Off The Record: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టిడిపి కాపు నేతలు కుదురుగా ఉండలేకపోతున్నారట. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ కాపు నాయకుడు ఒక్కరు కూడా మంత్రిగా లేరు.. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా ఖచ్చితంగా తూర్పుగోదావరి నుంచి… వెసులుబాటును బట్టి ఒకరు లేక ఇద్దరు కాపు నేతలు మంత్రులుగా ఉండేవారు. మరికొందరికి కూడా అదే స్థాయిలో వెయిటేజ్ ఉండేది కానీ… జనసేనతో పొత్తు తర్వాత మొత్తం ఈక్వేషన్స్ మారిపోయాయంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఏడుగురు కాపు ఎమ్మెల్యేలు ఉన్నారు. ముగ్గురు జనసేన నుంచి, నలుగురు టిడిపి తరపున గెలిచారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజప్ప ఈసారి కూడా మంత్రి పదవి గంపెడాశలు పెట్టుకుని నెరవేరక సైలెంట్ అయిపోయారు.. జ్యోతుల నెహ్రు జీవితంలో ఒక్కసారైనా మంత్రి అవ్వాలని ఆశించి కుదరక టీటీడీ మెంబర్ గా సరిపెట్టుకున్నారు.
Read Also: Cyber Fraud: సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు కీలక అప్డేట్..
ఇక నామినేటెడ్ పదవుల విషయంలోనూ అదే జరుగుతుందని, అప్పుడు మేమే చేచయాలంటూ కుదురుగా ఉండలేకపోతున్నారట టీడీపీ కాపు నాయకులు. సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా తోట సుధీర్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి ఉన్నారు డిసిసిబి చైర్మన్ గా మర్రెడ్డి శ్రీనివాస్ పేరు దాదాపు ఖాయం అయిపోయినట్లు టాక్ నడుస్తోంది. ఈ ముగ్గురూ కాపులే అయినా… జనసేన నాయకులు. ఇక్కడే టీడీపీ నేతలకు మండిపోతోందట. కాపు కోటాలో ఇచ్చే పదవులన్నిటినీ జనసేనకు కట్టబెడితే మా గతేంటన్నది వాళ్ళ క్వశ్చన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం చాలా చేశాం. కానీ… అధికారం వచ్చాక పొత్తు పేరుతో పూర్తిగా పక్కన పెట్టేస్తే ఇక రాజకీయాలు ఎలా చేయాలని అడుగుతున్నారట. జనసేన కాపులకు పదవులు ఇవ్వడంపై అభ్యంతరం లేదుగానీ… ఆ పేరుతో మమ్మల్ని పూర్తిగా పక్కకు నెట్టేస్తే… మాకూ అనుచరులు ఉంటారు, మేమూ రాజకీయం చేయాలికదా అని అంటున్నారట.పొత్తు ధర్మం ప్రకారం పదవులు ఇవ్వాలి. కానీ… అదే కులానికి చెందిన మమ్మల్ని పూర్తిగా బలిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని టీడీపీ అధిష్టానానికి ప్రశ్నలు సంధిస్తున్నారట ఆ పార్టీ కాపు నాయకులు. జనసేనలో మిగతా సామాజిక వర్గాలకు కూడా ప్రయారిటీ ఇచ్చేలా పార్టీ పెద్దలు ఒప్పించవచ్చు కదా అన్నది వాళ్ళ ప్రశ్న. టీడీపీ కాపులు ఇక త్యాగరాజులుగా మిగిలిపోవాల్సిందేనా అని చర్చించుకుంటున్నట్టు సమాచారం.
Read Also: Pakistan: బలూచిస్తాన్‌లో బీఎల్ఏ ధమాకా.. 22 మంది పాక్ సైనికుల హతం..
సైకిల్ పార్టీని నమ్ముకుని కూడా కొందరు కాపులున్నారన్న సంగతిని మర్చి పోవడం అంత మంచిది కాదని స్వీట్ వార్నింగ్ కూడా ఇస్తున్నారట. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళని సైతం సంప్రదించకుండా పదవులు డిక్లేర్ చేసేస్తే ఎలాగన్నది తమ్ముళ్ళ ఆవేదన. జనసేన సబ్ జూనియర్స్‌కి కూడా ఆ పార్టీ కోటాలో పదవులు వచ్చేస్తున్నాయని, ఇక్కడ మాత్రం సూపర్ సీనియర్స్ అయినా కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదని మండిపడుతున్నారట. జిల్లాకు కాపు కోటాలో వచ్చే పదవులన్నిటినీ… గ్లాస్ కి ఇచ్చేస్తే సైకిల్ రిపేర్‌కు కూడా వీలవనంతగా డ్యామేజ్ అనుతుందన్న సంగతి తెలియదా అని అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. జిల్లా కాపుల్లో తమకి పట్టు ఉందని గుర్తు చేస్తూనే ఆ విషయం పార్టీ పెద్దలు ఎందుకు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కాపు లీడర్స్. ఇలా వన్ సైడ్ నిర్ణయాల వల్ల ఇప్పటికప్పుడు ఏం కనిపించకున్నా…. దాని ప్రభావం ఫ్యూచర్ పాలిటిక్స్ మీద కచ్చితంగా ఉంటుందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. సోలో పర్ఫామెన్స్ అంటే కుదరదని, ఆ చట్రం నుంచి టీడీపీ అధిష్టానం బయటకు రావాలని అంటున్నారట. మొత్తానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపు తమ్ముళ్ళు బరస్ట్ అయిపోతున్నారు.. తమ కులం పేరు చెప్పి వేరే పార్టీకి పెత్తనం ఇవ్వడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారట. ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది. ఇకనన్నా కళ్ళు తెరిచి మమ్మల్ని గుర్తిుంచండన్నది వాళ్ళ మాట. టీడీపీ అధిష్టానం కాపు తమ్ముళ్ళని ఎలా సముదాయిస్తుందో చూడాలి మరి.