Off The Record:పెందుర్తిలో అగ్గి చల్లారుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫీల్డ్‌లో ఎంత కష్టపడ్డా అత్తెసర మార్కులే పడ్డాయని ఆ ఎమ్మెల్యే తల పట్టుకున్నారు. తీరా విషయం తెలిసి కంగుతిన్నారట. చాలా హైరానా పడ్డారట. ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి మరీ తన గోడు వెళ్లబోసుకున్నట్టు ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఎవరా ఎమ్మెల్యే? ఏమా కథా?
Also Read
రెండు వర్గాల మధ్య ఇప్పటికే ఫ్లెక్సీల వార్
పెందుర్తి వైసీపీలో వర్గ రాజకీయాల అగ్గి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఎమ్మెల్యే అదీప్ రాజు.. అనకాపల్లి జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు మధ్య పోరు పీక్స్‌కు వెళ్లిపోయింది. ఇరు వర్గాలు ఫ్లెక్సీల పాలిటిక్స్‌తో రెచ్చ గొట్టుకుంటున్నాయి. ఇటీవల పెందుర్తి 96వ వార్డు సచివాలయ కన్వీనర్ల నియామకం జరిగింది. 30మందితో కూడిన జాబితాను విడుదల చేసిన శరగడం వర్గం వాళ్లందరి ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఎమ్మెల్యే.. వాళ్లందరినీ ఇంటికి సాగనంపారు. ఇక సీఎం విశాఖ పర్యటనలోనూ ఎయిర్పోర్ట్ నుంచి ముషిడివాడ వరకు హోర్డింగ్స్, ఫ్లెక్సీలు పెట్టారు. ఇక్కడా రెండు వర్గాలు పోటీ పడ్డాయి. అయితే ఎమ్మెల్యే ఫొటో కనిపించకుండా జాగ్రత్త పడిందట శరగడం శిబిరం.
ఐప్యాక్ టీమ్‌లో అదీప్‌కు మార్కులు పడలేదా?
ఈ రచ్చ వెనుక బలమైన ఎత్తుగడలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. గవర సామాజికవర్గానికి చెందిన చినఅప్పలనాయుడు వచ్చే ఎన్నికల్లో అనకాపలి జిల్లాలో ఎక్కడో ఒక చోట టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారట. ఎమ్మెల్యే అదీప్ రాజుతో వైరానికి అదే కారణమట. ఈ దిశగా జరుగుతున్న కుట్రను అదీప్‌రాజు ఆలస్యంగా గుర్తించారని ఎమ్మెల్యే వర్గం చెబుతోంది. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్న ఎమ్మెల్యేలపై ఐప్యాక్ టీమ్ ఫోకస్ ఉంది. ఆ సంస్థ అందిస్తున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మార్కులు పడుతున్నాయి. ఎమ్మెల్యే అదీప్ రాజ్ ప్రోగ్రెస్ పూర్ గా ఉందనే నివేదిక హైకమాండ్ కు చేరింది.
13 రోజులే అదీప్ తిరిగారని రిపోర్ట్?
సుమారు 80రోజులు గడపగడపకు నిర్వహిస్తే కేవలం 13రోజులుగా నమోదవ్వడంపై అదీప్ రాజ్ ఖంగుతిన్నారట. ఎక్కడో తేడా కొడుతోందని ఆయన ఆరా తీశారట. రోజులు తప్పుగా నమోదు కావడం వెనుక శరగడం కుమారుడు ఉన్నట్టు ఎమ్మెలయే వర్గం ఆరోపణ. ఐ-ప్యాక్ టీమ్‌లో శరగడం కుమారుడు ఉన్నారని.. అతను ఇచ్చిన నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వల్లే పార్టీ పెద్దల దగ్గర బ్యాడైనట్టు అదీప్‌రాజు ఆవేదన చెందుతున్నారట. ఇటీవల ముఖ్యమంత్రితో సమావేశమై ఆ విషయాన్ని చెప్పుకొని తన గోడు వెళ్లబోసుకున్నారట అదీప్‌రాజు. అక్కడ సీఎం ఏం చెప్పారో ఏమో.. శరగడం వ్యవహారంపై కఠినంగా వ్యవహరించాలని వైసీపీ అధిష్ఠానం సూచించినట్టు ఎమ్మెల్యే శిబిరం ప్రచారం మొదలుపెట్టింది.
ఇద్దరూ కలిసి సాగాలని పార్టీ పెద్దలు చెప్పారా?
ఇప్పటికే నియోజకవర్గ సమీక్షలో పెందుర్తి పంచాయితీ వాడి వేడిగా జరిగింది. శరగడం వర్గానికి గట్టిగానే సమన్వయకర్త సుబ్బారెడ్డి గట్టిగా చెప్పారని ఎమ్మెల్యే అనుచరుల టాక్. ఇరువర్గాల మధ్య ఇగో సమస్యలు నివారించేందుకు ఎన్నికల పరిశీలకురాలుగా ఎమ్మెల్సీ వరుదు కల్యాణికి బాధ్యతలు అప్పగించింది. అదీప్, శరగడం వర్గాలు కలిసి పనిచేయాలని కీలకమైన విషయాలు సమన్వయకర్త నోటీసులో ఉంచాలని నిర్ధేశించినట్టు సమాచారం. అయితే ఎన్నికల ముందు కీలకమైన గవర సామాజికవర్గానికి చెందిన అప్పలనాయుడిని పార్టీ దూరం పెట్టే పరిస్థితి లేదు. అలాగని ఎమ్మెల్యేకు ఇబ్బందులు తలెత్తుతుంటే మౌనం వహించే అవకాశం లేదు. అందుకే పెందుర్తి పంచాయితీ భవిష్యత్‌లో మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగానే కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!