Off The Record: వంగవీటి రంగా చుట్టూ ఏపీ పాలిటిక్స్..
- వంగవీటి రంగా చుట్టూ ఏపీ పాలిటిక్స్..
- జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పొలిటికల్ హంగామా..
- ఈసారి జయంతికి స్పందించని కూటమి ముఖ్య నేతలు..
- రాధా టీడీపీలోనే ఉన్నా ఎందుకలా అంటూ ఆరాలు..
- కూటమి పెద్దలు గుర్తు చేసుకోలేదంటూ ఓ వర్గం అసంతృప్తి..
- వంగవీటి రాధాకు ఏ పదవీ ఇవ్వలేదని ఇప్పటికే అసహనం..
- తాజా ఎపిసోడ్‌తో రంగా అభిమానులు ఫీలవుతున్నారన్న టాక్..
- కనీసం పవన్‌కళ్యాణ్ ఎందుకు రియాక్ట్ అవలేదన్న క్వశ్చన్..
- ఎక్స్ మెసేజ్ కూడా ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: వంగవీటి మోహన రంగా… ఆయన భౌతికంగా దూరమై దశాబ్దాలు గడుస్తున్నా… ఆ పేరు మాత్రం ఎప్పటికప్పుడు ఏపీ పాలిటిక్స్‌ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎన్నికలు వచ్చినప్పుడైతే… రకరకాల ఈక్వేషన్స్ వంగవీటి చుట్టూనే తిరుగుతుంటాయి. కులాలకు అతీతంగా ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉన్నా… ప్రత్యేకించి కాపులు మాత్రం ఎక్కువగా ఓన్ చేసుకుంటారు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పొలిటికల్ హంగామా కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటుంది.ఎన్నికల సమయంలో అయితే రంగా నామస్మరణ చేయడం ఇటీవల సర్వ సాధారణమైపోయింది. రంగా కుమారుడు రాధా సెంట్రిక్‌గా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి రాజకీయ పార్టీలు. అదంతా ఒక ఎత్తయితే… ఈసారి రంగా జయంతికి కూటమి పార్టీల పెద్దలెవరూ ఆయన్ని గుర్తు చేసుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఈనెల 4న వంగవీటి రంగా జయంతి జరిగింది. రాధా ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు. అయినాసరే… కూటమి పెద్దలు ఆ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం వెనక రీజన్స్ ఏంటంటూ ఆరా తీస్తున్నాయి రాజకీయవర్గాలు.
Read Also: Story Board: మహిళా రిజర్వేషన్ బిల్లు.. చట్టసభలన్నింటికీ రిజర్వేషన్ వర్తిస్తుందా?
Also Read
2004 తర్వాత వంగవీటి రాధా అధికార పక్షంలో ఉన్నది ఇప్పుడే కావడంతో… రంగా జయంతి వేడుకలు ఘనంగా జరుగుతాయని భావించారట ఆయన అభిమానులు. కానీ… అలాంటిదేమీ లేకపోగా…. కూటమి పెద్దలు జయంతి రోజున కనీసం గుర్తు చేసుకోలేదంటూ… ఓ వర్గం అసంతృప్తిగా ఉందట. రాధా టీడీపీలో ఉండి, ఎన్నికల సమయంలో కూటమి గెలుపు కోసం పూర్తి స్థాయిలోపనిచేసినా కూడా రంగాను గుర్తు చేసుకోకపోవటం ఏంటంటూ.. గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచాక కూడా కూటమి ప్రభుత్వం రాధాకు ఏ పదవీ ఇవ్వలేదని ఆగ్రహంతో ఉన్న రంగా అభిమానుల్ని…. ఈ ఎపిసోడ్ మరింత బాధ పెడుతోందట. టీడీపీ సంగతి సరే… కనీసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు రియాక్ట్ అవలేదన్న చర్చ జరుగుతోందట వంగవీటి అభిమానుల మధ్య. రంగా జయంతి రోజున కనీసం ట్వీట్ కూడా పెట్టకపోవటాన్ని ప్రత్యేకంగా చూడాలని మాట్లాడుకుంటున్నట్టు సమాచారం.
Read Also: Sheikh Hasina: మనస్సాక్షి ప్రకారం అప్పగించండి.. షేక్ హసీనాపై భారత్‌కు బంగ్లాదేశ్ కొత్త ప్రతిపాదన
కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ ఎన్నికలకు ముందు అనేక కార్యక్రమాల్లో రంగా గురించి, ఆయన గొప్పతనం గురించి పదే పదే చెప్పారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక జయంతిపై కనీసం ట్వీట్ చేయకపోవడాన్ని తేడాగానే చూడాలంటున్నారటన్నారట రంగా అభిమానులు. సెలబ్రిటీల పుట్టిన రోజుల గురించి ఎక్స్ మెసేజ్‌లు పెడుతున్న పవన్… పదే పదే ఎన్నికలకు ముందు స్మరించిన దివంగత నేత గురించి మాత్రం స్పందించకపోవడం ఏంటన్న చర్చ కాపు సామాజికవర్గంలో సైతం జరుగుతోందంటున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే… ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ ఈసారి రంగా జయంతిపై ఎక్స్‌లో మెసేజ్ పెట్టారు. గత కొన్నేళ్ళుగా రంగా గురించి స్పందించని జగన్…ఇప్పుడు మెసేజ్ పెట్టడం, అదే సమయంలో కూటమి నుంచి స్పందనలు లేకపోవడం పొలిటికల్ హాట్ అయింది. రంగాను ఎన్నికల సమయంలో ఓటు బ్యాంక్‌గా కాకుండా అన్ని సందర్బాల్లో స్మరించుకోవాలన్నది ఆయన అభిమానుల ఆకాంక్షగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?