Off The Record : వంగవీటి రాధాకి అప్పటిదాకా వెయిటింగ్ తప్పదా?
- ఒక్క విజయానికే పరిమితమైన వంగవీటి రాధా
- మూడు సార్లు పోటీ, ఒకే గెలుపు
- 2004లో తొలిసారి కాంగ్రెస్ తరపున విజయం
- తర్వాత ఎప్పుడూ అధికార పార్టీలో లేని రాధా
- 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ, ఓటమి
- 2014లో వైసీపీ తరపున పోటీ, ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెజవాడలో ఆ లీడర్‌కి సీనియారిటీ ఉన్నా… కాలం కలిసి రావడం లేదా? వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు అంటూ… పదిహేనేళ్ళు వెయిట్ చేశాం. ఇక మావల్ల కాదని ఆ నేత అనుచరగణం ఎందుకు అంటోంది? తమ నాయకుడిని వాళ్ళు ఎలా చూడాలనుకుంటున్నారు? ఇప్పుడాయన ఎలా ఉన్నారు? అసలింతకీ ఎవరా లీడర్? ఏంటాయన ఎదురుచూపుల కథ? బెజవాడ రాజకీయాల్లో వంగవీటి పేరు ఒక బ్రాండ్. ఇంకా చెప్పుకోవాలంటే… ఏపీ పాలిటిక్స్ మొత్తాన్ని కూడా ప్రభావితం చేయగలిగిన పేరు అది. దివంగత వంగవీటి రంగా కుమారుడిగా… రాధాకి కూడా అదే గుర్తింపు ఉంది. తండ్రి ఒకసారి, తల్లి రెండు విడతలు ఎమ్మెల్యేలు అవగా… రాధా ఒక్క విజయానికే పరిమితం అయ్యారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో మూడు సార్లు పోటీ చేసి ఒక్కసారి మాత్రమే గెలవగలిగారాయన. మొత్తం ఐదు ఎన్నికల్ని చూసిన రాధా… రెండు విడతలు పోటీకి దూరంగా ఉన్నారు. అత్యంత చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన రికార్డ్ ఆయన పేరిట ఉన్నా… ఆ ఒక్కసారి మినహా… మరెప్పుడూ ఆయన పవర్లోలేరు. ఇపుడు అదే… ఆయన సొంత కేడర్ని కలవరపెడుతోందట. తొలిసారి 2004లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు రాధా. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. ఆ ఐదేళ్ళు మాత్రమే ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి రాధా పొలిటికల్ కెరీర్ పరిశీలిస్తే.. ఎన్నడూ అధికారంలో లేరు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓడిపోయి అధికారానికి దూరమయ్యారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నారు.
ఇక 2019లో టిడిపిలో చేరినా…. అప్పుడు ఆ పార్టీకి పవర్ పోయింది. ఈ క్రమంలో… 2024లో వైసీపీలో చేరాలని ప్రతిపాదనలు వచ్చినా… ఆయన మాత్రం టిడిపిలోనే కొనసాగి 20 ఏళ్ల తర్వాత అధికార పార్టీలో ఉన్నారన్నది వంగవీటి వర్గం మాట. నిలకడ లేకుండా… ప్రతి ఎన్నికల టైంలో గెలవబోయే పార్టీ నుంచి ఓడిపోయే పార్టీలోకి వెళ్ళటం ద్వారా అధికారం, పదవులు రాధాకు దక్కకుండా పోయాయన్నది ఆయన వర్గం మాట. అదంతా ఒక ఎత్తయితే… ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాసరే… ఆయనకు పదవులు దక్కడం లేదన్న ఆవేదన పెరుగుతోందట వంగవీటి అభిమానుల్లో. తెలుగుదేశం పార్టీలో రాధా చేరినప్పుడు ఆయనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చినా ఖాతరు చేయలేదు. పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల్లో పనిచేశారు. ఈసారి గెలిచిన తర్వాత రాధాకు కచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తారని ఆశపడింది ఆయన వర్గం. అధిష్టానం కూడా అంతకు ముందే హామీ ఇచ్చిందని, ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే రాధాను ఎమ్మెల్సీగా చూస్తామని ఆయన వర్గం వెయిట్ చేసింది. తనకు ఫలానా పదవి కావాలని రాధా ఎప్పుడూ అడగలేదని, ఆయనకు పదవుల మీద పెద్దగా వ్యామోహం లేదని అంటున్నా… మానేతను ఒక హోదాలో చూడాలన్నది వంగవీటి అభిమానుల ఆశగా చెప్పుకుంటున్నారు. ఆ మధ్య ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీట్లలో ఛాన్స్ దక్కకపోవడంతో…మళ్ళీ అవకాశం రావాలంటే… 2027దాకా ఎదురు చూడక తప్పని పరిస్థితి. దీంతో ఇంకెన్నాళ్ళు ఈ వెయిటింగ్ అంటూ డీలా పడుతున్నారట మాజీ ఎమ్మెల్యే అనుచరులు. తమ నాయకుడికి పదవులపై ఆశ లేకపోయినా తాము మాత్రం ఆయన్ని చట్టసభలో చూడాలని కోరుతున్నామన్నది వాళ్ళ మాట. అందుకోసం 15 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నామని, టీడీపీ అధిష్టానం ఇకనైనా గుర్తించి ఆయన స్థాయికి తగ్గ పదవి ఇవ్వాలని కోరుతున్నారట. ఇన్నాళ్ళు అవకాశం లేక వెయిటింగ్ లో ఉన్నామని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా వెయిటింగ్ అంటే… ఇబ్బందేనంటూ మనసులో మాట బయట పెడుతోందట వంగవీటి అనుచరగణం. దీన్ని టీడీపీ అధిష్టానం ఎలా తీసుకుంటుందో చూడాలి మరి.
Also Read
- OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
- Off The Record: బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ లిస్టులో దానం నాగేందర్.. కాంగ్రెస్‌కు కూడా భారమేనా?
- OTR: ఆదోని, ఎమ్మిగనూరు కూటమిలో కుమ్ములాటలు స్థానిక ఎన్నికలపై ప్రభావం ..?
- Off The Record: ప్రభుత్వ ప్రాధాన్యతల్ని గుర్తించడంలో విఫలం..? ఉన్నతాధికారులు కాస్త తేడాగా ఉన్నారా?
తాజావార్తలు
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
-
Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
-
School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!