Off The Record : వంగవీటి రాధాకు పదవిపై త్వరలో క్లారిటీ వస్తుందా?
- పార్టీ కోసం పనిచేసినా పదవి లేదని వంగవీటి అభిమానుల అసంతృప్తి
- రాధా, చంద్రబాబు తాజా భేటీతో మళ్ళీ పదవి చర్చలు
- గత రెండు ఎన్నికల్లో టీడీపీకి స్టార్ క్యాంపెయినర్‌గా వంగవీటి
- గతంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కోసం ఎదురు చూపులు, నిరాశ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు, సీఎం చంద్రబాబుకు మధ్య ఏం జరుగుతోంది? అప్పుడప్పుడూ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలుస్తుంటారు. అలా భేటీ అయిన ప్రతిసారి రకరకాల ఊహాగానాలు. తర్వాత అంతా షరా మామూలే. ఈ పరిస్థితుల్లో తాజాగా జరిగిన మీటింగ్‌లోనైనా క్లారిటీ వచ్చిందా? వంగవీటి అభిమానులకు సమాధానం దొరుకుతుందా? విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ. ఇప్పటికి ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యారాయన. కానీ… ఆ గుర్తింపుకంటే…. కాపు యువత ఆరాధ్యుడిగా భావించే వంగవీటి మోహనరంగా వారసుడిగా రాధాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రత్యేకించి అప్పట్లో కోస్తా జిల్లాల్లో రంగాకు ఉన్న బలమైన అనుచరవర్గం కారణంగా రాధాకి కూడా ఆ సామాజికవర్గంలో అంతే ఫాలోయింగ్ ఉంది. అయితే… ఇప్పుడు రాధా టీడీపీలో ఉన్నా, కూటమి అధికారంలో ఉన్నా… గత రెండు ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేసినా… రాధాకు లాంటి పదవి దక్కలేదన్న అసంతృప్తి వంగవీటి అభిమానుల్లో పెరుగుతోందట. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆయన ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ తొలిసారి విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారాయన. ఇక 2019, 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారాయన. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ ఎలక్షన్స్‌లో గెలిచిన వైసీపీ నుంచి ఆఫర్స్ వచ్చినా తిరిగి పార్టీ మారలేదు. దీంతో 2024 ఎన్నికల్లో టిడిపి గెలిస్తే ఆయనకు కచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని అనుచర వర్గం భావించింది. కానీ… ప్రస్తుతం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా… రాధా భవిష్యత్ ఏంటో అర్ధం కావడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా చంద్రబాబుతో వంగవీటి భేటీ అవడంతో.. ఆయన అనుచరగణం కొత్త లెక్కలు వేస్తోందట. గత రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు మాజీ ఎమ్మెల్యే.
ఈ సందర్భంగా 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే రాధాకు ఎమ్మెల్సీ ఇస్తామని, ఉన్నత స్థానం కల్పిస్తామని పలుమార్లు బహిరంగంగానే చెప్పారాయన. దీంతో రాష్ట్రంలో పవర్ మారిన వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ వస్తుందని ఎదురుచూశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నా లేదు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు రాధాను సీఎంఓకి పిలిపించుకొని మాట్లాడారు. దాంతో…. అప్పుడున్న పరిస్థితుల్లో పదవి ఇవ్వలేక పోతున్నామనే విషయాన్ని చెప్పారా అనే చర్చ జరిగింది. దానికి సంబంధించి అధికారికంగా ఏ వివరాలు బయటకు రానప్పటికీ రాధా మాత్రం క్యాజువల్ మీటింగ్ అని తన వర్గానికి చెప్పినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో తాజాగా మరోసారి ఇద్దరి మీటింగ్ జరగడంతో… పార్టీ కేడర్‌తో పాటు రాజకీయవర్గాల అటెన్షన్ కూడా అటువైపు మళ్ళింది. వచ్చే జూన్‌లో గవర్నర్ కోటాకు సంబంధించి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి.
Also Read
జూన్‌లోనే భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. దీంతో… ఇప్పుడు రాధా సీఎంని కలవడం ఆసక్తి రేపుతోంది. ఇద్దరి మధ్య ఎమ్మెల్సీకి సంబంధించిన చర్చలు జరిగి ఉంటాయా అంటూ ఎవరి అంచనాల్లో వాళ్లు ఉన్నారు. అయితే రాధా మాత్రం ఈసారి కూడా క్యాజువల్ మీటింగ్ అంటూ ముక్తసరి సమాధానమే చెప్పారట. ఆయన అనుచరులు మాత్రం ఈసారి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే అది కచ్చితంగా తమ నాయకుడికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మూడు పార్టీల పొత్తులో నడుస్తున్నందున ఏ సీటు కేటాయించాలన్నా… మూడు పార్టీల మధ్య చర్చ జరగాల్సిన పరిస్థితి. దీంతో… గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ఏ ప్రాతిపదికన జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఏదేమైనా చంద్రబాబుతో రాధా భేటీ అయిన ప్రతిసారి ఆయనకు పదవి వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు ఆయన అనుచరులు.ఈ పరిస్థితుల్లో ఈసారి నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి పెరుగుతోంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!