ఆ మాజీ ఉప ముఖ్యమంత్రి పొలిటికల్ వీఆర్ఎస్ తీసుకోబోతున్నారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని ఎందుకు ప్రకటించారు? అది రాజకీయ వైరాగ్యమా? లేక అంతకు మించిన వ్యూహమా? వైసీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉండి, జగన్‌కు అత్యంత సన్నిహిడని పేరున్న ఆ లీడర్‌కి ఎవరు? పెద్ద స్థాయి పలుకుబడి ఉండి కూడా ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నారు? ఉమ్మడి శ్రీకాకుళంలో సుదీర్ఘ రాజకీయ ఆధిపత్యం చెలాయించారు ధర్మాన బ్రదర్స్. జిల్లాలో యాంటీ టీడీపీ స్టాండ్ అంటే……
మంత్రిగా మారాక ధర్మాన ప్రసాదరావు తన శాఖపై పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోసారి రెవిన్యూశాఖ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన. నిజాయితి గల పరిపాలన ప్రజలకు ఇవ్వాలన్నారు. త్వరితగతిన సేవలు అందించాలి. దీనికోసం వ్యక్తులు లేదా వ్యవస్థలను సంస్కరించాలన్నారు. ప్రజలనుండి రెవిన్యూ శాఖ పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, రెవిన్యూ శాఖని అన్నానంటే .నేను కూడా…
కౌలు రైతులకు వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని జనసేన ఆరోపించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతుల పట్ల ఏ రకంగా వ్యవహరించారో టీడీపీ, జనసేన మర్చిపోయినట్లు ఉన్నారన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. రైతుల రుణమాఫీ రద్దు చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? రైతుల రూ. 87,600 కోట్ల రుణం మాఫీ చేస్తామని చెప్పి…తీరా చేసింది 15వేల కోట్లు మాత్రమే. రైతులను పచ్చి దగా చేసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాదా?…
సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన ఆ నాయకుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. మరోసారి కేబినెట్‌లో చోటుదక్కలేదన్న ఆవేదనో ఏమో.. సైలెంట్. ఇప్పుడు గేర్‌మార్చి మాటల తూటాలు పేలుస్తున్నారు. ఎందుకలా? ధర్మాన ప్రసాదరావు కామెంట్స్‌తో అలజడి..!ధర్మాన ప్రసాదరావు. ఆయన మాట్లాడితే ఒక పదం ఎక్కువ తక్కువ ఉండదు. సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తారు. సిక్కోలు జిల్లాలో కీలకనేతగా గుర్తింపు పొందిన ప్రసాదరావు.. చాన్నాళ్లు మంత్రిగా ఉన్నారు. వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యాక మరోసారి కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించినా..…
రాష్ట్రంలో అమలవుతున్న ఉపాధి హామీ పథకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. వ్యవసాయానికి కూలీలు వెళ్లకూడదు అనేట్లు NREGS పథకాన్ని అమలు చేస్తే రైతులు బ్రతకరు అన్నారు ధర్మాన. ఈ విధంగా పథకాల రూపకల్పన దేశ నాశనానికి దారి తీస్తాయి. రెండు గంటలు పనికి డబ్బులు వేసేస్తుంటే.. ఓ పూట పని ఉండే వ్యవసాయానికి ఎందుకు వస్తారు ? ఇలాంటి పోరంబోకులను తయారు చేసే పద్దతి వ్యవసాయానికి దెబ్బ. రైతులకు ఏమైనా ఫర్వాలేదనే…