ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియరైంది. దానికి సంబంధించి సర్కార్‌కు పలు సూచనలు ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మున్సిపల్, పంచాయితీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్‌కు సిద్ధం కావాలంటూ... ఒక షెడ్యూల్‌తో కూడిన వివరాలు అందజేసింది కమిషన్. వచ్చే ఏడాది జనవరిలోపు మున్సిపాలిటీలకు, ఆ తర్వాత జులైలోపు పంచాయతీలు, జడ్పిటిసి....ఎంపిటిసీలకు ఎన్నికలు జరపాలని సూచించింది.
గత కొంత కాలంగా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై సస్పెన్స్ కొనసాగు వస్తుండగా.. ఈ రోజు ఉత్కంఠకు తెరపడింది.. పొత్తులపై తేల్చుకోవడానికి ఢిల్లీలో మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. అయితే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో ఈ రోజు జరిగిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పొత్తులపై ఓ నిర్ణయానికి వచ్చారు.. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య అవగాహన కుదిరింది.
త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తులపై చంద్రబాబుతో మంతనాలు జరపనున్నారు బీజేపీ ఢిల్లీ పెద్దలు. ఈ నెల 8వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందంటున్నారు.. ఎనిమిదో తేదీన భేటీ కావాలని చంద్రబాబు - పవన్ కల్యాణ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.. ఇక, చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకో సైలెంట్ అయ్యారనే అనుమానాలను వ్యక్తం చేశారు.. అయితే, ఇష్టం ఉన్నా లేకపోయినా.. తెలుగుదేశం పార్టీ, జనసేన, వామపక్షాలు ఏపీలో కలిసి వెళ్లాలని కోరారు.. మూడున్నర ఏళ్లల్లో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించిన ఆయన.. ఏపీలో బీజేపీ, వైసీపీ కలిసే పనిచేస్తున్నాయని ఆరోపించారు.. అందుకే బీజేపీని…