ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ సభలకు నో ఎంట్రీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ జిల్లాల నాయకుల తీరే వేరా? పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాల్లో నేతలు ఎందుకు స్తబ్దుగా ఉన్నారు? పార్టీ కార్యక్రమాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారా? గ్రేటర్‌కు ఆనుకుని ఉన్న జిల్లాలోనూ అదే పరిస్థితి ఉందా?
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పీసీసీ కార్యక్రమాలకు నో ఎంట్రీ..!
Also Read
పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉండిపోయారు. ఈ రెండు జిల్లాల్లో పార్టీకి బలమైన నాయకత్వమే కాదు.. బలమైన కేడర్ కూడా ఉంది. అలాంటిది ఆ రెండు ఉమ్మడి జిల్లాల్లో నేతలు స్తబ్దుగా ఉండిపోవడం గాంధీభవన్ వర్గాల్లో చర్చగా మారింది. కొత్త పీసీసీ సారథ్యంలో పలు జిల్లాల్లో సభలు.. సమావేశాలు పెడుతున్నారు. మరికొన్ని జిల్లాల నుంచి కూడా నాయకులు ముందుకొచ్చి.. సభలకు డేట్ ఫిక్స్ చేయమని కోరే పరిస్థితి ఉందట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక నాయకులు అప్పుడప్పుడూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పీసీసీ ఎంట్రీ ఇవ్వలేని పరిస్థితి.
రేవంత్‌ను ఓపెన్‌గానే వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి..!
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిలు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినవారు. పార్టీలో హేమాహేమీలుగా గుర్తింపు పొందినా.. ఇక్కడ పార్టీ యాక్టివిటీ లేకపోవడంలో రకరకాలుగా చర్చకు దారితీస్తోంది. అయితే దీనికి కారణాలు లేకపోలేదు. ఆ ప్రభావం వల్లే పీసీసీ కూడా ఇటు పెద్దగా ఫోకస్ పెట్టడం లేదని తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పీసీసీ చీఫ్ పదవి దక్కలేదన్న బాధ నుంచి ఇంకా బయటపడలేదు. రేవంత్‌ను ఓపెన్‌గానే వ్యతిరేకిస్తున్నారు. పీసీసీ తలపెట్టిన ఏ కార్యక్రమంలోనూ వెంకటరెడ్డి చురుకుగా పాల్గొనడం లేదు. దళిత గిరిజన దండోరా సభ నల్లగొండలో పెట్టాలని అనుకున్నా.. అక్కడి నాయకులు నో చెప్పడంతో దానికి బ్రేక్ పడింది.
ఉత్తమ్, రేవంత్ మధ్య సఖ్యత లేదు?
పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా ప్రాతినిథ్యం వహించే చోట కాంగ్రెస్ కార్యక్రమాల ఊసే లేదు. పైగా ఉత్తమ్, రేవంత్ మధ్య సఖ్యత లేదన్నది ఓపెన్ టాక్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్‌పై ఓపెన్‌గా విమర్శలు చేస్తే.. ఉత్తమ్ ఎక్కడా బయట పడరు. చేయాల్సింది కామ్‌గా చేసుకుని వెళ్లిపోతారని రేవంత్ టీమ్ అనుమానం. పీసీసీకి వ్యతిరేకంగా మాట్లాడేవారి వెనక ఉత్తమ్ ఉన్నారనే అనుమానం కూడా రేవంత్‌కు ఉందట. ఇలా నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నాయకులతో సఖ్యత లేకపోవడంతో అక్కడ సభలు, సమావేశాల ప్రస్తావనే లేదు.
జానారెడ్డి ఇలాకాలోనూ సభలు పెట్టలేని పరిస్థితి..!
మాజీ మంత్రి జానారెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జానారెడ్డి కుమారుడు రఘువీర్‌తో రేవంత్ ఇంకా సన్నిహితంగా ఉంటారు. జానారెడ్డి ఇలాకాలో సభ పెట్టాలని అనుకున్నా.. ఓ ముఖ్య నాయకుడు నో చెప్పినట్టు సమాచారం. దీంతో పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉండే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ సైలెంట్ అయిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంకా గాంధీపట్ల పోలీసుల తీరును నిరసిస్తూ జరిగిన ఆందోళనలో ఈ ఎంపీలిద్దరూ తళుక్కుమన్నారు.
గొడవల వల్లే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు దూరంగా రేవంత్?
పీసీసీతో ఇక్కడి నాయకుల వైరం ఎప్పటి వరకు కొనసాగుతుంది? కలిసి పనిచేసే పరిస్థితులు ఉన్నాయా.. లేవా? కాంగ్రెస్‌లో ఇదో అంతుచిక్కని ప్రశ్న. అప్పట్లో ఇబ్రహీంపట్నం సభ విషయంలోనే రేవంత్, కోమటిరెడ్డి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. నాటి నుంచి ఉమ్మడి నల్లగొండ జోలికి రేవంత్ వెళ్లడం లేదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. మరి.. ఈ పంచాయితీలకు పార్టీ పెద్దలు ఫుల్స్టాప్ పెడతారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
-
JR NTR Office : ‘RAW NTR’ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్‌పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!