.. ప్రతిపక్షం వైపు నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ వైఖరి గురించి కూడా మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. బనకచర్ల వ్యవహారాన్ని బేస్‌ చేసుకుని ఇద్దరు ముఖ్యమంత్రులకు ముడిపెట్టి మాట్లాడ్డం ద్వారా.. పొలిటికల్‌ సెంటిమెంట్‌ను రగిల్చేందుకు గులాబీ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోందన్న అభిప్రాయాలు కూడా బలంగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో… తాజాగా మరోసారి తమ సంబంధాలపై రేవంత్‌రెడ్డి క్రిస్టల్‌ క్లియర్‌గా చెప్పేయడం చుట్టూ చర్చ మొదలైంది. బనకచర్లపై.. పార్టీ నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే క్రమంలో తమ మధ్య సంబంధాన్ని ప్రస్తావించారాయన. వ్యక్తులు పరిచయం ఉన్నంత మాత్రాన.. లెక్కలు మారబోవని, తెలంగాణ హక్కుల విషయంలో నాది రాజీలేని పోరాటం అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు సీఎం. రాష్ట్ర హక్కులకు భంగం కలిగించే ఏ అంశం అయినా.. వ్యక్తుల పరిచయాలతో ముడి పడి ఉండబోదని చెప్పేశారు. దీని ద్వారా తనకు రాష్ట్ర ప్రయోజనాలకు మించి వేరే ఏదీ ముఖ్యం కాదని సూటిగా చెప్పేసినట్టయిందంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.

Read Also: Off The Record: కూటమి సర్కార్‌లో పదవుల చిచ్చు..? బీజేపీ లీడర్స్ రగిలిపోతున్నారా..?

ఇక, దీనికి కొనసాగింపుగా.. నాకు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేపల పులుసు కంటే.. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం అంటూ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ మీద సెటైర్‌ వేశారు రేవంత్‌. గతంలో మాజీ మంత్రి రోజా ఇంటి దగ్గర కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని పరోక్షంగా గుర్తు చేశారాయన. ఇక బనకచర్ల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారు రేవంత్. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాయలసీమకు చేసిన ప్రయోజనాలను చెప్పుకుంటూనే.. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వ విధానాలు స్పష్టం చేశారు రేవంత్‌. అలాగే, ప్రస్తుతం కేంద్రం నుంచి వచ్చిన ఊరట చూసి సంతోషపడొద్దని.. ఇక్కడ మోడీకి చంద్రబాబు అవసరం ఉంది కాబట్టి.. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ధోకా చేస్తుందన్న సంగతి గుర్తు పెట్టుకుని అలర్ట్‌గా ఉంటాలంటూ తన యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు తెలంగాణ సీఎం. ఆ విధంగా.. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ వేదిక నుంచి.. చాలా ప్రశ్నలకు సమాధానం చేప్పే ప్రయత్నం చేశారాయన. చంద్రబాబుతో తనకు సాన్నిహిత్యం ఉన్నంత మాత్రాన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేదంటూ తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే నన్న సామెతను గుర్తు చేశారాయన.

Exit mobile version