OTR: వైసీపీ కంచుకోటపై టీడీపీ కన్ను.. నెల్లూరులో అంతర్గత సర్వేలతో టీడీపీ మాస్టర్ ప్లాన్
- ఉమ్మడి నెల్లూరు జిల్లాపై తెలుగుదేశం పార్టీ ఫోకస్
- వాపు కాదు బలుపు అని నిరూపించాలనుకుంటున్న టీడీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ అంతర్గత సర్వేలు రాష్ట్రంలో ఫ్యాన్ పార్టీ బలం పుంజుకుందని టీడీపీకి నివేదికలు..? వైసీపీలో బలంగా ఉన్నదెవరు..? వారి బలహీనతలేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: ఆ ఉమ్మడి జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ సరికొత్త వ్యూహాలు రచిస్తోందట. ఒకప్పుడు ప్రతిపక్షానికి కంచుకోటగా ఉన్న ఆ జిల్లాను అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్ చేసినప్పటికీ… లోకల్ బాడీ ఎన్నికల్లోనూ అదే ఊపు కొనసాగించాలని ఫిక్స్ అయిందట టీడీపీ. అందుకే ప్రతిపక్షం బలంగా ఉన్న నియోజకవర్గాలను టార్గెట్ చేసి కొత్త ఎత్తులు వేస్తోందట. అంతర్గతంగా సర్వేలు కూడా చేయిస్తోందట. ఇంతకీ ఆ జిల్లా ఏది..? అక్కడ టీడీపీ వ్యూహాలేంటి..? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అప్పుడే రెండేళ్లు పూర్తి చేసుకుంది. చేసిన అభివృద్ధిని చూపిస్తూ ఓట్లు అడిగే సమయం దగ్గర పడుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలలో గెలిచేందుకు తెలుగుదేశం పార్టీ ఇప్పటినుంచే స్కెచ్ వేస్తోంది. అందులో భాగంగానే ఉమ్మడి నెల్లూరు జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిందట తెలుగుదేశం పార్టీ. సింహపురి అంటే ఒకప్పుడు వైసీపీకి కంచుకోట అనేది బలమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని పక్కకుతోసి… ఆధిపత్యం తమదే అని నిరూపించేందుకు టీడీపీ వ్యూహాలకు పదును పెడుతోంది. తమది వాపు కాదు తగ్గిపోవడానికి.. బలుపే ఆని నిరూపించుకునేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోందట. ఇటీవల కాలంలో అన్ని పార్టీల ఆఫీస్‌లలోనూ ఇదే చర్చ జరుగుతోందట.
కడప తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే ఫ్యాన్ పార్టీ బలంగా ఉందనేది గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది. అయితే గత ఎన్నికలలో సైకిల్ జోరు ముందు ఫ్యాన్ జీరోకి వెళ్ళిపోయింది. ఆ జోరును లోకల్ బాడీ ఎన్నికలలో కూడా కంటిన్యూ చేసేందుకు సైకిల్ పార్టీ భారీ కసరత్తే చేస్తోందట. ఎక్కడ ఆధిపత్యం తగ్గకుండా.. ఇప్పటికీ ఎప్పటికీ నెల్లూరు మా అడ్డా అనేలా గ్రౌండ్ వర్క్ చేస్తోందన్న టాక్ ఇంటర్నల్‌గా వినిపిస్తోంది. టీడీపీకి చెందిన ఓ టీం జిల్లాలో ఇటీవల అంతర్గతంగా సర్వే నిర్వహించిందట. పార్టీ ఎక్కడ బలంగా ఉంది..? వన్ సైడ్‌గా ఓట్లు ఎక్కడ పడతాయి..? గాజు గ్లాస్ కథ ఏంది..? కమలం వికసించే స్థానాలు ఎన్ని..? అనే లెక్కలతోపాటు ఫ్యాను ఐదు మీద తిరిగే స్థానాలు ఎక్కడ అనే దానిపై సర్వే చేసిందట. అయితే… రాష్ట్రవ్యాప్తంగా గత ఆరు నెలల్లో కొన్ని ప్రాంతాలలో ఫ్యాన్ పార్టీ బలం పుంజుకుందన్న రిపోర్టులు అధిష్టానానికి చేరాయట. దీంతో నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఏంటా అనేదానిపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టిందని సమాచారం. ఆయా ప్రాంతాలలో ఫ్యాన్ పార్టీలో ఎవరు బలంగా ఉన్నారు..? వారి బలహీనతలు ఏంటి..? కేసులు ఏమైనా ఉన్నాయా..? వారు దేనికి బెండ్ అవుతారు అనే కోణంలో సర్వేలు చేస్తున్నారట. ఇదే సమయంలో గాజు గ్లాసు బలంతో పాటు.. కమలం ఉనికి ఏంటన్న దానిపై కూడా లోతుగా సర్వేలు చేయించారట.
Also Read
లోకల్ బాడీ ఎన్నికల్లో వన్ సైడెడ్‌గా గెలవాలనే లక్ష్యంతోనే ప్రత్యర్థి బలాలు, బలహీనతలను తెలుసుకునే పనిలో పడింది తెలుగుదేశం పార్టీ. మన బలం కంటే ఎదుటోడి బలహీనతలు తెలుసుకుంటేనే ఈజీగా విజయం సాధించువచ్చన్న ఫార్ములాను లోకల్ బాడీ ఎన్నికలలో ఉపయోగించబోతుందట. వైసీపీలో గెలిచి టీడీపీలోకి జంప్ అయిన కార్పొరేటర్లు కౌన్సిలర్లు, కార్పొరేటర్ల బలాలు… మళ్లీ వారినే బరిలోకి దింపితే విజయావకాశాలపై కూడా సర్వే చేయించారట. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే వైసీపీలో బలంగా ఉండేవారితో మాట్లాడటం.. వినకపోతే వారికి అర్థమయ్యేలా ఫ్యూచర్ చూపించాలనే కాన్సెప్ట్‌తో అధికార పార్టీ ఉందన్న చర్చ వైసీపీలోనూ జరుగుతోందట. అదే సమయంలో సొంత పార్టీలోని కోవర్టులను కూడా కనుక్కనే పనిలో ఉందట టీడీపీ. ఇంటర్నల్ విషయాలను వైసీపీకి చేరవేయకుండా… ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందన్న అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. అందుకే నెల్లూరు జిల్లాలో కొద్దిరోజులుగా అంతర్గత సర్వేలు నిర్వహించి… వచ్చిన నివేదికల ఆధారంగా గేమ్ ప్లాన్ రెడీ చేయబోతుందట టీడీపీ.
- Tags
- Andhra Pradesh
- NTV Telugu
- OTR
- tdp
- YSRCP
తాజావార్తలు
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
-
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!