ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టిడిపి కాపు నేతలు కుదురుగా ఉండలేకపోతున్నారట. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ కాపు నాయకుడు ఒక్కరు కూడా మంత్రిగా లేరు.. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా ఖచ్చితంగా తూర్పుగోదావరి నుంచి... వెసులుబాటును బట్టి ఒకరు లేక ఇద్దరు కాపు నేతలు మంత్రులుగా ఉండేవారు.
ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయం కొత్త కాదు.. కానీ, మరోసారి కులరాజకీయం తెరపైకి వస్తోంది.. తాము అంటే తామేనని ప్రకటిస్తున్నారు నేతలు.. తాజాగా, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. కాపులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో కాపు సామాజిక వర్గం రాజకీయంగా నష్టపోయిందన్న ఆయన.. కాపులకు న్యాయం జరిగేది బీజేపీతోనే అని ప్రకటించారు.. ఇక, ప్రజాగ్రహ సభ తర్వాత టీడీపీ, బీజేపీల గుండెల్లో రైళ్లు పరుగెట్టాయని చెప్పుకొచ్చారాయన.. భారతీయ జనతాపార్టీది సబ్ కా సత్ సబ్ కా వికాస్…