Off The Record: ఏపీ కూటమిలో కొత్త టెన్షన్ మొదలైందా?
- ఏపీ స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్..
- వచ్చే జనవరిలోపు మున్సిపాలిటీలకు జరపాలన్న ఎన్నికల కమిషన్..
- అదే ఏడాది జులైలోపు పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు..
- కింది స్థాయిలో కూటమి పార్టీల మధ్య సమన్వయంపై డౌట్స్..
- స్థానిక ఎన్నికల్ని ఎదుర్కోవడం ఎలాగన్న ప్రశ్న..
- కేడర్ కలిసి పని చేస్తుందా, కొంప ముంచుతారా అన్న భయాలు..
- యూరియా కొరత ప్రభావం సంగతేంటన్న క్వశ్చన్..
- సంక్షేమ కార్యక్రమాలు జనంలోకి వెళ్ళడం లేదన్న అభిప్రాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియరైంది. దానికి సంబంధించి సర్కార్‌కు పలు సూచనలు ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మున్సిపల్, పంచాయితీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్‌కు సిద్ధం కావాలంటూ… ఒక షెడ్యూల్‌తో కూడిన వివరాలు అందజేసింది కమిషన్. వచ్చే ఏడాది జనవరిలోపు మున్సిపాలిటీలకు, ఆ తర్వాత జులైలోపు పంచాయతీలు, జడ్పిటిసి….ఎంపిటిసీలకు ఎన్నికలు జరపాలని సూచించింది. దీంతో అధికార యంత్రాంగం కూడా ఆ దిశగా అడుగులు వేయబోతోంది. అదంతా ఒక ఎత్తయితే…. ఎన్నికల సంఘం నిర్ణయం తర్వాత కూటమి పార్టీల్లో కొత్త చర్చ మొదలైందట. మూడు పార్టీల నడుమ ఎంత వరకు సయోధ్య ఉందన్న విషయంలో వాళ్ళకే అనుమానాలు ఉన్నట్టు తెలుస్తోది. నిస్సందేహంగా… పై స్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకత్వాల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని, అదే కిందికి వచ్చేసరికి ప్రశ్నార్ధకమేనన్న చర్చ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. గ్రామ, మండల స్థాయిలో…, కొన్ని చోట్లయితే నియోజకవర్గ లెవల్‌లో కూడా మూడు పార్టీల మధ్య అనైక్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు.
Read Also: Mirai : ఓజీ థియేటర్లలో రక్తపాతమే : తేజసజ్జా
Also Read
- Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
- Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు... ఆ సీట్లు దక్కేదెవరికి..?
- Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా... ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి...?
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
కూటమి స్థానిక నేతల మధ్య సఖ్యత చాలా తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో…. లోకల్ బాడీస్ ఎన్నికల్ని ఎలా ఎదుర్కోవాలి, ఓటింగ్ మీద దాని ప్రభావం ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోందట నేతల మధ్య. ఇలాంటి వాతావరణంలో అసలు క్యాడర్ కలిసి పనిచేస్తుందా? వాళ్ళకని వీళ్ళు, వీళ్ళకని వాళ్ళు అలకలు, పంతాలతో మొదటికే మోసం తెస్తారా అన్న ఆందోళన సైతం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. ఇప్పటివరకు పై స్థాయిలో ఐక్యత బానే ఉన్నా..కింది లెవల్‌లో మాత్రం కొన్ని చోట్ల క్యాడర్, లీడర్స్ రగిలిపోతున్నపరిస్థితి కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు ముఖ్య నాయకుల్ని టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఒక పక్క యూరియా కొరత ఆందోళనలు, రైతులు రోడ్డెక్కడం లాంటివి కంగారు పెడుతున్నాయట.ఈ ప్రభావం కూడా స్థానిక ఎన్నికలపై పడుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో టీడీపీ జనసేన మధ్య ఐక్యత పై అనేక అనుమానాలు ఉన్నాయంటూ స్వయంగా రెండు పార్టీల ముఖ్య నేతల మధ్యనే మాటలు నడుస్తున్నాయట. ప్రధానంగా…. ఉమ్మడి ఉభయ గోదావరి, ఉత్త్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ జనసేన నేతల మధ్య క్షేత్ర స్థాయిలో సమన్వయం కుదరడం లేదని తెలుస్తోంది.
ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందన్న భయాలు పెరుగుతున్నాయట. ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా….జనంలోకి సరిగ్గా తీసుకు వెళ్లలేకపోతున్నామని, ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని ఇటీవల సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఎన్నికలకు వెళ్ళాలి. ఇలా అయితే ఎలాగంటూ… తాజా క్యాబినెట్ మీటింగ్ తర్వాత సీఎం మంత్రులతో అన్నట్టు సమాచారం. ఎమ్మెల్యేలు, మంత్రులు అలర్ట్‌గా ఉంటేనే…..కింది స్థాయిలో క్యాడర్ సరిగ్గా ఉంటుందని సీఎం అన్నట్టు తెలిసింది. ప్రభుత్వం..ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటన్నిటినీ జనంలోకి తీసుకు వెళ్తేనే స్థానికం లో మాంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు మాడు పార్టీల పెద్దలు. అందుకు తగ్గట్టు కింది స్థాయిలో సమన్వయం పెంచేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారట కూటమి పెద్దలు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?