అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లి రాజు క్యారెక్టర్ ఎంత బాగా పేలిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో రీల్స్‌లో చూసి ఆ బుడతడిని పిలిపించుకున్న అనిల్ రావిపూడి, సినిమాలో కీలకమైన రోల్ ఇవ్వగా, దాన్ని అవలీలగా చేసేశాడు బుల్లి రాజు అలియాస్ రేవంత్ భీమాల.
Also Read:Poonam Kaur: మరోసారి త్రివిక్రమ్ ను టార్గెట్ చేసిన పూనమ్
అయితే, ఇప్పుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న సినిమాలో కూడా బుల్లి రాజు ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి కొన్ని ఎపిసోడ్‌లు ఇప్పటికే షూట్ చేయగా, ఆ ఎపిసోడ్‌లలో ఎలాంటి బెరుకు లేకుండా నటించాడని తెలుస్తోంది. అంతేకాదు, వీరిద్దరి కాంబినేషన్‌లోని సీన్స్ కూడా బాగా పేలేలా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. తాజా షెడ్యూల్‌లో వీరిద్దరికి సంబంధించిన సీన్స్ షూటింగ్ జరిగిందని కూడా తెలుస్తోంది.
Also Read:Tollywood: కొత్త సినిమాలను పైరసీ చేస్తున్న వ్యక్తి అరెస్టు
ఇక అంతే కాదు, ఈ సినిమాకు సంబంధించి అనేక విషయాలను అనిల్ రావిపూడి పంచుకున్నారు. తాజాగా ఎన్‌టీవీ అనిల్ రావిపూడి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన తమ జర్నీ గురించి, మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి, అలాగే సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం సినిమా సీక్వెల్ గురించి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ వీడియో చూసేయండి.