Tourist Rush in Araku Valley: అల్లూరి సీతారామరాజు జిల్లాలో టూరిజం జోష్ పీక్స్ కు చేరింది. ఇయర్ ఎండ్, హాలిడేస్ కలిసి రావడంతో ఎక్కడ చూసిన పర్యాటకుల సందడే కనిపిస్తోంది.
108 అంబులెన్స్ రాక శిశువు మృతి చెందటంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కుయ్ కుయ్ మూగబోతోంది.. ప్రజల ప్రాణాలు పోతున్నాయి’ అని కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు ప్రభుత్వం ఉరివేస్తోందని ఫైర్ అయ్యారు. పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 వాహనం రాకపోవడంతో.. ఆమె ఆటోలోనే ప్రసవించింది. వైద్యం అందక శిశువు ఆటోలోనే కన్నుమూసింది.…
వైసీపీ కంచుకోట పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్. ఈ ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానంలో... అభ్యర్థితో సంబంధం లేకుండా పార్టీకి ఓట్లు పడిపోతాయి. అందుకే 2014, 2019, 2024లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టగలిగింది. గత ఎన్నికల్లో అయితే... రాష్ట్రం మొత్తం కూటమి ప్రభంజనం సృష్టించినా... ఇక్కడ మాత్రం ఆ ప్రభావం కనిపించలేదు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసిన మత్స్యరాస విశ్వేశ్వరరాజు...
ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా.. గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం మారడం లేదు.. రాజకీయ నేతలు హామీలు ఇస్తూనే ఉన్నారు.. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు అవుతూనే ఉన్నాయి.. కానీ, గిరిజనుల కృష్టాలు తీరడం లేదు.. పురిటినొప్పులు వచ్చిన గర్భిణిలను ఆస్పత్రికి తరలించాలంటే కష్టమే.. మరోవైపు.. కన్నుమూసినవారికి అంత్యక్రియలు నిర్వహించడానికి సొంత గ్రామానికి చేర్చాలన్నా ఆపసోపాలు తప్పడంలేదు..
పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశం ఇచ్చారు. క్షతగాత్రులకు మంచి ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని.. ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు సీఎం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందినట్లుగా సమాచారం తెలుస్తోంది. సుమారు 15 మంది వరకు తీవ్ర గాయాలు అయ్యాయి.