Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
- సింగరేణి ఏరియాలో ఒకప్పుడు బీఆర్ఎస్కు గట్టి పట్టు
- కోల్ బెల్ట్‌లో గత ఎన్నికల్లో గులాబీకి గట్టి దెబ్బ
- 30కి పైగా ఉన్న నియోజకవర్గాల్లో ఆసిఫాబాద్‌లో మాత్రమే గెలుపు
- ఇప్పుడు కోల్‌బెల్ట్ మీద బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్
- పునర్విభజన జరిగితే నియోజకవర్గాల సంఖ్య 40 అయ్యే ఛాన్స్
- కార్మికుల సమస్యలే అజెండాగా ఉద్యమ కార్యాచరణ
- మేం చాలా చేశాం, కాంగ్రెస్ చేయడం లేదని చెప్పే ప్లాన్
- రామగుండం సభతో మొదలు పెట్టి తగ్గకూడదన్న ఆలోచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో సింగరేణి ప్రాంతానిది ప్రత్యేకమైన గుర్తింపు. ఇక్కడ కార్మిక, ఉద్యోగ వర్గాలు ఎక్కువ కాబట్టి రాజకీయ చైతన్యం కూడా ఎక్కువేనని చెబుతారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కోల్ బెల్ట్ కీలకంగా పని చేసింది. ఆ క్రమంలోనే… అప్పట్లో బీఆర్ఎస్ గట్టి పట్టు సాధించింది. అందుకు తగ్గట్టే గులాబీ ముఖ్య నేతల ఫోకస్ ఎక్కువగా ఇటువైపు ఉండేది. ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా… సింగరేణి ప్రాంతంలోనే ఎక్కువ ఎమ్మెల్యేలను గెలుచుకునేది. అలాంటి చోట గత ఎన్నికల్లో గులాబీకి గట్టి దెబ్బ తగిలింది. నిర్మొహమాటంగా చెప్పాలంటే… సింగరేణి ఏరియాలో బీఆర్ఎస్కు ఊహించని పరాభవం ఎదురైందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. 30కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే కోల్ బెల్ట్ ఏరియాలో కారు పార్టీ కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది. ఆసిఫాబాద్ నుంచి మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు. ఈ పరిస్థితుల్లో… వచ్చే ఎన్నికల కోసం గట్టిగా వ్యూహరచన చేస్తోందట గులాబీ అధిష్టానం. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలన్నట్టుగా.. సింగరేణి ఏరియా మీద స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే…. కోల్ బెల్ట్‌లోని అసెంబ్లీ సీట్ల సంఖ్య 40కి పెరిగే అవకాశం ఉంది. ఆ లెక్కన రాష్ట్రంలో ఉన్న మొత్తం అసెంబ్లీ సీట్లలో మూడో వంతు ఉండే… సింగరేణి ప్రాంతం మీద ఇప్పట్నుంచే గురి పెడతామని అంటున్నారు బీఆర్ఎస్ లీడర్స్.
గత ఎన్నికల్లో పోగొట్టుకున్న దాన్ని తిరిగి నిలబెట్టుకోవాలంటే… ఇప్పట్నుంచే అలర్ట్ అవక తప్పదన్నది బీఆర్స్ వాయిస్. స్థానిక కార్మికవర్గాల్లో పట్టు సాధించడం.. సింగరేణి పరిధిలోని నియోజకవర్గాల్లో పార్టీని మళ్లీ బలోపేతం చేయడం గులాబీ ప్లాన్‌లోని ముఖ్యాంశాలు. సింగరేణి ఏరియాలో రాజకీయాలు చేయాలంటే అక్కడి కార్మికుల సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని ముందుకు వెళ్ళడం ముఖ్యం. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే పని చేయాలని అనుకుంటోందట. సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా, పెండింగ్ బకాయిలు, మెడికల్ బోర్డుల నిర్వహణ, డిపెండెంట్ ఉద్యోగాలు, కార్మిక సంఘాల ఎన్నికలు.. ఇలా రకరకాల అంశాలను తీసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. వీటిపై ఉద్యమించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో సింగరేణికి చాలా మంచి చేశామని ఓవైపు చెబుతూ…మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదన్న పాయింట్‌ని హైలైట్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. కోల్‌బెల్ట్‌లో ప్రస్తుతం ఒక్క స్థానానికే పరిమితమైన బీఆర్ఎస్…. వచ్చే ఎన్నికల నాటికి తన ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలంటే నియోజకవర్గాల వారీగా పార్టీ పునర్నిర్మాణం అవసరం భావిస్తోందట. అందులో భాగంగా స్థానిక నాయకులను క్రియాశీలకం చేయడం, కార్మిక సంఘాలతో సమన్వయం, పార్టీ క్యాడర్‌ను క్షేత్రస్థాయికి పంపడం లాంటి పనుల మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారట. అందుకోసం ఈనెల 14న రామగుండంలో నిర్వహించబోయే సింగరేణి కార్మిక గర్జనను వేదికగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్టు సమాచారం. సభ తర్వాత కూడా ఇదే వేగంతో నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు చేస్తామని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. దీంతో… తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి గులాబీ వర్గాలు.
Also Read
- Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు... ఆ సీట్లు దక్కేదెవరికి..?
- Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా... ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి...?
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- OTR : రోడ్డెక్కిన ఇల్లందు కాంగ్రెస్ గ్రూప్ వార్... కోరం కనకయ్యకు డేంజర్ బెల్స్ !
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?