OTR : తెనాలి పీఠం కోసం టఫ్ ఫైట్! ఆలపాటి vs నాదెండ్ల మనోహర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీది తెనాలి…. మాది తెనాలి. కానీ…. అంటూ అక్కడ కూటమి నాయకులు ఎందుకు పాజ్ ఇస్తున్నారు? అబ్బే…. అలాంటిదేం లేదు, ఇంకా మాట్లాడుకోలేదని పైకి చెబుతూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నా… మున్సిపల్ ఛైర్మన్ కోసం ఎవరికి వారు కామ్‌గా పావులు కదుపుతున్నారా? అది మాకంటే మాకే కావాలంటూ పోటీ పడుతున్న ఆ మంత్రి, మాజీ మంత్రి ఎవరు? టీడీపీ, జనసేన రెండిటికీ అంత ప్రతిష్టాత్మకంగా మారిన ఆ మున్సిపల్ ఛైర్మన్ సీటు ఏది? ఆంధ్రా ప్యారిస్‌లో పొలిటికల్ ఈక్వేషన్స్ అండ్ కేలిక్యులేషన్స్ ఎప్పుడూ కాస్త డిఫరెంట్‌గా, ఇంకా చెప్పాలంటే తేడాగానే ఉంటాయని అంటారు. ఎన్నిక ఏదైనా సరే… తెనాలి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా…. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా… తెనాలి అసెంబ్లీ సీటు జనసేన కోటాలోకి వెళ్లింది. కానీ… ఇక్కడి నుంచి పోటీ చేయడానికి టీడీపీ సీనియర్ లీడర్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తీవ్రంగా ప్రయత్నించారు. అదే సమయంలో జనసేన నంబర్ టూ అని చెప్పుకునే నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీకి మొగ్గు చూపడంతో….ఆలపాటి తప్పుకోక తప్పలేదు. మనోహర్ గెలిచి కేబినెట్ బెర్త్ పట్టేశారు. అయితే… పోటీ సమయం నుంచే ఆలపాటి, నాదెండ్ల మధ్య రాజకీయం నోటితో మాట్లాడుకుని నొసటితో వెక్కిరించుకున్నట్టే ఉంటోందన్నది లోకల్ టాక్. ఆలపాటి రాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాక ఇది ఇంకా తీవ్రమైందని అంటారు.
ఇద్దరూ ఎక్కడా నేరుగా ఢీ అంటే ఢీ అనకపోయినా… నియోజకవర్గంలో మాత్రం ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో ఉందట. ఆ మధ్య స్థానిక కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ వ్యవహారంలో ఇన్‌డైరెక్ట్‌గా ఆధిపత్య పోరు నడిచింది. ఇక తర్వాత కూడా అప్పుడప్పుడూ నడుస్తున్న ఆధిపత్య పోరు తెనాలిలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. కొద్ది రోజుల క్రితం తెనాలిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దాని వెనక మంత్రి ఆదేశాలున్నాయన్నది టీడీపీ నేతల ఆరోపణ. అప్పట్లో పెద్ద ఎత్తున ఆలపాటి వర్గీయులు రోడ్డుపై ఆందోళనకు దిగారు కూడా. ఇలా తరచూ ఏదో ఒక విషయంలో మంత్రి నాదెండ్ల, మాజీ మంత్రి ఆలపాటి రాజా మధ్య ఆధిపత్యపోరు నడుస్తూనే ఉంది. తాజాగా… ఇప్పుడిక మున్సిపల్ ఎన్నికల వంతు వచ్చింది. తెనాలి మున్సిపాలిటీ అన్ రిజర్వుడ్ కేటగిరీలో ఉంది. గుంటూరు జిల్లాలోని పెద్ద మున్సిపాలిటీల్లో ఒకటి కావడంతో… ఛైర్మన్ పదవి ఆశావహుల సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. ఎవరికి వారే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. తెనాలి అసెంబ్లీ సీటును జనసేనకు ఇచ్చారు కాబట్టి…. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్‌ను మాకు ఇవ్వడం పొత్తు ధర్మమని వాదిస్తున్నారు టీడీపీ నేతలు. అలాగే మరికొన్ని ఈక్వేషన్స్‌ను కూడా తెరపైకి తీసుకు వస్తున్నారు తమ్ముళ్ళు. లోకల్లో టీడీపీ బలంగా ఉందన్నది వాళ్ళ వెర్షన్.
