ఆంధ్రప్రదేశ్ కాషాయ దళంలో.... కుర్చీ కుస్తీ మొదలైందా అంటే.... అవును, అలాగే కనిపిస్తోందని అంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీ సంస్థాగత ఎన్నికలు నడుస్తున్నాయి. అందులో భాగంగా చాలా రాష్ట్రాల అధ్యక్షులను మారుస్తారన్న టాక్ ఉంది. ఈ క్రమంలోనే ఏపీ అధ్యక్ష పీఠం ఈసారి ఎవరికన్న చర్చ మొదలైంది. పురందేశ్వరినే తిరిగి కొనవసాగిస్తారని ఓ వర్గం అంటుంటే...మరో వర్గం మాత్రం... అంత సీన్ లేదమ్మా, ఈసారి కొత్త వాళ్ళకే ఛాన్స్ అంటూ దీర్ఘాలు తీస్తోందట.