Off The Record: ధర్మాన లెక్క తప్పుతోందేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధిష్ఠానం దగ్గర పట్టుబట్టి తన వ్యక్తికి MLC టికెట్ ఇచ్చేలా చేసుకున్నారు ఆ మంత్రి. నామినేషన్ వేస్తే ఏకగ్రీవం అవుతుందని లెక్కలేశారు. కానీ.. ఏకగ్రీవం కాలేదు. వ్యూహం ఎక్కడ బెడిసికొట్టింది? పాచిక పారడంతో ఫ్రస్ట్రేషన్‌లోకి జారుతున్నారా? ఆ అసహనం మరొకరిపై చూపిస్తున్నారా? ఇంతకీ సార్‌కు ఏటైంది? ఎవరా మంత్రి?
మంత్రి ధర్మాన లెక్క తప్పుతోందా?
ఒకప్పుడు ప్రత్యర్థులపై తన మాటల తూటాలతో విరుచుకుపడేవారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇప్పుడు సొంత పార్టీ నేతలపైనే చిందులు తొక్కుతున్నారు ఈ అమాత్యుల వారు. ఈ సీనియర్ పొలిటీషియన్‌కు ఏమైంది? మాట ఎందుకు తూలుతున్నారు? లెక్కగట్టి పద ప్రయోగం చేసే ధర్మాన.. లెక్క తప్పుతోందా? తప్పిందా? ప్రస్తుతం మంత్రి సొంత జిల్లా శ్రీకాకుళంలో.. అందులోనూ అధికారపార్టీ వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్నలు ఇవి.
Also Read
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
లాజిక్ మిస్ అవుతున్నారా?
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో మంత్రి ధర్మానలో మరో కోణం కనిపిస్తోంది. లాజిక్ మిస్ అవుతున్నారో ఏమో.. ఆయన మాటలు పార్టీలో మిస్‌ఫైర్ అవుతున్నాయనే టాక్ నడుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నేతలు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలో ఓ సీనియర్ నాయకుడి హోదాలో ధర్మాన చెప్పడంలో తప్పు లేదు. దిశానిర్దేశం చేయొచ్చు. కానీ.. సూచనలు మానేసి వార్నింగ్‌లు ఇస్తున్నారట ధర్మాన. ముఖ్యంగా వైసీపీకి చెందిన MPTC, ZPTC, కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్మాన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చగా మారాయి. ప్రతి 50 మందికి ఒక ప్రతినిధి ఉన్నారు. అంతా గమనిస్తున్నానని మంత్రి చెప్పడంతో ఆ కామెంట్స్ చేయడానికి దారి తీసిన పరిస్థితులు ప్రస్తుతం చర్చగా మారిపోయాయి.
‘నర్తు’ ఎన్నిక ఏకగ్రీవం కాకపోవడంతో ఒత్తిడికి లోనవుతున్నారా?
శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల MLC అభ్యర్థిగా నర్తు రామారావును వైసీపీ ఎంపిక చేయడం వెనుక మంత్రి ధర్మాన ప్రసాదరావు పాత్ర ఉందని చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ సీటును వైసీపీలోని తూర్పుకాపు సామాజికవర్గం నేతలు ఆశించినా.. కొత్త సమీకరణాలు.. సరికొత్త లెక్కలు పార్టీ అధిష్ఠానానికి చెప్పి నర్తు అభ్యర్థిత్వానికి ఓకే చేయించుకొచ్చారట ధర్మాన. సరే.. నర్తు రామారావును ఫైనల్ చేస్తున్నాం.. ఆయన్ని ఏకగ్రీవంగా గెలిపించే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని మంత్రి ధర్మానకు అధిష్ఠానం చెప్పేసిందట. అంతా అనుకున్నట్టే జరుగుతుందని భావించిన అమాత్యుల వారికి.. నామినేషన్ల దాఖలు తర్వాత సీన్ మారిపోవడంతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిందట. నామినేషన్ల ఉపసంహరణకు రెబల్ అభ్యర్థులు అంగీకరించకపోవడం.. ఇప్పుడు పోలింగ్ అనివార్యం కావడంతో వైసీపీ అధిష్ఠానం కూడా సీరియస్ అయినట్టు సమాచారం.
పోలింగ్ అనివార్యం కావడంతో ఉక్కిరి బిక్కిరి..?
వాస్తవానికి నాయకుల రాజకీయ చాణక్యం ఎన్నికల సమయంలోనే బయట పడుతుంది. గెలవాలి అనుకున్నప్పుడు చతురంగ బలాలను ఫీల్డ్‌లోకి దించుతారు. ఏకగ్రీవం చేయాలంటే అందుకు తగ్గట్టుగా వ్యూహ రచన చేస్తారు. సిక్కోలు MLC సీటు విషయంలో మంత్రి ధర్మాన లెక్కలు తప్పాయో ఏమో.. పోలింగ్ అనివార్యమైంది. దీంతో అటు అధిష్ఠానానికి సమాధానం చెప్పుకోలేక.. ఇటు గెలుపు వ్యూహాలపై పట్టు సాధించేందుకు ఒత్తిడికి లోనై మాట తూలుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో ధర్మానను ఈ విధంగా చూడలేదని.. అనేవాళ్లూ జిల్లాలో కనిపిస్తున్నారు. దిశానిర్దేశాలు మానేసి.. పార్టీ నేతలను బెదిరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు పార్టీ నేతలు. బలం లేకపోయినా MLC ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తుడటంతో మంత్రిగారి ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు వెళ్తోందనే ప్రచారం జరుగుతోంది. గతంలో గొర్లె హరిబాబు ఉదంతాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. మరి ఈ సమస్యను మంత్రి ధర్మాన ఎలా అధిగమిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!