Also Read
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
బలంగా ఉన్నప్పటికీ…. పొత్తును గౌరవిస్తూ ఎమ్మెల్యే టిక్కెట్ త్యాగం చేశాం కాబట్టి…. ఇప్పుడు మున్సిపాలిటీ మాకే కావాలని గట్టిగా వాదిస్తున్నారు లోకల్ టీడీపీ లీడర్స్. ఇందులో భాగంగానేనా అన్నట్టు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా పార్టీ అధినేత చంద్రబాబును ఇటీవల కలిశారట. నియోజకవర్గంలో తెలుగుదేశం బలంగా ఉందని, క్యాడర్ చెక్కు చెదరలేదని వివరించినట్టు తెలిసింది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ ఛైర్మన్ సీటు మనకే ఉండాలంటూ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. అలాగే…పరిస్థితులకు భిన్నంగా ఒకవేళ ఛైర్మన్ సీటు జనసేనకు కేటాయిస్తే… టీడీపీ కేడర్ కూడా ఇబ్బంది పడుతుందంటూ చంద్రబాబుకు వివరించారట ఆలపాటి. ఇదే సమయంలో ఇటు మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం తగ్గేదేలే అంటున్నట్టు సమాచారం. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని మున్సిపల్ ఛైర్మన్ సీటు తమ కోటాలోనే ఉండాలన్నది ఆయన అభిప్రాయం అట.
ఇప్పటికే జనసేనకు చెందిన నలుగురు నాయకులు తమకు చైర్మన్ ఛాన్స్ ఇవ్వమని కోరినట్టు తెలిసింది. ఆ రకంగా… రెండు పార్టీలు ఒకవైపు ఛైర్మన్ సీటు కోసం పోటీ పడుతూనే… మరోవైపు కౌన్సిలర్ సీట్లలో కూడా మెజార్టీ వాటా కోసం పావులు కదుపుతుండటంతో తెనాలి రాజకీయం రక్తి కడుతోంది. ఇప్పటికే తెనాలి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ మున్సిపాలిటీలోని 52వార్డులకు తమ పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల వివరాలు సేకరించారట. మరోవైపు మంత్రి మనోహర్ కూడా… ఎమ్మెల్యేగా ఎలాగూ నేను ఉన్నాను కాబట్టి….. మున్సిపల్ ఛైర్మన్ సీటు కూడా పార్టీకే కేటాయిస్తే… ఇక్కడ జనసేన మరింత బలపడుతుందని భావిస్తున్నారట. ఇలా…. ఇద్దరు నేతలు ఎవరికి వారే పట్టుకోసం ప్రయత్నాలు మొదలు పెట్టడం తెనాలిలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. లోలోపల ఇంత జరుగుతున్నా…… పైకి మాత్రం ఇంకా ఛైర్మన్ సీటు ఎవరికి ఇవ్వాలి, ఎవరెవరికి ఎన్ని వార్డులు కేటాయించాలనేదానిపై చర్చ జరగలేదని, అందరం కూర్చొని మాట్లాడుకోవాల్సి ఉందంటూ అమాయకంగా మాట్లాడుతున్నారట రెండు పార్టీల నేతలు. ఇద్దరు ముఖ్య నాయకులు పైకి కనిపించకుండా… లోలోపల దీటుగా పావులు కదుపుతుండటంతో… తెనాలి సీటు ఎవరికోటాలోకి అన్న ఉత్కంఠ పెరుగుతోంది.
- Tags
- NTV Telugu
- off the record
తాజావార్తలు
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!