OTR : మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై వైసీపీ డిఫరెంట్ విశ్లేషణ..సరికొత్త లెక్కలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తేడా కొట్టినా వైసీపీ పెద్దగా టెన్షన్ పడటం లేదా? ఈ విషయంలో ఆ పార్టీ లెక్కలు వేరుగా ఉన్నాయా? తాము ఓడి గెలిచామన్న జగన్ వ్యాఖ్యల ఉద్దేశ్యం ఏంటి? అసలు ఫ్యాన్ నయా కేలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయి? ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించింది. ఇక పరిషత్ మీదుగా.. పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగించి అర్బన్, రూరల్ అన్న తేడా లేకుండా మొత్తం మా ఆధిపత్యమేనని చెప్పాలన్నది మూడు పార్టీల వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ విజయాలను వైసీపీ మరో కోణంలో విశ్లేషిస్తోందట. ఇక్కడ కూటమికి దక్కిన స్థానాలను, ఓటర్ల మద్దతును వేర్వేరుగా చూడాలన్నది ప్రతిపక్షం అభిప్రాయంగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో 62 శాతానికి పైగా పోలింగ్ నమోదైనా.. నగరాలు, పట్టణాలవారీగా చూసుకుంటే… ఓటింగ్ సరళిలో వ్యత్యాసాలు కనిపించాయి. కొన్ని ప్రధాన నగరాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడాన్ని వైసీపీ ప్రత్యేకంగా చూస్తున్నట్టు చెబుతున్నాయి ఆ పార్టీ వర్గాలు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో అంచనా వేయడానికి పోలింగ్ సరళి ఒక సూచిక అన్నది ఫ్యాన్ లెక్క. దాని ప్రకారం చూసుకుంటే… కూటమి గెలిచిన మున్సిపాలిటీల్లో సైతం ప్రభుత్వానికి పాజిటివ్ ఓటింగ్ పెద్దగా లేదన్నది తాడేపల్లి కేలిక్యులేషన్ అట. కూటమి విజయాల్లో మరో కీలకమైన అంశం మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీ.
చాలా ప్రాంతాల్లో మూడు పార్టీల మధ్య సమన్వయం, ఓట్ల బదిలీ గెలుపునకు దోహదపడ్డాయి. అయితే… ఆ ఓట్ ట్రాన్స్ఫర్ సక్రమంగా జరగని ప్రతిచోట తాము పైచేయి సాధించడమో, టఫ్ ఫైట్ ఇవ్వడమో జరిగిందంటూ విశ్లేషిస్తున్నారట వైసీపీ ముఖ్యులు. అనంతపురం, బేతంచర్ల, నందికొట్కూరు, నాయుడుపేట వంటి ప్రాంతాలను ఈ కోణంలోనే చూస్తోంది విపక్షం. పూర్తి ప్రతికూల పరిస్థితుల్లోనూ తమకు వచ్చిన ఓట్లు పార్టీకి ఇంకా ప్రాథమిక బలం తగ్గలేదని నిరూపిస్తున్నట్టు అంచనా వేస్తోంది. అదే సమయంలో ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు, అధికార దుర్వినియోగం, రిగ్గింగ్ జరిగాయన్న ఆరోపణలను కూడా ముందుకు తీసుకొస్తోంది. ఇంతాచేస్తే… కూటమికి సీట్లు వచ్చాయి తప్ప… ఓట్ల శాతం పెద్దగా మెరుగుపడలేదని, ఆ సీట్లను కూడా అక్రమాలతో గెల్చుకున్నట్టు చెప్పుకుంటున్నారు వైసీపీ లీడర్స్. కష్టకాలంలో ఇప్పుుడు పడ్డ ఓట్లు తమకు నిజమైన ఓట్ బ్యాంక్ అని, అధికారంలో ఉన్నప్పుడు మంచి చేశాం కాబట్టే… ఇప్పుడు ఇంతమంది ఓటర్లు తమ వెనకున్నారన్నది వైసీపీ వాదనగా తెలుస్తోంది.
Also Read
- Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
- Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
- Off The Record: నెల్లూరు జడ్పీ పీఠంపై టీడీపీలో అసంతృప్త రాగాలు.. అన్నీ వాళ్ళ కోటాకేనా అంటూ అసహనం
- OTR: తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కట్టు తప్పుతోందా? పీసీసీ పిలిచినా నో రియాక్షన్!
ఈ సందర్భంలోనే…పార్టీ అధ్యక్షుడు జగన్ చెబుతున్న రాజకీయ లెక్క ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానాల పరంగా కూటమి భారీ ఆధిక్యం సాధించినా.. తమకు వచ్చిన ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నది వైసీపీ అధ్యక్షుడి సూచన అట. కూటమి గెలిచిన స్థానాలన్నీ ప్రభుత్వంపై ప్రజల సంపూర్ణ విశ్వాసానికి నిదర్శనం కాదని, తాము ఓడిపోయినా తమ ఓటు బ్యాంకుకు ఢోకా లేదన్నది జగన్ వాదనలోని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. కూటమి గెలిచి ఓడిందన్న జగన్ వ్యాఖ్య వెనుక ఉన్న పొలిటికల్ లాజిక్ ఇదేనని అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఇదే సమయంలో మరో పాయింట్ కూడా చర్చకు వస్తోంది. ఎన్నికల్లో గెలవడం ఒక ఎత్తు, గెలిచాక ప్రజల్లో నమ్మకం నిలబెట్టుకోవడం మరో ఎత్తు. ఎమ్మెల్యేల పరంగా ఇప్పటికే కూటమికి తిరుగులేని ఆధిపత్యం ఉంది. ఇప్పుడిక స్థానిక సంస్థల్లోనూ అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరిగితే.. వారి పనితీరుపై ప్రజల్లో అంచనాలు కూడా పెరుగుతాయని వైసీపీ భావిస్తోంది. ఆ అంచనాలను చేరుకోలేకపోతే…..దాని ప్రభావం స్థానిక నాయకులకే పరిమితం కాకుండా ప్రభుత్వం మీద కూడా పడుతుందని వైసీపీ లెక్కలేస్తోంది.
గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా క్షేత్ర స్థాయిలో నాయకులపై వచ్చిన వ్యతిరేకత ప్రభావం వోవరాల్‌గా పార్టీని దెబ్బకొట్టిందని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు అదే తరహా పరిస్థితులు కూటమికి కూడా ఎదురవుతాయని, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారన్నదాన్ని బట్టే భవిష్యత్ ఉంటుందని అంటున్నారు. పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికవడం కూటమికి రాజకీయ బలాన్ని ఇస్తున్నప్పటికీ.. వారి పనితీరును పర్యవేక్షించడం, ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా చూడటమే అసలైన సవాల్ అన్నది ఓ విశ్లేషణ. అందుకే ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ప్రజల్లో నమ్మకంగా మార్చుకోవడం ఏంత తేలికైన విషయం కాదని అంచనా వేస్తున్నారు ఫ్యాన్ లీడర్స్. ఓవరాల్‌గా చూసుకుంటే… కూటమికి సీట్లు వచ్చినా తమ ఓట్ బ్యాంక్ మాత్రం చెక్కు చెదరలేదని, రాబోయే రెండున్నరేళ్ళు దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకోగలిగితే చాలన్నది వైసీపీ అధిష్టానం ఆలోచనగా చెబుతున్నాయి ఆ పార్టీ వర్గాలు.
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!