OTR: కౌశిక్‌పై ఫిర్యాదు.. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలన్న స్పీకర్!
- కడియంతో అనుచితంగా వ్యవహరించారంటూ కౌశిక్‌పై ఫిర్యాదు
- ఎథిక్స్ కమిటీకి మూడు నెలల గడువిచ్చిన స్పీకర్
- ఒకసారి గడువు పొడిగింపు, అదీ దగ్గరవుతున్నా నో రియాక్షన్
- కౌశిక్ మీద వేటేస్తారన్నంతగా మొదట్లో హడావిడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ ఏమైంది..? మొదట్లో వరుస సమావేశాలు పెట్టి హడావిడి చేసిన కమిటీ… తర్వాత ఉన్నట్టుండి ఎందుకు సైలెంట్ అయింది? ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సంగతేంటో తేల్చేందుకు స్పీకర్ పొడిగించిన గడువు కూడా సమీపిస్తున్నా… అట్నుంచి స్పందన లేకపోవడానికి కారణాలేంటి? ఎందుకు పని పూర్తి చేయలేకపోతున్నారు? లెట్స్ వాచ్. అసెంబ్లీ సమావేశాల్లో సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ BRS MLA పాడి కౌశిక్ రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది అధికార పక్షం. దీంతో ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేసి చర్యలకు సిఫారసు చేయాలని ఆదేశించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. కమిటీకి మూడు నెలల గడువు ఇచ్చి సంగతి తేల్చాలని ఆదేశించారాయన. అందుకు తగ్గట్టే… కమిటీ వేసిన తొలినాళ్ళలో వరుస సమావేశాలు పెట్టి హడావిడి చేశారు.
వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కమిటీ గడువును పొడిగించారు. అలా పొడిగించిన సమయం కూడా దగ్గర పడుతున్నా… ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్గాని, రియాక్షన్గాని లేవు. కమిటీ ఏం చేసింది..? ఏం చేయబోతోందన్న క్లారిటీ లేదు. కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం, గడువు కావాలని ఆయన కోరడం, అలాగే…. వీడియోలు కూడా కావాలని ఎమ్మెల్యే అడగడం… ఇస్తామంటూ కమిటీ వాయిదా వేయడం కామన్ అయ్యాయని చెప్పుకుంటున్నారు. దీంతో… ఎథిక్స్ కమిటీ మొదట్లో ఉన్నంత దూకుడుగా ఇప్పుడు ఎందుకు లేదు? ఎటూ తేల్చుకోలేకపోతోందా అన్న చర్చ మొదలైంది రాజకీయవర్గాల్లో. వరుసగా సమావేశాల వాయిదా కారణంగా… స్పీకర్ రెండోసారి ఇచ్చిన గడువు కూడా దగ్గర పడుతోంది. అసెంబ్లీలో ఘటన జరిగిన నాటి పరిస్థితి చూస్తే… ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై వెంటనే వేటేస్తారన్నట్టుగా నడిచింది వ్యవహారం.
Also Read
ఆ తర్వాత స్పీకర్ ఎథిక్స్ కమిటీ వేయడంతో…అంతా చట్టబద్ధంగా సెట్ చేయాలని నిర్ణయించినట్లు చర్చ జరిగింది. అయితే కమిటీ నియమించి ఐదు నెలలు కావస్తున్నా.. కొలిక్కి రాకపోవడంతో …అసలేం జరుగుతోందన్న చర్చ కు స్పేస్ ఇచ్చినట్టు అయిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎథిక్స్ కమిటి చైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డి కాస్త సంయమనంతో అడుగు వేస్తున్నారో..? లేక ఆచి తూచి వ్యవహరిస్తున్నారోగానీ… స్పీకర్ కమిటీరి రెండోసారి ఇచ్చిన గడువు కూడా ముగుస్తున్నా నో సౌండ్ అన్న చర్చ జరుగుతోంది. కౌశిక్ రెడ్డిపై వేటు వేస్తారంటూ ఒక దశలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ… ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తుంటే… చర్యలకు కమిటీ సిఫారసు చేస్తుందా అన్న సందేహాలు వస్తున్నాయట ఎక్కువ మందికి. ఏదో ఒకటి తేల్చడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు? ఎక్కడ ఆలస్యం జరుగుతోందన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి వివిధ వర్గాల్లో.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
OTR: కౌశిక్‌పై ఫిర్యాదు.. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలన్న స్పీకర్!
-
IPL 2027: పూర్తయిన రిటెన్షన్ ప్రక్రియ.. ఎవరి పర్సులో ఎంత..? టాప్‌లో LSG..
-
OTR: ఆలేరు కాంగ్రెస్ పార్టీలో వీధికెక్కిన కుమ్ములాటలు
-
Amala Akkineni: అక్కినేని కోడళ్లపై అమల ఆసక్తికర వ్యాఖ్యలు! అఖిల్ భార్యపై స్పెషల్ కామెంట్స్..
-
US Iran Tensions: హార్ముజ్ జలసంధిపై అమెరికా LUCAS డ్రోన్ కూల్చివేసిన ఇరాన్!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!