Off The Record: డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కీలక నియోజకవర్గం కొత్తపేట. ఇక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీలకు సొంత అన్నదమ్ములే ఇంఛార్జీలు. వారే మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం.. బండారు శ్రీనివాస్. ఇద్దరికీ అస్సలు పడటం లేదు. ఒక చిన్న వివాదం అపోహలతో పెరిగి పెద్దదై పరస్పరం పోటీకి దిగే స్థాయికి చేరింది. 2019 ఎన్నికల్లో ఇద్దరూ అదే చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి సత్యానందం.. జనసేన నుంచి శ్రీనివాసరావు బరిలో ఉండాలని చూస్తున్నారు.…