Off The Record: భూమా మౌనిక రాజకీయాల్లోకి వెళ్తే మద్దతిస్తానని అన్నారు ఆమె భర్త.. హీరో మంచు మనోజ్. ఆ స్టేట్‌మెంట్ తర్వాత మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా.. ఎన్నికల్లో పోటీ చేస్తారా… అనే ఆరాలు మొదలయ్యాయి. భర్త సపోర్ట్‌తో మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. వివాహ బంధంతో ఒక్కటైన తర్వాత హీరో మంచు మనోజ్.. భూమా మౌనికారెడ్డిలు ఆ సంతోష క్షణాలను ఆస్వాదిస్తుంటే.. తిరుమలలో మనోజ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రం హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ఈ జంటతో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి కూడా ఉండటంతో అనేక పొలిటికల్ ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మంచు, భూమా కుటుంబాలకు రాజకీయాలు కొత్తకాదు. రెండు వైపులా పొలిటికల్ పరిచయాలు ఉన్నాయి. యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉంది మాత్రం భూమా ఫ్యామిలీనే. అందుకే మనోజ్ వ్యాఖ్యలతో మౌనికారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా అని కొందరు వాకబు చేస్తున్నారు.
Read Also: YS Viveka murder case: హైకోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి.. ఆ ఆదేశాలు ఇవ్వండి..
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో భూమా కుటుంబానికి పట్టు ఉంది. గతంలో మౌనికారెడ్డి తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు ఈ రెండుచోట్ల గెలిచినవాళ్లే. వాళ్ల తర్వాత మౌనిక అక్క అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి MLAగా గెలిచి మంత్రిగానూ చేశారు. టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నారు. నంద్యాలలో వాళ్ల కజిన్ భూమా బ్రహ్మానందరెడ్డిది యాక్టివ్ రోల్. ఒకవేళ మౌనికారెడ్డి టీడీపీతోనే ప్రయాణం కొనసాగించాలని అనుకుంటే ఎన్నికల్లో పోటీ చేస్తారా అనేది మరో ప్రశ్న. పోటీ చేయాలని అనుకుంటే ఆళ్లగడ్డ, నంద్యాలలో ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారో.. ఏమో..!
Read Also: Nagababu: నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు.. తమ్మారెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్
ఆ మధ్య అఖిలప్రియకు.. మౌనికారెడ్డిలకు పొసగడం లేదని ప్రచారం జరిగింది. పెళ్లిలో వీరిద్దరూ కలిసి కనిపించినా.. గ్యాప్ పూడలేదని టాక్. అందుకే చెల్లి కూడా పాలిటిక్స్‌లోకి వస్తానంటే అక్క రియాక్షన్ ఏంటో తెలియదు. భూమా మౌనిక మనసు మాత్రం ఆళ్లగడ్డపైనే ఉందనేది కొందరి మాట. ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వస్తే మాత్రం ఆమె ఆళ్లగడ్డనే ఎంచుకుంటారని అనుకుంటున్నారు. మోహన్‌బాబు కుటుంబానికి వైసీపీ అధినేతతో ఉన్న బంధుత్వం కూడా.. మౌనిక చుట్టూ జరుగుతున్న చర్చను మరికొందరు అటు మళ్లిస్తున్నారు. గతంలో భూమా దంపతులు జగన్‌కు మద్దతుగా ఉండటంతో కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. ఈ ఎపిసోడ్‌లో వినిపిస్తున్న మరో పార్టీ పేరు BRS. పెళ్లిలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో.. గులాబీ పార్టీకి మొగ్గు చూపుతారా అని ఇంకొందరు ఆరా తీస్తున్నారట. BRS ఏపీలో విస్తరించాలని చూడటాన్ని కొట్టిపారేయలేమంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా భూమా ఫ్యామిలీ పట్ల మంచి అభిప్రాయంతోనే ఉన్నారని చెబుతున్నారు. ఈ విషయంలో ఎవరి విశ్లేషణలు ఎలా ఉన్నప్పటికీ.. మౌనికారెడ్డి మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించే ఆలోచనలో లేరనేది ఆమె సన్నిహితుల మాట. ఒకవేళ భవిష్యత్‌లో మనసు మార్చుకుంటే.. ఆళ్లగడ్డను విడిచి పెట్టకపోవచ్చని అనుకుంటున్నారు.