Off The Record: ఆంధ్రప్రదేశ్ కాషాయ దళంలో…. కుర్చీ కుస్తీ మొదలైందా అంటే…. అవును, అలాగే కనిపిస్తోందని అంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీ సంస్థాగత ఎన్నికలు నడుస్తున్నాయి. అందులో భాగంగా చాలా రాష్ట్రాల అధ్యక్షులను మారుస్తారన్న టాక్ ఉంది. ఈ క్రమంలోనే ఏపీ అధ్యక్ష పీఠం ఈసారి ఎవరికన్న చర్చ మొదలైంది. పురందేశ్వరినే తిరిగి కొనవసాగిస్తారని ఓ వర్గం అంటుంటే…మరో వర్గం మాత్రం… అంత సీన్ లేదమ్మా, ఈసారి కొత్త వాళ్ళకే ఛాన్స్ అంటూ దీర్ఘాలు తీస్తోందట. దీంతో చర్చ రసవత్తరంగా మారుతోంది. పురందేశ్వరి కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్నారన్నది ఆమె సన్నిహితుల మాట. ఒకవేళ అది కుదరని పక్షంలో… మరోసారి రాష్ట్ర బాధ్యతలు తనకే ఇవ్వాలంటూ పార్టీ పెద్దల్ని రిక్వెస్ట్ చేశారట ఆమె. అంటే… అయితే కేంద్ర మంత్రి పదవి, కాకుంటే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పీఠం. రెంటిలో ఏదో ఒకటి మాత్రం తనకు కచ్చితంగా కావాలన్నది హై కమాండ్‌కు ఆమె విన్నపంగా తెలుస్తోంది.
Read Also: Health Tips : స్నానం చేసేటప్పుడు జుట్టు రాలుతుందా?
అయితే… ఇప్పుడున్న పరిస్థితుల్లో… కేంద్ర కేబినెట్ బెర్త్ కంటే…. ఆమెకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చేందుకే అధిష్టానం మొగ్గు చూపవచ్చన్నది ఏపీ బీజేపీ వర్గాల ఇన్నర్ వాయిస్. 2024 ఎన్నికల్లో పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించారని, ఏపీలో అధికార భాగస్వామ్యం రావడం వెనక పురందేశ్వరి ప్లానింగ్, కృషి ఉన్నాయని, పార్టీ పెద్దలకు ఆ విషయం తెలుసు గనుక ఆమె సేవల్ని ఇక్కడ పార్టీ బలోపేతానికే ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది ఎక్కువ మంది నాయకుల మనోగతమట. అదే సమయంలో మరో వర్గం మాత్రం అందుకు భిన్నమైన వాదన వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. పురందేశ్వరికంటే ముందు నుంచే… దశాబ్దాల తరబడి పార్టీకి సేవలందిస్తున్న సీనియర్స్ చాలా మంది ఉన్నారని, ఈసారి అలాంటి వారికి అవకాశం ఇచ్చి…. ఆమె సేవల్ని మరో రూపంలో వాడుకునే అవకాశం ఉందన్నది వాళ్ళ వాదన. పురంధేశ్వరి ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై సరిగా దృష్టి పెట్టలేదని, చివరికి కార్యాలయ వ్యవహారాలను కూడా సరిగా పట్టించుకోలేదంటూ సదరు లీడర్స్ వాదిస్తున్నట్టు తెలిసింది.
Read Also: Blinkit: అంబులెన్స్ సేవలు ప్రారంభించిన బ్లింకిట్.. కాల్ చేసిన టెన్ మినిట్స్‌లోనే..!
ఢిల్లీ పెద్దల దగ్గర ఆ పాయింట్స్‌నే హైలైట్ చేస్తున్నారట. మరోవైపు సీనియర్ ఆశావహుల్లో కొందరు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. తమదైన శైలిలో పావులు కదుపుతూ… ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని రిక్వెస్ట్ పెట్టాలనుకుంటున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో… పురందేశ్వరి వర్గం మళ్ళీ ఆమెకే ఛాన్స్ అంటుంటే… అవతలి వర్గం మాత్రం మా ప్లాన్స్ మాకున్నాయని చెబుతున్నారట. రేస్‌లో ప్రధానంగా మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే…. కిరణ్‌కుమార్ పార్టీ కండువా కప్పుకుని సైలెంట్‌గా ఉన్నారే తప్ప పెద్దగా ఉపయోగపడటం లేదని, విష్ణు కుమార్‌రాజు పర్సనల్ ఎక్జ్‌పోజర్ కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప ఓవరాల్‌గా పార్టీ గురించి ఆలోచించడం లేదన్న్ అభిప్రాయం ఢిల్లీ నాయకత్వానికి ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వీరితో పాటు మరికొందరు సీనియర్లు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పురందేశ్వరికే మరోసారి ఎక్స్‌టెనన్షన్ ఇస్తారా? లేక కొత్త నేత తెర మీదికి వస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. పెద్దల నిర్ణయం ఎలా ఉంటుందోనని ఉత్కంఠగా చూస్తున్నాయి ఏపీ బీజేపీ వర్గాలు.