OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుకున్నదే అయ్యింది. దానం నాగేందర్‌పై వేటు పడింది. ఇక పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరుగుతోందట. ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటి? దానం కేసుకి, మిగిలిన వాళ్ళ కేసులకు తేడా ఉందా..? ఉంటే ఆ తేడా ఏంటి? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచారాయన. ఆ తర్వాతి రాజకీయ పరిణామాలతో పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతేకాదు…ఆ పార్టీ తరపున సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారాయన. సరిగ్గా ఇక్కడే ఇరుక్కుపోయారు. ఒక పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి… రాజీనామా చేయకుండానే మరో పార్టీ బీ ఫామ్ మీద ఎన్నికల బరిలో దిగడం ఫిరాయింపునకు తిరుగులేని ఆధారంగా మారింది. ఇదే ఆయనపై అనర్హత వేటుకు కారణమైంది. అదే కారణాన్ని చూపిస్తూ… ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసింది తెలంగాణ హైకోర్ట్. దీంతో… పార్టీ మారిన మిగిలిన 9 మంది ఎమ్మెల్యేల్యేల్లో టెన్షన్ మొదలైందని చెప్పుకుంటున్నారు. మొత్తం పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా…వాళ్లలో ఒకరు దానం.
ఇప్పుడు ఆయన మీద హైకోర్టు అనర్హత వేటు వేసింది. అయితే మిగిలిన 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటన్న చర్చ మొదలైంది. వాళ్ళందరి విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పును ప్రత్యర్థి పార్టీలు సవాల్ చేశాయి. వాళ్ళు పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటూ గతంలోనే స్పీకర్ మిగిలిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే విషయంలో ఉన్నట్టుగా… మిగతా వాళ్ల మేటర్‌లో నిర్దిష్టమైన ఎవిడెన్స్ లేదన్న వాదన వినిపిస్తోంది. మిగతా తొమ్మిది మందిలో అయితే గియితే…ఒక్క కడియం శ్రీహరికే ఎంతోకొంత ఇబ్బంది ఉంటుందేమోనన్న చర్చ జరుగుతోంది. ఆయన కుమార్తె గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు కడియం శ్రీహరి ఆమె తరపున ఎన్నికల ప్రచారం చేశారన్నది స్పీకర్ దగ్గర బీఆర్ఎస్ వినిపించిన వాదన. ఇవే వాదనలు మళ్లీ కోర్టు ముందు పెట్టే అవకాశం లేకపోలేదని అంటున్నారు. వీళ్ళు తప్ప మిగిలిన ఎమ్మెల్యేల్లో వేరే ఎవ్వరికీ అలాంటి సమస్య లేదు. అయితే కోర్టు మెట్లు ఎక్కితే పరిస్థితి ఎలా ఉండబోతోందన్న చర్చలు నడుస్తున్నాయి. దానం ఎపిసోడ్ రిపీట్ అవుతుందా..? న్యాయపరంగా కాంగ్రెస్ ముందున్న సవాళ్లు ఏంటన్న ప్రశ్నలకు సమాధానాలు వెదుకుతున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా…. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో మాత్రం కాస్త టెన్షన్ కనిపిస్తున్నట్టుందని అంటున్నాయి వాళ్ల సన్నిహిత వర్గాలు.
Also Read
- Tags
- NTV Telugu
- OTR
- telangana
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..