Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Paderu Ysrcp Politics

Off The Record: అక్కడి వైసీపీ నేతలకు చెమటలు..? అధిష్టానం స్ట్రాంగ్ వార్నింగ్..!

Published Date :December 3, 2024 , 10:40 pm
By Sudhakar Ravula
  • పాడేరులో సెగలు రేపుతున్న వైసీపీ అంతర్గత పోరు..
  • తొలిసారి ఎమ్మెల్యేగా మత్స్యరాస విశ్వేశ్వరరాజు..
  • ఎమ్మెల్యే వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ..
  • అసెంబ్లీకి వెళ్ళే అవకాశం లేని ఫస్ట్‌టైం ఎమ్మెల్యే..
  • ఎమ్మెల్యే మాట్లాడ్డం లేదంటూ ప్రత్యర్థుల టార్గెట్‌..
  • సొంత పార్టీ నేతలే సోషల్‌ మీడియా ప్రచారం చేస్తున్నారా?..
Off The Record: అక్కడి వైసీపీ నేతలకు చెమటలు..? అధిష్టానం స్ట్రాంగ్ వార్నింగ్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: వైసీపీ కంచుకోట పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్‌. ఈ ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానంలో… అభ్యర్థితో సంబంధం లేకుండా పార్టీకి ఓట్లు పడిపోతాయి. అందుకే 2014, 2019, 2024లో వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టగలిగింది. గత ఎన్నికల్లో అయితే… రాష్ట్రం మొత్తం కూటమి ప్రభంజనం సృష్టించినా… ఇక్కడ మాత్రం ఆ ప్రభావం కనిపించలేదు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసిన మత్స్యరాస విశ్వేశ్వరరాజు… టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై గెలిచారు. కానీ… ఆ తర్వాతి నుంచి లోకల్‌ వైసీపీలో తేడాలు పెరిగిపోతున్నాయట. పార్టీకి జనంలో ఆదరణ బాగానే ఉన్నా… పరస్పరం పొసగక నాయకులే పరిస్థితిని దిగజార్చుకుంటున్నారన్న టాక్‌ నడుస్తోంది పాడేరులో. ఇటీవల సంస్థాగత మార్పుల్లో భాగంగా… ఎమ్మెల్యేకి అల్లూరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది హై కమాండ్‌. మరో నేత భాగ్యలక్ష్మికి రాష్ట్ర ఎస్టీ విభాగంలో కీలక పదవితో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా సోషల్ మీడియా టాస్క్‌ఫోర్స్‌ టీమ్ సభ్యురాలిగా ప్రకటించింది. ఆ తర్వాతి నుంచి మారుతున్న పరిస్థితులతో ఎమ్మెల్యే ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు.

Read Also: Maharashtra: ‘మహా’రాజకీయం.. ఫడ్నవీస్, షిండే భేటీ..

ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకు వస్తున్న సమస్యలు విశ్వేశ్వరరాజును చికాకు పెడుతున్నట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీకి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకుంది వైసీపీ హైకమాండ్‌. దీంతో తొలిసారి ఎమ్మెల్యే అయిన విశ్వేశ్వర రాజు .. అధ్యక్షా”…. అనే అవకాశం లేకుండానే సమావేశాలు ముగిసిపోయాయి. కానీ… ప్రత్యర్థి వర్గం మాత్రం…ఎమ్మెల్యే ఏం చేయడం లేదు, ఏం మాట్లాడ్డం లేదంటూ సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేస్తోందట. స్పెషల్ డీఎస్సీ, జీవో నెంబర్ 3 వంటి అంశాలపై విశ్వేశ్వరరాజు గొంతు విప్పాలని, తాము ఓట్లేసి గెలిపించినందున అసెంబ్లీ దగ్గరే స్వరం వినిపించాలంటూ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగానే చేసినట్టు సమాచారం. ఇదంతా చూస్తున్నవారు మాత్రం ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టేందుకే కొందరు పనిగట్టుకుని ఇలాంటి స్పెషల్‌ కేంపెయిన్‌ చేస్తున్నట్టు గుసగుసలాడుకుంటున్నారట. మరోవైపు విశ్వేశ్వర రాజు పై మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి న్యాయపోరాటం ప్రారంభించారు. ఎన్నికల అఫిడవిట్లో ఉద్దేశపూర్వకంగా వాస్తవాలు వెల్లడించలేదని, అందుకు ఆయన మీద అనర్హత వేటు వేయాలంటూ కోర్ట్‌కు వెళ్ళారామె. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్టీ కమిషన్ మెంబర్‌గా లాభదాయకమైన పదవి నిర్వహించిన విశ్వేశ్వర రాజు… అప్పుడు ప్రభుత్వం నుంచి తీసుకున్న జీతభత్యాలను అఫిడవిట్‌లో పొందుపరచకపోవడం నేరం అన్నది ఈశ్వరి వాదన. ఇందులో గనక ఏదన్నా కాస్త తేడా జరిగినా ఆయనకు ఇంకో టెన్షన్‌ మొదలైనట్టేనంటున్నారు పరిశీలకులు. ఇటు పార్టీలో, అటు బయట సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట పాడేరు ఎమ్మెల్యే.

Read Also: Relationship Tips: ఆ సమస్యల కారణంగా లైంగిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు.. జాగ్రత్త మరి

బయటి సంగతి ఎలా ఉన్నా… పార్టీ అంతర్గత రాజకీయాలు మాత్రం ఆయనకు చాలా ఇబ్బందికరంగా మారాయన్నది ఇంటర్నల్‌ టాక్‌. నియోజకవర్గంలో భాగ్యలక్ష్మి, విశ్వేశ్వర రాజు వర్గాల మధ్య గ్యాప్‌ బాగా పెరిగిపోయిందంటున్నారు స్థానిక నాయకులు. ఈ పరిణామాలతో అప్రమత్తమైన పార్టీ అధినాయకత్వం ఇటీవల పాడేరు నియోజకవర్గ నాయకులను తాడేపల్లి పిలిచి… కుమ్ములాటలతో నష్టం చేస్తే సహించబోమని స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చినట్టు సమాచారం. ఆ మీటింగ్‌ తర్వాత పార్టీలోని రెండు వర్గాలు కలిసి పనిచేసినట్టు కనిపిస్తున్నట్టు కనిపిస్తున్నా… వర్గ రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి ఇటు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుగాని, అటు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిగాని ఎక్కడా తగ్గడం లేదన్నది లోకల్‌ టాక్‌. ఈ పరిణామాలతో సీనియర్‌ లీడర్స్‌ తలోదారి చూసుకోవడం కేడర్‌ను ఇంకా కంగారు పెడుతోందట. ఎన్నికలకు ముందు కొందరు కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోగా… ఇప్పుడు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా పక్క చూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో కనీస గౌరవం దక్కడం లేదని, నాయకత్వంలో కలుపుకుని పోయే తత్వం కొరవడిందన్నది బాలరాజు ఆవేదనగా చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే… పట్టున్న చోట ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నది పరిశీలకుల మాట. వైసీపీ పెద్దలు ఇంకెలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • off the record
  • paderu
  • YSRCP

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions