OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
- మోసం జరిగిందంటూ చాలా చోట్ల జనసేన నేతల ఆక్రోశం..
- విజయవాడ సత్యనారాయణపురంలో రెండు చోట్ల ఇబ్బందులు..
- ఇండిపెండెంట్స్ గెలవడం వెనక టీడీపీ ప్రమేయంపై ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ స్థానిక ఎన్నికల వేళ జనసేనలో ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోతోందా? అన్నీ పైపై కబుర్లే తప్ప… అసలు వ్యవహారం వేరుగా కనిపిస్తోందంటూ ఆ పార్టీ నాయకులు అసహనంగా ఉన్నారా? చాలా చోట్ల క్షేత్ర స్థాయిలో తమను పూచికపుల్లలతో సమానంగా తీసి పడేస్తున్నారని, మోసం చేస్తున్నారని ఫీలై పోతున్నారా? ఏ విషయంలో…? ఎందుకు ఆ అసహనం? ప్రస్తుత పరిస్థితులపై గ్లాస్ వర్గాల్లో జరగుతున్న చర్చలేంటి?
కూటమి ఐక్యత, పొత్తు ధర్మం. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న టైంలో ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో అన్నికంటే ఎక్కువగా వినిపిస్తున్న మాటలివి. అయితే… ఇవన్నీ ఒట్టి మాటలేని, గట్టి చేతలు మాత్రం వేరేగా ఉన్నాయంటూ జనసేన నాయకులు బాగా అసహనంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కొందరైతే… మా ఆశలు అడియాశలయ్యాయి. మమ్మల్ని మోసం చేశారంటూ ఆక్రోశిస్తున్నట్టు సమాచారం. తాము పోటీ చేసిన చోట్ల టీడీపీ వాళ్ళు ఇండిపెండెంట్స్కు మద్దతిచ్చి, లేదా తమ పార్టీ వాళ్ళనే స్వతంత్రులుగా బరిలో నిలబెట్టి దెబ్బ తీశారంటూ ఆరోపిస్తున్నారు జనసైనికులు.
Also Read
- OTR: బలమున్న చోట కాదు.. బలం లేని చోట సత్తా చాటాలని ఆదేశం.. బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి?
- OTR: ఇంచార్జ్ Vs లోకల్ లీడర్స్: రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగ.. చమర్తికి చెక్ పెడతారా?
- Off The Record: అత్తారింటి నుంచి అసెంబ్లీకి..! కవిత పోటీపై బోధన్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ
- OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
విజయవాడ లాంటి పెద్ద కార్పొరేషన్లోనే అలా జరిగిందట. సత్యనారాయణపురం పరిధిలోని రెండు డివిజన్స్‌ను ముందు జనసేనకు ఇవ్వడానికి అంగీకరించి ఆ తర్వాత ఇవ్వలేదట. పైగా… అక్కడ ఇండిపెండెంట్స్ గెలవడం వెనక టీడీపీ నేతల ప్రమేయం ఉందన్నది గ్లాస్ నేతల ఆరోపణ. కూటమి ధర్మం పాటిస్తున్నామని ఓవైపు చెబుతూనే…ప్రాక్టికల్‌గా మాత్రం టీడీపీ నాయకులు ఆపని చేయడం లేదని విమర్శిస్తున్నారు. అన్యాయం జరుగుతున్నట్టు కళ్ళముందే కనిపిస్తున్నా… ఎవరూ స్పందించడంలేదని ఫీలవుతున్నారు. అటు నర్సీపట్నంలో కూడా జనసేన ఛైర్‌పర్సన్‌గా పోటీ చేసిన సౌజన్యను విత్ డ్రా చేయించి, చివరికి వైస్ ఛైర్మన్‌తో సరిపెట్టారని అంటున్నారు.
విజయనగరంలో జనసేన కార్పొరేటర్‌గా గెలిచిన మహిళకు డిప్యూటీ మేయర్ బీఫామ్ ఇచ్చిన ఆనందం క్షణం కూడా నిలవలేదు. వెంటనే టిడిపికి ఇస్తున్నట్టు ప్రకటించారట. జనసేన నాయకురాలు గురాన రాధిక కార్పొరేటర్‌గా పోటీ చేయడానికి కారణమే డిప్యూటీ మేయర్ ఆశించి అంటున్నారు జనసైనికులు. చివరికి ప్లాన్ మొత్తం తిరగబడటంతో ఆమె తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా… జనసేన తరపున పదవులు ఆశించిన చాలా మంది నాయకులు భంగపడ్డారట. అలా జరిగిన ప్రతిచోట టీడీపీ వాళ్ళు డామినేట్ చేశారని, మోసం చేశారన్న ఫిర్యాదులు గ్లాస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుతున్నట్టు సమాచారం.
అదే సమయంలో మేం పొత్తు ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నామని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవని తెలుగుదేశం పార్టీ పెద్దలు ఇస్తున్న స్టేట్మెంట్స్ చూస్తున్న జనసైనికులకు ఇంకెక్కడో కాలుతోందట. కింది స్థాయిలో జరుగుతున్న వ్యవహారాలు తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారో అర్ధంకావడం లేదుగానీ… టీడీపీ పెద్దల స్టేట్మెంట్స్ మాత్రం గాయాలు చేస్తున్నాయంటున్నారు జనసేన లీడర్స్. మందు రాసినా మానని విధంగా మారుతున్నాయన్న మాటలు ఆ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే… కూటమి ధర్మం పాటించని ఏరియాల్లో… జనసేన నాయకులు వ్యక్తిగత పోటీలకు సిద్ధమయ్యారట. ఏకంగా కాకినాడ జిల్లా అధ్యక్షుడే స్ధానికంగా ఒంటరి పోరాటాలను ప్రోత్సహించారని చెప్పుకుంటున్నారు.
దెందులూరు మండల పరిషత్ సీట్లలో కూడా కూటమి ధర్మం అంటూనే జనసేనకు అన్యాయం చేశారంటూ ఆ పార్టీ కేడర్ గుర్రుగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే… ఇలా చాలా చోట్ల తాము భంగపడ్డట్టు ఫీలవుతున్నారట గ్లాస్ లీడర్స్. అలా నిరాశగా వాళ్ళను బుజ్జగించడానికి పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందా? కూటమి ధర్మం పాటించడం లేదంటూ అసహనంగా ఉన్న గ్లాస్ నేతలు ముందు ముందు కూటమి ఐక్యతకు సహకరిస్తారా అంటూ రకరకాల యాంగిల్స్‌లో చర్చలు జరుగుతున్నాయి రాజకీయవర్గాల్లో.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
Nandi Awards Jury: ఏపీ సర్కార్ నంది అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా బాలకృష్ణ!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!