హృతిక్ రోషన్ హీరోగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్‌తో డీ అంటే డీ అనేలా ఈ సినిమాలో జూనియర్ పాత్ర ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కూలీ సినిమాతో ఈ సినిమా పోటీ పడబోతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేస్తున్నాడు.
Also Read:Ram Charan Fans : ఇది చివరి హెచ్చరిక.. రామ్ చరణ్ గురించి తప్పుగా మాట్లాడితే ఖబడ్డార్!
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తికాగా, ఈ రోజు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సాంగ్ షూట్ కూడా ముంబైలో ప్రారంభమైంది. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను సీతారామ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. నాగవంశీ తనకు తాను జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా చెప్పుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ గత చిత్రం దేవర హక్కులను కూడా ఆయనే దక్కించుకున్నాడు.
Also Read:Ram Charan: దిల్ రాజు అలా.. శిరీష్ ఇలా.. అసలేంటీ మ్యాటర్?
ఇక ఈ సినిమా హక్కులను కూడా గట్టి పోటీలో దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులు 100 కోట్ల వరకు డిమాండ్ చేయగా, సుమారు 80 కోట్ల వరకు నాగవంశీ పెట్టేందుకు సిద్ధమైనట్లు ఉదయం వార్తలు వచ్చాయి. అయితే ఈ డీల్ ఎంతకు క్లోజ్ అయిందనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ ఫైనల్‌గా నాగవంశీ మాత్రం తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి సంబంధించిన అన్ని భాషలలోనూ రిలీజ్ చేయబోతున్నారు.