చాలా మందికి స్నానం చేసేటప్పుడు ఎక్కువగా జుట్టు రాలిపోతుంది. ఇది తగ్గాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
స్నానం చేసే ముందు జుట్టు దువ్వుకోవాలి. దీనివల్ల వెంట్రుకలు చిక్కుళ్లు పోయి.. హెయిర్ బ్రేక్ కాకుండా ఉంటుంది.
స్నానానికి గోరు వెచ్చటి నీటిని వినియోగించండి. వేడి నీళ్లతో చేస్తే.. జుట్టు రాలే సమస్య పెరుగుతుంది.
షాంపూను డైరెక్ట్‌గా కాకుండా.. నీటితో కలిపి ఆ తర్వాత జుట్టుకు అప్లై చేయాలంటున్నారు.
తలస్నానానికి ముందు హెడ్ మసాజ్ చేసుకోవడం మంచిది.
కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, ఆముదం, ఆవాల నూనె, బాదం నూనెను గోరు వెచ్చగా చేసుకుని జుట్టుకు అప్లై చేసుకోవాలి.
షాంపూతో తలస్నానం చేసిన తర్వాత కండీషన్ వాడాలి.
తలస్నానం చేశాక తుడుచుకోవడం కోసం మృదువైన టవల్ ఉపయోగించాలి. టవల్‌ని కూడా గట్టిగా వాడకూడదు.
చాలా మంది స్నానం చేశాక.. తడి జుట్టుతోనే దువ్వుకుంటుంటారు. ఇలా చేస్తే జుట్టు డ్యామేజ్ పెరుగుతుంది.