Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
- రాజమండ్రి కార్పొరేషన్ ఎస్సీ, నిడదవోలు మున్సిపాలిటీ ఎస్సీ..
- కొవ్వూరు బీసీ, మండపేట జనరల్ కోటాలో..
- రాజమండ్రిని ఆశించిన కూటమి ఓసీ నేతలకు భంగపాటు..
- మొదట్లో రాజమండ్రిని గట్టిగా ఆశించిన కాషాయ దళం..
- ఎస్సీ రిజర్వ్ అయ్యాక గందరగోళంలో బీజేపీ, జనసేన సైతం..
- ఫైనల్‌గా రాజమండ్రి టీడీపీకే అవుతుందన్న చర్చలు..
- బీసీ కోటాలో ఉన్న కొవ్వూరు కోసం బీజేపీ గట్టి ప్రయత్నాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: స్థానిక ఎన్నికల ముంగిట్లో… తూర్పుగోదావరి జిల్లాలో మారుతున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని సీట్ల కోసం బీజేపీ, జనసేన పోటీ పడుతున్నాయట. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని నిడదవోలు, కొవ్వూరు, మండపేట మున్సిపాలిటీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాజమండ్రి కార్పొరేషన్ ఎస్సీ, నిడదవోలు మున్సిపాలిటీ ఎస్సీ, కొవ్వూరు బీసీ, మండపేట జనరల్ కోటాలో ఉన్నాయి. దీంతో… ఇప్పటి వరకు టిక్కెట్లు ఆశించిన కూటమిలోని వివిధ పార్టీల ఆశావాహులు కంగుతిన్నారట. ఓసీ జనరల్ అవుతాయని భావించిన రాజమండ్రి, నిడదవోలు ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. ఇన్నాళ్ళు ఈ రెండు సీట్లను మూడు పార్టీల్లోని ఓసీలు ఆశించారు. దీంతో వాళ్ళంతా నిరాశ పడటం ఒక ఎత్తయితే… ఏదేమైనా సరే… మన పట్టు తగ్గకూడదంటూ… తమ పార్టీలకే చెందిన, ఆయా సామాజికవర్గాల్లో బలమైన నాయకుల కోసం అన్వేషణ మొదలుపెట్టిన్టటు తెలుస్తోంది. దీంతో తూర్పుగోదావరి కూటమిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు.
ప్రత్యేకించి టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట బీజేపీ, జనసేన ఆశించడంతో రాజకీయం రక్తి కడుతోంది. రాజమండ్రి సిటీలో టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ… ఆ సీటు మాకే కావాలంటూ పోటీ పడుతున్నాయి బీజేపీ, జనసేన. కానీ… ఆ పార్టీలకు ఆర్థికంగా, సామాజికంగా అంత బలమైన నేతలు లేరట. రాజమండ్రి మేయర్ సీటు బీజేపీకే వదిలి పెడతారనే ప్రచారం మొదట్లో జరిగింది. కానీ… ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ కావడంతో… కాషాయ నేతలు కాస్త గందరగోళంలో ఉన్నారట. జనసేనలోనూ ఇదే పరిస్థితి. దీంతో… వాళ్ళే ఎలాగోలా నాయకుల్ని వెదుక్కుని ఎవరైనా కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపుతారా…! లేక తెలుగుదేశం పార్టీకి వదిలి పెడతారా..! అన్నది లేటెస్ట్ డిస్కషన్. ఇప్పటి వరకు మూడుసార్లు జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి వరుసగా రాజమండ్రి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. దాంతో… మళ్లీ టిడిపికే వదిలిపెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. మారిన పరిస్థితుల్లో…. రాజమండ్రి మేయర్ టిక్కెట్టు దక్కకపోతే… కనీసం కొవ్వూరు మున్సిపల్ ఛైర్మన్ సీటు అయినా దక్కించుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సీటు బీసీలకు రిజర్వ్ అవడంతో… బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర రేస్‌లోకి వచ్చారు. కానీ… కొవ్వూరు టీడీపీ నాయకులు పలువురు మాకంటే మాకంటూ ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. నిడదవోలు మున్సిపాలిటీ ఎస్సీ మహిళకు రిజర్వ్ అవడం కూటమి పార్టీలకి కత్తి మీద సాము అయిందట. ఇక్కడ ఆ స్థాయి మహిళా అభ్యర్థులు కరవైనట్టు చెప్పుకుంటున్నారు.
Also Read
దీంతో… కాంట్రాక్టర్ బయ్యా వెంకట్రావు కుటుంబం నుండి ఒకరిని రంగంలోకి దింపే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఇక్కడ రిజర్వేషన్ని మార్చడానికికి ప్రయత్నిస్తున్నారనే గుసగుసలు సైతం ఉన్నాయి. ఇక జనరల్‌లో ఉన్న మండపేటకు టిడిపి నుండే అభ్యర్థి ఖరారు కావచ్చని అంటున్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తమ్ముడి కుమారుడు వేగుళ్ల అజయ్ బాబు పోటీ చేయవచ్చంటున్నారు. ఆయన మీద వైసీపీ నుంచి వేగుళ్ల చైతన్య బాబు పోటీ చేస్తారన్న మాట వినిపిస్తోంది. వీళ్ళిద్దరు ప్రత్యర్తులు అయితే మాత్రం పోటీ రసవత్తంగా మారుతుంది. మొత్తం మీద రిజర్వేషన్స్ అనుకున్నట్టు రాకపోవడం, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట మిత్ర పక్షాలు సీటు ఆశించడం లాంటి పరిణామాలతో తూర్పుగోదావరి కూటమి మున్సిపల్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.
తాజావార్తలు
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!