Off The Record: టీడీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే వన్ టు వన్ మీటింగ్స్‌తో కొందరికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక వీలున్నప్పుడల్లా నలుగురైదుగురు శాసనసభ్యులను పిలిచి క్లాస్ పీకుతున్నారు. ఇప్పటివరకు పాతికమంది దాకా ఎమ్మెల్యేలతో డైరెక్ట్‌గా మాట్లాడారట సీఎం. నియోజకవర్గాల్లోని పరిస్థితులు, ఎమ్మెల్యేలు వ్యవహారశైలి, వస్తున్న ఆరోపణల్లాంటి అంశాలన్నీ ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తున్నాయట. అయితే… ఇప్పుడు పార్టీ వర్గాలతో పాటు బయట కూడా చాలా మందిలో ఒకటే డౌట్. అంతమందిని పిలిచి బాబు మాట్లాడారు, వార్నింగ్స్ ఇస్తున్నారు సరే…. మరి అవేమన్నా పని చేస్తున్నాయా? ఎమ్మెల్యేల తీరు మారుతోందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వాటికి సమాధానం మాత్రం ఎస్…. అని ఠక్కున చెప్పలేకున్నా… మార్పు వస్తుండొచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి. బోనులో నిలబడ్డ కొందరిలో కాస్తో కూస్తో ఛేంజ్ కనిపిస్తోందట. ప్రధానంగా నియోజకవర్గాల్లో మితిమీరి ప్రవర్తిస్తున్న వాళ్ళ వైఖరిలో కొద్దిగా మార్పు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Nepal Crisis: ఆకలి, దాహం, భయం.. నేపాల్ నుంచి భారత్ కు నడిచి వచ్చిన కార్మికుల కథ..
అయితే… అది చాలదని, ఇంకా మారాల్సి ఉందని సీఎం అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. శాసనసభ్యుల పనితీరుపై తీవ్ర విమర్శలు పెరుగుతున్న ఒకానొక సందర్భంలో వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని సీరియస్‌గానే చెప్పారు చంద్రబాబు. కానీ… ఆ వార్నింగ్స్ అందరికీ ఎక్కాయా అన్నది ఇప్పటికీ డౌటేనంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అరాచకాలు మితిమీరిపోతున్నాయని, శాండ్, లిక్కర్ మాఫియాలు పేట్రేగిపోతున్నాయన్న అభిప్రాయం బలంగా ఉంది. దీంతో సీఎం చంద్రబాబు వెంటనే అలెర్ట్ అయ్యారు.. మొదటి ఆరు నెలల తర్వాత నుంచి తీవ్ర ఆరోపణలు రావడంతో…. వాళ్ళని సెట్ చేసే బాధ్యతను జిల్లా మంత్రులకు అప్పగించారు. అయినప్పటికీ కొంతమందిలో మార్పు రావడం లేదని గ్రహించారు సీఎం. దాంతో అమరావతికి పిలిపించి వరుస క్లాస్‌లు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే… ఇప్పుడిప్పుడే కాస్త మార్పు మొదలైనట్టు కనిపిస్తున్నా… వస్తున్న ఆరోపణల తీవ్రత దృష్ట్యా ఆ మార్పు చాలదన్న అభిప్రాయం ఉందట. అదే సమయంలో ఇప్పటికీ మారకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయం కూడా బలపడుతోంది పార్టీ వర్గాల్లో. మళ్ళీ ఎన్నికలను ఫేస్ చేయాలంటే ఎమ్మెల్యేల పనితీరే ముఖ్యం కాబట్టి.. వాళ్ళలో మార్పు తీసుకురావాలని గట్టిగా అనుకుంటున్నారట చంద్రబాబు.
Read Also: Brahmanandam : పొలిటికల్ ఎంట్రీపై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
ఎన్నికల టైంలో వాళ్ళని మార్చడం కంటే… ఇప్పటి నుంచే మార్పు తీసుకురావడం ముఖ్యమన్నది ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది. అందులో భాగంగానే పదేపదే హెచ్చరిస్తున్నారట చంద్రబాబు. అవి కాస్త ఫలించి ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల దూకుడు తగ్గుతున్నట్టు తెలుస్తోంది. లిక్కర్, ఇసుక వంటి అంశాల్లో కూడా కొంత సంయమనం పాటిస్తున్నారట. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారుల మార్పు జరుగుతోంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక ఇంకోసారి ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి…..మరోసారి సీఎం అందరు ఎమ్మెల్యేలతో భేటీ అవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అంత చెప్పాక కూడా మార్పు రాకపోతే…. పూర్తిగా తోక కత్తిరించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవలి సూపర్ సిక్స్, సూపర్ హిట్ సభలో కూడా ఎమ్మెల్యేల మార్పు అంశాన్ని ప్రస్తావించారు సీఎం. ఒక్క ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వచ్చినా… అది మొత్తం ప్రభుత్వం మీద ప్రభావం చూపుతుందని అన్నారాయన. ఈ రకంగా వరుసబెట్టి చంద్రబాబు చెబుతున్న మాటలు కొందరికి ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నాయని, అందుకే ఆచితూచి వ్యవహరించడం మొదలైందన్న టాక్ నడుస్తోంది టీడీపీ సర్కిల్స్‌లో. అయితే… ఇది చాలదన్న సీఎం తాను ఆశించినంత మార్పు రావడం కోసం ఏం చేస్తారు? అరాచక శాసనసభ్యుల్ని ఎలా కట్టడి చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.