Off The Record: కొత్తపేటలో బండారు బ్రదర్స్ మధ్య సయోధ్య నిల్.. పొత్తు కుదిరితే కలిసి సాగుతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కీలక నియోజకవర్గం కొత్తపేట. ఇక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీలకు సొంత అన్నదమ్ములే ఇంఛార్జీలు. వారే మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం.. బండారు శ్రీనివాస్. ఇద్దరికీ అస్సలు పడటం లేదు. ఒక చిన్న వివాదం అపోహలతో పెరిగి పెద్దదై పరస్పరం పోటీకి దిగే స్థాయికి చేరింది. 2019 ఎన్నికల్లో ఇద్దరూ అదే చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి సత్యానందం.. జనసేన నుంచి శ్రీనివాసరావు బరిలో ఉండాలని చూస్తున్నారు. వీళ్ల ఆశలు ఎలా ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరితే ఏం చేస్తారు? అనేది పెద్ద ప్రశ్న.
Read Also: Off The Record: ఎమ్మెల్యే వసంత తీరుపై వైసీపీలో చర్చ.. చర్యలు భిన్నం..!
Also Read
పొత్తు పొడిస్తే టికెట్ మాదంటే మాదని ప్రస్తుతం కొత్తపేటలో టీడీపీ, జనసేన వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి. గతంలో ఒకసారి ప్రజారాజ్యం తరఫున సత్యానందం గెలిచారు. తాజా పొత్తులో అది తనకు కలిసి వచ్చే అంశంగా తమ్ముడు శ్రీనివాసరావు లెక్కలేస్తున్నారట. అయితే మూడుసార్లు గెలిచిన తనకే టికెట్ వస్తుంది అన్న సత్యానందం గట్టి ధీమాతో ఉన్నారట. వీళ్ల అభిమానుల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో గెలుపోటములను పక్కన పెడితే.. టీడీపీ, జనసేన మధ్య పొత్తంటూ కుదిరితే.. అన్నదమ్ములు పరస్పరం సహకరించుకుంటారా లేదా అన్నదే పెద్ద చర్చగా ఉంది. ఇప్పటికే బండారు బ్రదర్స్ మధ్య సయోధ్యకు పలువురు కాపు సామాజికవర్గం పెద్దలు విఫలయత్నం చేశారు. సత్యానందం సౌమ్యంగా వ్యవహరిస్తున్నా.. శ్రీనివాసరావు ససేమిరా అంటున్నారట.
Read Also: Off The Record: సాగర్‌లో సయ్యాట.. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ..!
అన్నదమ్ములు కలిసి ఉంటే మీ కుటుంబానిదే గెలుపని పలువురు నచ్చజెబుతున్నా… సత్యానందం, శ్రీనివాసరావు మధ్య సఖ్యత కుదిరే అవకాశాలు కనిపించడం లేదట. తన రాజకీయ ఎదుగుదలకు అన్నే అడ్డుపడుతున్నారనేది తమ్ముడి ఆరోపణ. గతంలో సత్యానందం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగా.. తనకు జడ్పీ ఛైర్మన్ పదవి రాకుండా చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పారని అనుచరులకు చెప్పి వాపోతున్నారట శ్రీనివాసరావు. గడిచిన మూడు ఎన్నికల్లో కొత్తపేటలో టీడీపీ ఓడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారట. పొత్తులో కొత్తపేట టికెట్ జనసేనకు ఇస్తే గెలుపు నల్లేరుపై నడకే అన్నది తమ్ముడి వాదన. అయితే తనకు ఆఖరి అవకాశం ఇవ్వాలని సత్యానందం కోరుతున్నారట. టీడీపీ, జనసేనలో అన్నదమ్ముల మధ్య జరుగుతున్న గొడవలను.. వైసీపీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా చిర్ల జగ్గిరెడ్డి ఉన్నారు. నియోజకవర్గంలో బలమైన పునాది వేసుకోవడంతో జగ్గిరెడ్డి గట్టి ధీమాతో కనిపిస్తున్నారట. అన్నదమ్ములు ఇదే విధంగా గొడవ పడితే తమ పని ఇంకా సులువు అవుతుందని చెబుతున్నారట. గతంలో ఈ వైరమే తమకు కలిసి వచ్చిందని.. వచ్చే ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని అనుకుంటున్నారట వైసీపీ నాయకులు. మరి.. గెలుపే లక్ష్యంగా అన్నదమ్ములు కలిసి పోతారో.. పంతాలకే ప్రాధాన్యం ఇస్తారో.. కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!