Mirai : తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో తేజసజ్జా మాట్లాడుతూ.. మిరాయ్ సినిమాను చాలా కష్టపడి చేశాం. ఈ సినిమాలో విజువల్స్, బీజీఎం చూస్తే కచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. మూవీని చాలా కొత్తగా చేశాం. ఎప్పుడూ చూడని విధంగా మీకు అనిపిస్తుంది అంటూ తెలిపాడు తేజసజ్జా. అయితే తేజ మాట్లాడుతుండగా అభిమానులు ఓజీ ఓజీ అంటూ అరవడం స్టార్ట్ చేశాడు.
Read Also : Mirai : మిరాయ్ సినిమా చూస్తే గూస్ బంప్స్ పక్కా : తేజసజ్జా
దీంతో తేజ రియాక్ట్ అయ్యాడు. వెళదాం బ్రదర్. కచ్చితంగా పవన్ కల్యాణ్ గారి ఓజీ సినిమాకు వెళదాం. ముందు మిరాయ్ కు వెళ్లిన తర్వాత ఓజీ థియేటర్లకు వెళ్దాం. ఆ మూవీ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఓజీ థియేటర్లలో రక్తపాతమే ఉంటుంది అంటూ మరింత ఉత్సాహం నింపాడు తేజసజ్జా. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మిరాయ్ సినిమా ఇతిహాసాలను బేస్ చేసుకుని వచ్చిందని.. సినిమా చూసిన తర్వాత మరిన్ని విషయాలు పంచుకుంటానని తెలిపాడు తేజ.
Read Also : Manchu Manoj : మీరు నా వెనకాల ఉంటే నన్ను ఎవరు ఏం చేయలేరు