Off The Record: కేటీఆర్ ఇప్పుడెందుకు స్టేట్ టూర్‌కు ప్లాన్ చేస్తున్నారు..? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి..?
- స్టేట్ టూర్‌కు సిద్ధమైన కేటీఆర్..
- జిల్లా కేంద్రాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు..
- పార్టీ కేడర్‌లో తిరిగి జోష్ తీసుకొచ్చే ప్రయత్నం..
- టూర్ వెనక మేటర్ ఇంకేదో ఉందన్న చర్చ..
- కేటీఆర్ క్లాస్ నుంచి మాస్ లీడర్‌గా మారే ప్లాన్‌లో ఉన్నారా?..
- అన్ని స్థాయుల్లో పార్టీ మీద పట్టు బిగించాలనుకుంటున్నారా?..
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల నష్టం జరిగిందా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తిరగాలని డిసైడయ్యారు. అన్ని జిల్లాలకు వెళ్ళి, పార్టీ మీటింగ్స్ పెట్టి కేడర్‌లో ఉత్సాహం నింపాలన్నది ప్లాన్ అట. సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతోంది గులాబీ పార్టీ. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించేలా కార్యాచరణ ఖరారైందట. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తాజాగా తెలంగాణ భవన్లో పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. వరంగల్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఎవరి స్థాయిలో వారు శక్తివంచన లేకుండా పని చేయాలని ఆదేశించారు. కేడర్‌తో వరుస సమావేశాల ద్వారా తిరిగి జోష్ పెంచాలన్నది అధిష్టానం ప్లాన్‌గా తెలుస్తోంది. ముందు అన్ని జిల్లాల్లో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించి ఫైనల్‌గా వరంగల్‌లో రాష్ట్ర స్థాయి సభకు నిర్ణయించారు. అదే సమయంలో కేటీఆర్ గ్రామీణ ప్రాంతాల పర్యటన ఖరారుతో… రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది.
మొదటిగా ఈనెల 19న సూర్యాపేటలో, 23న కరీంనగర్లో పర్యటిస్తారు కేటీఆర్. ఈ సమావేశాల్లో గ్రామస్థాయి కార్యకర్త నుంచి జిల్లా లెవల్ వరకు అంతా పాల్గొనాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్ళాయట. ఈ టూర్స్ వెనక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం పార్టీ కేడర్ని రీఛార్జ్ మోడ్‌లోకి తీసుకురావడం అయితే… అంతర్లీనంగా అంతకు మించి ఉండి ఉంటాయని విశ్లేషిస్తున్నారు కొందరు. పార్టీలో ప్రస్తుతం కేటీఆర్‌కు క్లాస్ ఇమేజ్ ఉంది. రూరల్ కేడర్‌లో ఆయన మీద సానుకూలత ఎంతవరకు ఉందో క్లారిటీలేదని పార్టీ వర్గాలే చెప్పుకుంటుంటాయి. అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్ గ్రామీణ బాట పట్టి… అన్ని ఏరియాల్లో, అన్ని వర్గాల్లో పార్టీపై పట్టు బిగించే ఎత్తుగడ ఉండి ఉండవచ్చంటున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చాక అడపాదడపా కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైంది బీఆర్ఎస్. అంశాల ప్రాతిపదికన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక నుంచి అలా కాకుండా జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తున్నారట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల జిల్లాల్లోకి సరిగా వెళ్లలేకపోయామని, దీనిద్వారా కార్యకర్తలను, ప్రజల్ని కలవలేకపోయామన్న చర్చ జరుగుతోంది పార్టీలో. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు, మాస్‌లోకి దూకుడుగా వెళ్ళేందుకు కేవలం సోషల్ మీడియాకు పరిమితమై ఉంటే సరిపోదని, క్షేత్ర స్థాయికి వెళ్ళి కార్యక్రమాలు నిర్వహిస్తేనే రిజల్ట్ ఉంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే సోషల్ మీడియా వార్ని ఓవైపు కొనసాగిస్తూనే… మరోవైపు గ్రౌండ్ లెవెల్లో పోరాటాన్ని ఉధృతం చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
Also Read
- Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
- OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
- Off The Record: పాలకొల్లు వైసీపీకి ఎందుకు కలిసిరావడం లేదు?
- Off The Record: ఆ 24 మంది ఎవరు? తాడిపత్రిలో జేసీ సంచలన హెచ్చరిక
పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టినా… అది కొందరికే చేరుతుందని, అదే…. మండల, గ్రామ స్థాయిలో ఏదో అంశాన్ని తీసుకుని పోరాటం చేస్తే…ప్రభావవంతంగా ఉంటుందన్నది బీఆర్ఎస్ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పుడు కేటీఆర్ రూరల్ టూర్‌తో…. ఆ లక్ష్యం నేరవేరడంతోపాటు… ఆయన కూడా మాస్ ఇమేజ్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ జాగృతి తరపున ఎమ్మెల్సీ కవిత జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అటు హరీష్‌రావుకు ఆల్రెడీ మాస్ లీడర్ ఇమేజ్ ఉంది. ఆయనకు గ్రామీణ ప్రాంతాల్లోనే పట్టు ఎక్కువని కూడా చెప్పుకుంటాయి పార్టీ వర్గాలు. దీంతో ఇప్పుడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ మీద కూడా రూరల్ టూర్ ప్రెషర్ పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆయన కూడా జిల్లాల పర్యటనలకు రావాలని పార్టీ ద్వితీయశ్రేణి, కేడర్ గట్టిగా అడుగుతున్నారట. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక… బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో…. అధికారిక టూర్స్ తప్ప… పార్టీ పరంగా ఆయన జిల్లాల పర్యటనలు చేసే అవకాశం దక్కలేదంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం ద్వారా పార్టీ మీద పూర్తి గ్రిప్ తెచ్చుకోవాలని భావిస్తున్నారట. అందుకే మొదట పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జిల్లా సమావేశాలు పెట్టి… మెల్లిగా రాష్ట్రమంతటా తిరిగే ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే… ముందుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక నియోజకవర్గం సూర్యాపేటతో మొదలుపెట్టాలని అనుకుంటున్నారట. ఈ టూర్స్ బీఆర్ఎస్కు ఎంత వరకు ఉపయోగపడతాయో, వ్యక్తిగతంగా కేటీఆర్ మాస్ లీడర్‌గా ఎదగడానికి ఎంత వరకు దోహదం చేస్తాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. టూర్ మొదలయ్యాక పార్టీలో పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలన్నది ఇంకొందరి మాట. డొంక రోడ్లలో గులాబీ కారు ఎంత స్పీడ్‌తో దూసుకుపోతుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
-
Pakistan: పాక్‌లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Anil Ravipudi: త్రివిక్రమ్‌ను అనిల్ రావిపూడి డామినేట్ చేసేశాడా?
-
Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
-
GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఎన్టీఆర్!
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!