OTR: హుజూరాబాద్‌లో బైపోల్ వస్తుందా? కౌశిక్ రెడ్డి కేసులో తాజా పరిణామం
- ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం
- SIR పూర్తయ్యే వరకు వేచి చూస్తారా? పాత లిస్ట్‌తోనే ముగిస్తారా?
- హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి కూడా చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖైరతాబాద్‌తో పాటు తెలంగాణలోని మరో అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా బైపోల్ జరిగే అవకాశం ఉందా? ఆ సెగ్మెంట్ కేంద్రంగా మారుతున్న పరిణామాలు ఇదే విషయం చెబుతున్నాయా? ఆ ఎమ్మెల్యే తీరుపై ఎథిక్స్ కమిటీ కూడా వీలైనంత త్వరగా నివేదిక ఇచ్చే పనిలో ఉందా? ఏదా నియోజకవర్గం? అక్కడి ఎమ్మెల్యే మీద వేటేయాలని డిమాండ్ చేసే దాకా ఎందుకు వెళ్ళింది వ్యవహారం?
తెలంగాణలో ఉప ఎన్నికల సబ్జెక్ట్ ఇప్పుడు హాట్ హాట్‌గా నడుస్తోంది. ఆ విషయమై డిఫరెంట్ యాంగిల్స్‌లో చర్చోప చర్చలు జరిగిపోతున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హై కోర్ట్ అనర్హత వేటేయడంతో… ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అటు సుప్రీంకోర్టు కూడా… హైకోర్ట్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ…. ఉప ఎన్నిక జరపండని ఆదేశించడంతో… ఇక అక్కడ బైపోల్ అనివార్యం. అయితే… ప్రస్తుతం రాష్ట్రంలో SIR ప్రక్రియ నడుస్తున్న క్రమంలో… ఉప ఎన్నికను ఏ ప్రాతిపదికన నిర్వహిస్తారన్నది చూడాలి. ఓటర్ల జాబితా ఫైనల్ అయ్యేవరకు వేచి చూస్తారా..? లేక పాత లిస్ట్‌తోనే ముందుకు వెళ్తారా అన్నది చూడాలి.
Also Read
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- OTR : విజయనగరం టీడీపీలో మేయర్ సీటు ఎవరిదో..అధిష్టానం మనసులో ఉన్నదెవరు?
అదంతా ఒక ఎత్తయితే…. ఖైరతాబాద్ నియోజకవర్గంతో పాటు హుజూరాబాద్‌కు కూడా ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందా అన్నది లేటెస్ట్ హాట్. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న అంశంపై ఎథిక్స్ కమిటీ విచారణకు ఆదేశించారు స్పీకర్. కమిటీ ఇప్పటికే విచారణ కూడా ప్రారంభించింది కూడా. అటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా కమిటీని కొంత గడువు అడిగారు. ఆ మేరకు టైమ్ ఇచ్చే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. ఆ తర్వాత అయినా… ఎథిక్స్ కమిటీ కౌశిక్ రెడ్డి మీద చర్యలకు సిఫారసు చేయవచ్చన్న అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అదే గనక జరిగితే… హుజూరాబాద్ ఎమ్మెల్యే మీద వేటు పడుతుందన్నది రాజకీయవర్గాల అంచనా.
మరోవైపు కౌశిక్ రెడ్డి విషయంలో విచారణ పూర్తి చేసి నివేదిక ఇచ్చేందుకు కమిటీకి మూడు నెలల గడువు ఇచ్చారు స్పీకర్. దీంతో… ఆ టైంలోపు విచారణ ముగించాలని ఎథిక్స్ కమిటీ కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఎమ్మెల్యే పాడిపై వేటు తప్పదనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. దీంతో…అటు హుజూరాబాద్… ఇటు ఖైరతాబాద్ నియోజకవర్గాలు రెండిటికీ ఉప ఎన్నికలు తప్పకపోవచ్చన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి.ఆ రెండు చోట్ల బైపోల్ జరిగితే రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది కొత్త రాజకీయ చర్చ.
తాజావార్తలు
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!