OTR : విజయనగరం టీడీపీలో మేయర్ సీటు ఎవరిదో..అధిష్టానం మనసులో ఉన్నదెవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుభవమా…? యువ నాయకత్వమా…? పార్టీ కోసం చేసిన త్యాగాలా…? పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌తో దూకుడుగా వెళ్ళగలిగే తత్వమా…? దేనికి పెద్ద పీట? ఏయే అంశాల్ని పరిగణనలోకి తీసుకుని మేయర్ టిక్కెట్ ఇస్తారు? ఇప్పుడక్కడ టీడీపీలో ఆశావహులు ఒక్కొక్కరికి ఒక్కో డిఫరెంట్ క్వాలిటీ ఉంది. ఎవరికి వారు పోటాపోటీగా పావులు కదుపుతున్నారు. ఎక్కడ జరుగుతోందా ఆసక్తికర రాజకీయం? ఆ విషయమై పార్టీ హై కమాండ్ మనసులో ఏముంది? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ విజయనగరం టీడీపీలో ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. రకరకాల కొత్త లెక్కలు తెరపైకి వస్తున్నాయి. సామాజిక సమీకరణాలు, నాయకుల వ్యక్తిగత ప్రభావం, గెలుపు అవకాశాల్లాంటి అనేక అంశాలను అభ్యర్థి ఎంపికలో బేరీజు వేసుకుంటుండగా… ఇప్పుడు వయసు కూడా కీలకంగా మారుతోందట. 62 డివిజన్స్ ఉన్న విజయనగరం నగరంలో మేయర్ పీఠం ఈసారి ఓసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో… మొదటి నుంచి రేసులో ఉన్న కొందరు నేతలు మరోదారి లేక వెనక్కి తగ్గారట. అయితే.. వాళ్ళలో ఎక్కువ మంది తమ కుటుంబాల్లోని మహిళలకు ఛాన్స్ ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మేయర్ రేసులో మొదటి నుంచి బలంగా వినిపిస్తున్న పేరు ప్రసాదుల కనక మహాలక్ష్మి. గతంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు కలిసొచ్చే అంశం. స్థానికంగా మంచి గుర్తింపు ఉందని ఆమె అనుకూల వర్గాలు చెబుతున్నాయి. అలాగే… యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడం మరింత అనుకూలం కావచ్చన్న అంచనాలున్నాయి. విజయనగరంలో యాదవ సామాజిక వర్గానికి గణనీయమైన ఓట్ బ్యాంక్ ఉంది.
ఆ లెక్కన సామాజిక సమీకరణాలను ప్రాధాన్యంగా తీసుకుంటే కనక మహాలక్ష్మి పేరు పరిశీలనలో ఉండవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే…అదే సమయంలో మరో చర్చ కూడా మొదలైంది. అనుభవం, సామాజిక బలం మాత్రమే సరిపోతాయా… అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు టీడీపీ నేతలు. కొత్త తరానికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన పార్టీ అధిష్టానానికి ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవద్దా అన్న ప్రశ్న ఆసక్తి రేపుతోంది. మరోవైపు మేయర్ పదవి కోసం ఇన్నాళ్లు ప్రయత్నించిన కంది మురళీనాయుడు… తాజా పరిణామాలతో తన భార్య శమంతకమణికి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇందుకోసం పార్టీ అధిష్ఠానం వద్ద తనవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారట. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా…తాము ఖర్చు పెట్టి పనిచేశామని, ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నందున అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో చేసిన ప్రయత్నాలు, పార్టీకి అందించిన సేవలు ఈసారి టికెట్‌కు ఎంతవరకు ఉపయోగపడతాయన్నది చూడాలంటున్నారు పరిశీలకులు. మరోనేత అవనాపు విజయ్ కూడా… తన భార్య భార్గవి కోసం ప్రయత్నాల్లో ఉన్నారట. ఇలా ఒక్కో నాయకుడు ఒక్కో రకంగా…ఒక్కొకర్ని తెరపైకి తీసుకొస్తుండటంతో.. టీడీపీలో మేయర్ అభ్యర్థి ఎంపిక మరింత ఆసక్తికరంగా మారుతోంది.
Also Read
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- OTR : తెనాలి పీఠం కోసం టఫ్ ఫైట్! ఆలపాటి vs నాదెండ్ల మనోహర్
సీనియారిటీ ఒకవైపు.. గత ఎన్నికల్లో చేసిన ప్రయత్నాలు మరోవైపు.. సామాజిక సమీకరణాలు ఇంకోవైపు.. వీటన్నింటినీ అధిష్ఠానం ఎలా సమన్వయం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అసలు ఇవన్నీ ఒక ఎత్తయితే… అన్నిటికీ మించి తాజాగా తెర మీదికి వచ్చిన మరో పేరు ఇంకా ఇంట్రస్టింగ్‌గా మారింది. ఇటీవల టీడీపీలో చేరిన చిన్న శ్రీను కుటుంబానికి మేయర్ సీటు దక్కే అవకాశం ఉందన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి. పార్టీ యువతకు అవకాశం ఇవ్వాలని భావిస్తే…. చిన్న శ్రీను తన కుమార్తె సిరి సహస్ర పేరును ప్రతిపాదించే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. సిరి సహస్ర ఇప్పటికే నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ చురుగ్గా ఉంటున్నారని ఆమెకు అనుకూల వర్గాలు చెబుతున్నాయి. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారని కూడా చెప్పుకుంటున్నారు. దీంతో… యూత్ కోటాలో ఆమె పేరు పరిశీలనలోకి రావచ్చన్న లెక్కలున్నాయి. అయితే…. దీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్న నాయకులను కాదని.. కొత్తగా వచ్చిన నాయకుడి కుటుంబానికి అవకాశం కల్పిస్తారా అన్న ప్రశ్నకు ప్రస్తుతానికైతే సమాధానం లేదని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. ఇలా…. నిజయనగరం మేయర్ పీఠం కోసం పోటీలో ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. వీళ్ళంతా ఇలా పోటీ పడుతుంటే… వీరిలో ఒకరికి ఛాన్స్ దక్కుతుందా లేద పిట్టపోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందన్నట్టు మరో కొత్త కేరక్టర్ తెర మీదికి వస్తుందా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!