Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
- వచ్చేనెల తెలంగాణలో మూడు గవర్నర్ కోటా సీట్లు ఖాళీ
- సామాజిక న్యాయం కోణంలో కాంగ్రెస్ ఆలోచనలు
- పట్టభద్రుల సీట్లు రెండూ రెడ్డి సామాజికవర్గానికి ఫిక్స్
- ఇప్పుడు మూడింటిలో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలన్న ఆలోచన
- మిగిలిన ఒక సీటు కోసం బ్రాహ్మణ సామాజికవర్గంలో పోటీ
- పోటీ పడుతున్న హర్కర వేణుగోపాల్, దయాసాగర్, పవన్ మల్లాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లు ఎవరికి? ఖాళీ అవబోతున్న మూడు సీట్ల భర్తీ విషయంలో సామాజిక సమీకరణాల లెక్కలు ఎలా ఉన్నాయి? ఆ సీట్ల మీద ఎవరి ఫోకస్ ఎక్కువగా ఉంది? కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
తెలంగాణ కౌన్సిల్‌లోని గవర్నర్ కోటా MLCలు ముగ్గురి పదవీ కాలం వచ్చే నెల ముగిస్తుంది. దీంతో… అధికార కాంగ్రెస్‌లో చాలా మంది ఈ సీట్ల మీద ఆశలు పెట్టుకున్నారు. ఇవైతే… ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, అధిష్టానం నుండి వత్తిళ్ళు… ఎలాంటి టెన్షన్స్ లేకుండా… పెద్దల సభలోకి అడుగు పెట్టవచ్చని లెక్కలు వేసుకుంటున్నారు నేతలు. అదే సమయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా… గవర్నర్ కోటాలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేయాలని భావిస్తోందట. పట్టభద్రుల నియోజక వర్గాల సీట్లు రెండూ రెడ్డి సామాజిక వర్గం నేతలకు ఇవ్వడంతో… గవర్నర్ కోటాలో మాత్రం సామాజిక న్యాయం పాటించాలని డిసైడ్ అయినట్టు తెలిసింది.
Also Read
- OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
- Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
- OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ఎమ్మెల్సీని చేస్తామని ఆ మధ్య సిరిసిల్ల సభలో ప్రకటించారు సీఎం రేవంత్‌రెడ్డి. దాంతో… బీసీ కోటాలో ఒక సీటు ఖాయమని అనుకుంటున్నారు. ఇక మిగిలిన రెండు సీట్లలో ఒకటి sc.. మరొకటి ocలకు ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఉన్నాయట. ఐతే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. బీసీ లకు రెండు సీట్లు ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఆ కోటాలో ఒకటి పద్మశాలి సామాజిక వర్గానికి ఇస్తారు కాబట్టి… రెండో సీటును ముదిరాజ్‌లకు ఇవ్వాలనే ప్రతిపాదన వస్తోంది. అభ్యర్ధులు ఎవరన్న సంగతి తర్వాతగానీ… ముందు సామాజిక వర్గాల వారీగా లెక్కలు ముఖ్యమని అంటున్నారు. మూడింటిలో రెండు సీట్లను బీసీలకు ఇవ్వాలనే ఆలోచనను పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ ఇప్పటికే అధిష్టానానికి షేర్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలో మూడో సీటు ఎవరికి అనేది ఇప్పుడు అసలు చర్చగా మారింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇవ్వాలన్నది ఒక ప్రపోజల్. ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ , దయాసాగర్, ఇన్సూరెన్స్ ఇంచార్జి పవన్ మల్లాది దాని కోసం పోటీ పడుతున్నారు. మరో వైపు గాంధీ భవన్ ఇన్ఛార్జ్, వెలమ సామాజిక వర్గానికి చెందిన కుమార్ రావు కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారట. అలాగే… ఎస్సీ సామాజిక వర్గం నుండి చాలా మంది నేతలు MLc సీటు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉన్న మూడింట్లో రెండు బీసీలకు ఇవ్వాల్సి వస్తే… మిగిలిన ఆ ఒక్కటి ఎవరికి ఇస్తారు..? ఎవరిని పక్కనవేస్తారన్న చర్చ కూడా తెరమీదకు వచ్చింది. తలనొప్పి ఉండదు.. టెన్షన్ అసలే ఉండదు.. పెద్దల సభలోకి ఈజీగా వెళ్లొచ్చని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటుూ వత్తిడి తెస్తున్న క్రమంలో… కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుందన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
తాజావార్తలు
-
IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
-
Mumbai Indians: ఎంఐలో సంచలన మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా ఉత్తప్ప.. మలింగ స్థానంలో మిచెల్, కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే..
-
Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలాపడ్డ పూజా హేగ్డే.. ఇక ఆశలన్నీ ఆ మూడు సినిమాలపైనే!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!